Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

బిజెపి పాలనలో దళితులు, మహిళలకు రక్షణ లేదు…యూపీలో బాలిక అత్యాచారంపై రాహుల్ గాంధీ!

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో 11 ఏళ్ల దళిత బాలికపై జరిగిన అత్యాచారంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ యోగీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ “దళిత వ్యతిరేక, మహిళా వ్యతిరేక మనస్తత్వం” కారణంగా రాష్ట్రంలో ఇటువంటి నేరాలు “నిరంతరం జరుగుతున్నాయి” అని రాహుల్‌ గాంధీ సామాజిక మాథ్యమం Xలో పేర్కొన్నారు. చెవిటి,మూగ బాలిక మంగళవారం అదృశ్యమైంది. మరుసటి రోజు ఉదయం ఒక పొలంలో నిస్తేజంగా కనిపించింది. ఆమె ప్రైవేట్ భాగాల నుండి […]
Read more

వక్ఫ్ చట్టం పిటిషనర్లకు మధ్యంతర ఉపశమనం… ఆస్తులను డినోటీఫై చేయొద్దన్న సుప్రీంకోర్టు !

న్యూఢిల్లీ: వక్ఫ్‌ సవరణ చట్టం తదుపరి విచారణ వరకు ‘వక్ఫ్ బై యూజర్’ లేదా ‘వక్ఫ్ బై డీడ్’ ఆస్తులను డీ నోటిఫై చేయరాదని, వాటి స్థితిని మార్చకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది. . ఈ సందర్భంగా వక్ఫ్‌పై సమాధానం ఇచ్చేందుకు కేంద్రం వారం రోజులు గడువు కోరగా.. సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ కన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథ్‌లతో కూడిన ధర్మాసనం అంగీకరించింది. తదుపరి విచారణ వరకు వక్స్ ఆస్తులను డీనోటీఫై చేయబోమని కేంద్రం […]
Read more

కర్ణాటకలో కొనసాగుతున్న లారీల సమ్మె… నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగే ఛాన్స్‌!

బెంగళూరు : కర్ణాటలో లారీ ఆపరేటర్ల నిరవధిక సమ్మెతో రాష్ట్రవ్యాప్తంగా సరుకు రవాణా నిలిచిపోయింది. సమ్మె చేస్తున్న ట్రక్కర్‌ల ప్రాథమిక డిమాండ్లలో ఇటీవలి పెరిగిన డీజిల్ ధరలను వెనక్కి తీసుకోవాలని, రాష్ట్ర రహదారులపై టోల్ ఛార్జీలను తగ్గించాలని సమ్మె చేస్తున్న లారీల యజమానులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న లారీ సమ్మె నేడు కూడా కొనసాగనుంది. ఫలితంగా నేటి నుంచి కొన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. లారీల నిరవధిక సమ్మె నుంచి కూరగాయలు, […]
Read more

స్వయం ప్రతిపత్తి కోరుకుంటున్న తమిళనాడు…ఇది నిజంగా ఆచరణ సాధ్యమేనా?

చెన్నై: తమిళనాడు స్వయంప్రతిపత్తిని కోరుకుంటోంది. ఈ మేరకు కేంద్ర-రాష్ట్ర సంబంధాలను మెరుగుపరచడానికి మార్గాలను అన్వేషించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇటీవల తీసుకున్న నిర్ణయం భారతదేశంలో చాలా కాలంగా కొనసాగుతున్న రాజ్యాంగ చర్చను తిరిగి ప్రారంభించింది. సమాఖ్య సూత్రాలను పునరుద్ఘాటించే దిశగా ఇది నిజంగా ప్రగతిశీల అడుగు అవుతుందా, కాదా అనే ప్రశ్న రేకెత్తిస్తోంది. రాజ్యాంగ స్థాయిలో, అటువంటి కమిటీ ఏర్పాటు అనుమతించడమే కాకుండా సమాఖ్య చట్రంలో వారి […]
Read more

హిందూ మత ట్రస్టుల్లో ముస్లింలను అనుమతిస్తారా… వక్ఫ్ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు!

న్యూఢిల్లీ: కొత్త వక్ఫ్‌ సవరణ చట్టం రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం నిన్న విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హిందూ మత ట్రస్టులలో ముస్లింలను అనుమతిస్తారా అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అలాంటి విషయం ఏదైనా ఉంటే బహిరంగంగా చెప్పండని కేంద్రం తరపున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోరింది. “మీరు గతాన్ని తిరిగి రాయలేరు,” 100 లేదా 200 […]
Read more

కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకున్న ఈడీ…నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై చార్జిషీట్లు దాఖలు!

