Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

పహల్గామ్ ఉగ్ర దాడి…ముస్లింలను చంపితే దేశభక్తి, హిందువులను చంపితే ఉగ్రవాదమా? ఇదెక్కడి ద్వంద నీతి!

పహల్గామ్‌లో 27 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలను బలిగొన్న క్రూరమైన ఉగ్రవాద దాడి క్షమించరాని ఉగ్రవాద చర్య అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక అమాయకుడిని చంపడం మొత్తం మానవాళిని చంపడంతో సమానమని ఖురాన్ నిస్సందేహంగా పేర్కొంది (సూరా అల్-మాయిదా, 5:32). ఈ హేయమైన చర్య ఇస్లాం ప్రధాన సూత్రాలను ఉల్లంఘిస్తుంది. ముస్లిం సమాజం దీనిని తీవ్రంగా ఖండించడంలో ఐక్యమత్యం ప్రదర్శించింది. అటువంటి హింసను ఎవరూ సమర్థించరు. బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలి. అయితే, పహల్గామ్ విషాదం భారతదేశంలో […]
Read more

ఏడవతరగతి పాఠ్య పుస్తకంలో మొగలుల‌ చరిత్ర తొలగింపు!

న్యూఢిల్లీ : ఈ ఏడాది ఎన్‌సీఈఆర్‌టీ ఏడవ తరగతి సాంఘికశాస్త్రంలో మొగలుల చరిత్ర, ఢిల్లీ సుల్తానుల పాఠ్యాంశాలను తొలగించారు. వాటి స్థానంలో మగధ, మౌర్యులు, శుంగాలు, శాతవాహనులు వంటి పురాతన భారతీయ రాజవంశాలను పరిచయం చేశారు. కొత్త పాఠ్యపుస్తకంలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన 2025 మహా కుంభమేళా గురించి కూడా ప్రస్తావించారు. ఇంకా, ఇది వివిధ అధ్యాయాలలో అనేక సంస్కృత పదాలను చేర్చారు. ఉదాహరణకు జనపద (అంటే “ప్రజలు స్థిరపడిన ప్రదేశం”), సమ్రాజ్ (“సుప్రీం పాలకుడు”), అధిరాజ […]
Read more

పహల్గామ్ దాడిని కారణంగా చూపుతూ… గర్భిణీ ముస్లిం మహిళకు చికిత్స చేయనన్న డాక్టర్‌!

కోల్‌కతా : అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో గత దశాబ్ద కాలంగా మనుషుల్ని విభజించే, భయాన్ని సృష్టించే, మన సమాజంలోని ఓ పెద్ద వర్గాన్ని వేరు చేసే విద్వేష రాజకీయాలను చూస్తున్నాం. సామాజిక జీవనంలో మతవిద్వేషం ఎంతగా బుసలు కొడుతుందో ఈ కథనాన్ని చదివితే మీకే తెలుస్తుంది. ‌ కోల్‌కతాలో జరిగిన తీవ్ర కలకలం రేపిన సంఘటనలో, గర్భిణీ ముస్లిం మహిళకు ఆమెను తరుచూ పరీక్షిస్తున్న గైనకాలజిస్ట్ వైద్య చికిత్స నిరాకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. దక్షిణ […]
Read more

‘కుక్కలు, ముస్లింలకు అనుమతి లేదు’అంటూ బెంగాల్‌ వ్యవసాయ వర్సిటీలో వివాదాస్పద పోస్టర్‌!

కోల్‌కత : పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలోని బిధాన్ చంద్ర కృషి విశ్వవిద్యాలయ (BCKV) వ్యవసాయ విభాగం ప్రవేశ ద్వారం నోటీసు బోర్డులో అవమానకరమైన పోస్టర్ కనిపించింది. ఇది విద్యార్థులు, అధ్యాపకులలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. BCKV భారతదేశంలోని ప్రముఖ వ్యవసాయ విశ్వవిద్యాలయాలలో ఒకటి, ఇస్లామోఫోబిక్‌ సందేశం కనిపించడం క్యాంపస్ కమ్యూనిటీని తీవ్రంగా కలవరపెట్టింది. చేతితో రాసిన పోస్టర్‌లో ఇలా ఉంది: “కుక్కలు, ముస్లింలకు అనుమతి లేదు. అందరి దృష్టి పహల్గామ్‌పైనే ఉంది. ఉగ్రవాదం అంటే ఇస్లాం.” ఈ […]
Read more

ప్రధాని మోదీ హయాంలో కాశ్మీర్ విధానం పూర్తిగా విఫలమైందన్న శివసేన ‘సామ్నా’ సంపాదకీయం!

