Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

‘బెంగాలీలను బయటి వ్యక్తులుగా చిత్రీకరించే ప్రయత్నం’…ఢిల్లీ పోలీసులపై టీఎంసీ విమర్శలు!

న్యూఢిల్లీ: ఇటీవల ఢిల్లీ పోలీసులు… బెంగాలీని “బంగ్లాదేశ్ భాష”గా పేర్కొనడాన్ని తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. రాజ్యాంగబద్ధంగా గుర్తింపు పొందిన భారతీయ భాషను చట్టవిరుద్ధమని, లక్షలాది మంది బెంగాలీ మాట్లాడే పౌరులను బయటి వ్యక్తులుగా చిత్రీకరించడానికి పోలీసులు ఉద్దేశపూర్వక ప్రయత్నం చేస్తున్నారని టీఎంసీపార్టీ ఆరోపించింది. ఈమేరకు Xలో… న్యూఢిల్లీలోని లోధి కాలనీ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక ఇన్‌స్పెక్టర్ రాసిన లేఖ కాపీని షేర్‌ చేసింది. చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న ఎనిమిది […]
Read more

ముస్లిం హెచ్‌ఎం బదిలీ కోసం స్కూల్‌ వాటర్‌ ట్యాంకులో విషం కలిపిన శ్రీ రామ సేన నాయకుడి అరెస్టు!

బెంగళూరు: బెళగావి జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ముస్లిం అయిన ప్రిన్సిపాల్‌ను బదిలీ చేయడానికి శ్రీ రామ సేన సభ్యుడు అక్కడి వాటర్‌ ట్యాంకులోని నీటిని విషపూరితం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వివరాల్లోకి వెళితే…జూలై 14న హూలికట్టే గ్రామం, జనతా కాలనీలోని ప్రభుత్వ లోయర్ ప్రైమరీ స్కూల్‌లో ఏడు నుండి 10 సంవత్సరాల మధ్య వయస్సు గల అనేక మంది పిల్లలు నీరు తాగి అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సులేమాన్ గోరినాయక్ సౌందట్టి […]
Read more

మాలేగావ్ తీర్పు…ముంబై పేలుళ్ల కేసులాగా మహారాష్ట్ర సుప్రీంకోర్టుకు వెళుతుందా!

ముంబయి: ముంబై పేలుళ్ల కేసులో నిందితులందరినీ కోర్టు నిర్దోషులుగా విడుదల చేసిందని, బాంబు పేలుడు ఎవరు చేశారనే ప్రశ్నకు సమాధానం లేదని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కల్ అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రభుత్వ వైఖరి ఉండాలి, 2006 ముంబై రైలు పేలుళ్ల కేసులో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి సిద్ధంగా ఉంటే, మాలేగావ్ పేలుడు కేసు విషయంలో కూడా అదే చేయాలని సప్కల్ అన్నారు. “కాంగ్రెస్ ఎల్లప్పుడూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢంగా నిలబడింది. మహాత్మా గాంధీ, […]
Read more

రెండో రోజు ఆటలో భారత జట్టును ఆధిక్యంలో నిలిపిన సిరాజ్, జైస్వాల్!

లండన్‌: ఓవల్‌లో జరుగుతున్న ఐదవది… చివరి టెస్ట్‌లో రెండవ రోజు భారత్ తిరిగి పోటీలోకి వచ్చింది, సిరీస్‌ను సమం చేయడానికి గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో మన జట్టు గొప్పగా పోరాడింది. మన సీమర్లు ఇంగ్లాండ్‌ను 23 పరుగుల ఆధిక్యానికి పరిమితం చేశారు. నిన్న ఉదయం ఆట ప్రారంభమైన 30 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే భారత జట్టు టెయిలెండర్ల తోకను కట్‌ చేసిన ఇంగ్లండ్‌ ఆ తర్వాత, బాజ్‌బాల్ ఆటతో మన బౌలర్‌లపై మెరుపుదాడికి దిగారు. ఓపెనర్లు […]
Read more

బులంద్‌షహర్ కేసు… బీజేపీ నేత యోగేష్ రాజ్ సహా 38 మందిని దోషులుగా నిర్ధారించిన కోర్టు!