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసును తదుపరి విచారణకు వచ్చే వారానికి ఢిల్లీ కోర్టు వాయిదా వేసింది. ఆర్థిక నేరాల సంస్థ ఏప్రిల్ 9న చార్జిషీట్ దాఖలు చేసింది. కాంగ్రెస్ విదేశీ విభాగం చీఫ్ సామ్ పిట్రోడాతో పాటు సుమన్ దూబేను కూడా నిందితులుగా చేర్చిందని పిటిఐ […]
Read more

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో హింసాకాండ.. నిరాశ్రయులైన స్థానికులు!

కోల్‌కత : నాలుగు రోజుల క్రితం ఏప్రిల్ 11న ముర్షిదాబాద్‌లోని జాంగిపూర్ ప్రాంతంలో హింసాత్మక మూక దాడి తరువాత, బెడ్‌బునా గ్రామవాసుల ఇళ్లను తగలబెట్టారు. ఫలితంగా వారి జీవితాలు అస్తవ్యస్తం అయ్యాయి. సమీప ప్రాంతంలో వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన సందర్భంగా, బయటి వ్యక్తుల గుంపు గ్రామంపై దాడికి పాల్పడ్డారు, 120 ఇళ్లను తగలబెట్టి, నగదు, నగలు,పశువులు వంటి విలువైన వస్తువులను దోచుకెళ్లారు. ఆ భయానక సంఘటనను గుర్తుచేసుకుంటూ, బాధితుల్లో ఒకరైన రాహుల్ మండల్, […]
Read more

‘ముస్లింలు పంక్చర్లు వేసుకుంటున్నారు’ అన్న ప్రధాని వ్యాఖ్యలపై ప్రతిపక్షం ఎదురుదాడి!

న్యూఢిల్లీ: వక్ఫ్ ఆస్తులను ‘నిజాయితీగా’ ఉపయోగించినట్లయితే యువ ముస్లింలు జీవనోపాధి కోసం పంక్చర్లు వేసుకోవాల్సిన అవసరం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యకు ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా స్పందించారు. నిన్న హర్యానాలోని హిసార్‌లో విమానాశ్రయ ప్రారంభోత్సవంలో ప్రసంగించిన ప్రధాని, వక్ఫ్‌ పేరిట లక్షల హెక్టార్ల భూమి ఉందని, కానీ ఆ భూములు దుర్వినియోగం అయ్యాయని అన్నారు. “వక్ఫ్ ఆస్తులను నిజాయితీగా ఉపయోగించినట్లయితే, ముస్లిం యువత సైకిల్ పంక్చర్లను మరమ్మతు చేయడం ద్వారా జీవనోపాధి పొందాల్సిన అవసరం […]
Read more

ద్రవిడనాదుల కంచుకోటను బద్దలు కొట్టడానికి మళ్ళీ ఓ ప్రయత్నం!

చెన్నై : ఊహించిందే జరిగింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఎఐఎడిఎంకెల మధ్య పొత్తు ఖరారయింది. కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నిలకు ఓ ఏడాది గడువు ఉంది.దశాబ్దాలుగా అధికారం చేపట్టినప్పుడల్లా తరచుగా జరిగే పాలక డిఎంకె పార్టీలో గందరగోళం, అంతర్గత యుద్ధాలు కూడా ఆందోళనకరమైన స్థాయికి చేరుకున్నాయి. ఒకప్పుడు పార్టీ అధినేత సంకల్పాన్ని భక్తితో విని అంకితభావంతో అమలు చేసిన రెజిమెంట్డ్, కేడర్ ఆధారిత పార్టీ ఇప్పుడు తలక్రిందులైంది. ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ నుండి ఆయన కుమారుడు, […]
Read more

దేశంలో పెరుగుతున్న ఇస్లామోఫోబియా- మీడియా బాధ్యతపై ఢిల్లీలో సింపోజియం!

న్యూఢిల్లీ : మనదేశంలో పెరుగుతున్నఇస్లామోఫోబియా- మీడియా బాధ్యతపై దేశ రాజధాని ఢిల్లీలో సింపోజియం జరిగింది. ఈ సమావేశంలో ప్రముఖ జర్నలిస్టులు పాల్గొన్నారు. ఇస్లామోఫోబియా వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖ పాత్ర పోషిస్తుందని మీడియా మిత్రులందరూ ముక్తకంఠంతో అంగీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు గౌతమ్ లాహిరి మాట్లాడుతూ…మీడియా వ్యక్తులుగా మన విధి సామాజిక సమస్యలపై విశ్లేషించడం, విమర్శించడం. అయితే దురదృష్టవశాత్తు, నేడు మీడియా ఈ పాత్రను నెరవేర్చడం లేదు. బదులుగా, ఇది ఒక నిర్దిష్ట […]
Read more
1 32 33 34 35 36 44

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.