ముంబై : జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదం ఇంకా ముగియలేదని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలో కాశ్మీర్ విధానం పూర్తిగావిఫలమైందని శివసేన (యుబిటి) తన మౌత్ పీస్ ‘సామ్నా’లో ఘాటైన సంపాదకీయం రాసింది. “దేశంలో మతపరమైన ద్వేషపూరిత వాతావరణం సృష్టిస్తే” ఇలాగే జరుగుతుందని ఆ పార్టీ పేర్కొంది. “పాకిస్తాన్‌ను బెదిరించడం ద్వారా ఈ సమస్య పరిష్కారం కాదు. ఇటువంటి బెదిరింపులు ప్రధాని మోడీ భక్తులను సంతోషపరుస్తాయి. పాకిస్తాన్ వెన్ను ఇంకా విరగలేదు. పహల్గామ్‌లో ఉగ్రవాదులు హిందూ నకిలీ రక్షకులపై […]
Read more

మణిపూర్‌లో మళ్లీ అలజడి…మంటల్లో కాలిపోయిన కుకీ గ్రామాలు, కర్ఫ్యూ విధింపు

ఇంఫాల్‌ : బుధవారం సాయంత్రం, మణిపూర్‌లోని కామ్జోంగ్, సహంఫుంగ్‌లోని రెండు గ్రామాల్లోని కుకి ఇళ్లకు దుండగులు నిప్పంటించి, వాటిని ధ్వంసం చేశారు. 28 ఇళ్లు కాలి బూడిదయ్యాయని అంచనా. ఈ ఘటన తరువాత జిల్లా మేజిస్ట్రేట్ రెండు గ్రామాల్లో కర్ఫ్యూ విధించారు. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని పోలీసు అధికారులు తెలిపారు. అయితే, ఈ దాడి కారణంగా ఇళ్ళు, జీవనోపాధిని కోల్పోవడంతో అనేక కుకీల కుటుంబాలు నాశనమయ్యాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సహంఫంగ్ సబ్ డివిజన్ […]
Read more

పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారతదేశం అంతటా కాశ్మీరీ విద్యార్థులపై దాడులు, వేధింపులు!

న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన క్రూరమైన ఉగ్రవాద దాడిలో కనీసం 25 మంది పర్యాటకులు, ఒక స్థానికుడు ప్రాణాలు కోల్పోయిన తరువాత, భారతదేశం అంతటా కాశ్మీరీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వేధింపులు పెరుగుతున్నాయి. చండీగఢ్‌లోని ఒక కాశ్మీరీ ముస్లిం బాలిక ఇంటికి తిరిగి వెళ్లడానికి తక్షణ సహాయం కోరుతోంది, స్థానిక వేధింపులను ఎదుర్కొంటోంది. ఆమెను, ఇతరులను బలవంతంగా దింపేసిన క్యాబ్ డ్రైవర్ ఆమెపై దాడి చేశాడు. https://www.instagram.com/reel/DI1EVCMJpCG/?igsh=eDZobmRycms0YjMz జమ్మూ కాశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ (JKSA) […]
Read more

పహల్గాం ఉగ్రదాడి భద్రతా వైఫల్యమే…అఖిలపక్ష సమావేశానికి ప్రధాని గైర్హాజరు!

న్యూఢిల్లీ : పహల్గాం ఉగ్ర దాడిలో భద్రతా లోపాలు ఉన్న మాట నిజమేనని అఖిల పక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. సమావేశంలో, ఉగ్రవాదంపై చర్య తీసుకోవడంలో ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రతిపక్ష సభ్యులు హామీ ఇస్తూనే, సమావేశంలో ప్రధాని మోదీ లేకపోవడం, దాడికి దారితీసిన లోపాలు, దాడి తర్వాత మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ద్వేషపూరిత ప్రచారం గురించి కూడా ప్రశ్నలు లేవనెత్తారని ది వైర్ వార్తాసంస్థ తెలిపింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ […]
Read more

పహల్గామ్ దాడి తర్వాత ముస్లిం వ్యతిరేక కథనాలను ప్రచారం చేసిన గోడీ మీడియా!

న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఘోరమైన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డ వ. ఈ దాడి తరువాత, మితవాద మీడియాగ్రూపులు, ప్రధాన స్రవంతి మీడియా టీవీ, సోషల్ మీడియాలో ముస్లిం వ్యతిరేక కథనాలను వ్యాప్తి చేశాయి, ముస్లింలపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చాయి. ద్వేషం, తప్పుడు సమాచారం, ఉదాసీనతయావద్దేశం ఉగ్రదాడిపై సంతాపం వ్యక్తం చేస్తుండగా, హిందూత్వ గ్రూపులు సోషల్ మీడియాలో ముస్లింలపై హింసకు బహిరంగంగా పిలుపునిచ్చాయి. అనేకమంది […]
Read more

మాలేగావ్ పేలుళ్ల కేసులో ప్రజ్ఞా ఠాకూర్‌కు మరణశిక్ష విధించాలని కోరిన ఎన్‌ఐఏ!

న్యూఢిల్లీ : మహారాష్ట్రలోని మాలేగావ్‌లో 2008లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో బిజెపి మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ సహా ఏడుగురు నిందితులకు మరణశిక్ష విధించాలని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ప్రత్యేక కోర్టును కోరింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA)లోని సెక్షన్ 16ను ఉపయోగించి శనివారం 1,500 పేజీలకు పైగా తుది లిఖిత వాదనలను ఏజెన్సీ సమర్పించింది. సెప్టెంబర్ 29, 2008న మహారాష్ట్రలోని మాలేగావ్‌లో జరిగిన ఈ పేలుడులో ఆరుగురు ముస్లింలు […]
Read more
1 30 31 32 33 34 44

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.