లక్నో: ఏడేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో గోవధ ఆరోపణలపై మూక హింస చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో పోలీసు ఇన్‌స్పెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్ సహా స్థానిక యువకుడి ప్రాణాలను బలిగొన్న సంఘటనకు సంబంధించి బీజేపీ నాయకుడు, మాజీ బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ యోగేష్ రాజ్‌తో సహా 38 మందిని జిల్లా కోర్టు దోషులుగా నిర్ధారించింది. డిసెంబర్ 3, 2018న సయానా తహసీల్‌లోని చింగ్రావతి గ్రామ సమీపంలోని చెరకు తోటలో ఆవుల కళేబరాలు కనిపించాక […]
Read more

బీహార్‌లో 70,800 కోట్ల స్కామ్‌…సీనియర్‌ కాంగ్రెస్‌ నేత పవన్ ఖేరా!

పాట్నా: బీహార్‌లో కాగ్‌ నివేదిక వెల్లడైంది. ఆ తర్వాత కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పవన్ ఖేరా నితీష్ కుమార్ నేతృత్వంలోని NDA ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏకంగా 70,877 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. పాట్నాలోని సదాకత్ ఆశ్రమంలోని రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ఇది రాష్ట్ర స్థాయి కుంభకోణం మాత్రమే కాదు, “జాతీయ కుంభకోణం”గా అభివర్ణించారు, కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ఇందులో ఉన్నాయని అన్నారు. డబుల్ […]
Read more

భారత్‌పై 25% సుంకం విధించిన ట్రంప్‌…ప్రధానిని ఎగతాళిచేసిన విపక్షం!

న్యూఢిల్లీ: భారతీయ దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 25 శాతం సుంకం, జరిమానాలు విధించిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని విమర్శించాయి. అమెరికా అధ్యక్షుడితో ప్రధాని మోదీకి ఉన్న స్నేహం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని దీంతో తెలిసిపోయిందని విపక్షాలు ఎద్దేవా చేశాయి. హౌడీ మోదీకి, ట్రంప్‌కు మధ్య ఉన్న ‘తారిఫ్‌ (పరస్పర పొగడ్తలు)’ పనికిరాలేదని.. ట్రంప్‌ మనపై టారిఫ్‌ (సుంకం), వేశారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేశ్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. ఇప్పటికైనా […]
Read more

వందమంది అమ్మాయిల్లో నలుగురు మాత్రమే వర్జిన్…దుమారం రేపిన ప్రేమానంద్ మహారాజ్ వ్యాఖ్యలు!

లక్నో: ప్రముఖ హిందూ సాధువు ప్రేమానంద్ మహారాజ్, ఆయన శిష్యులలో స్టార్ ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ ఉన్నారు, ఆధునిక కాలంలో పురుషులు, స్త్రీల పవిత్రతపై ఆయన చేసిన వ్యాఖ్యలతో పెద్ద వివాదం చెలరేగింది. ‘ఆధునిక కాలంలో, 100 మంది అమ్మాయిల్లో 2 నుంచి 4గురు అమ్మాయిలు అరుదుగా పవిత్రంగా ఉంటారు… మిగిలిన వారందరికీ బాయ్‌ఫ్రెండ్స్ ఉంటారు’ అని ప్రేమానంద్ మహారాజ్ చేసిన వ్యాఖ్యలు ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో […]
Read more

పహల్గామ్ దాడి… కేంద్రంపై విరుచుకుపడ్డ మల్లికార్జున్ ఖర్గే!

న్యూఢిల్లీ: రాజ్యసభలో నిన్న ఆపరేషన్‌ సింధూర్‌పై చర్చ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా ఆపరేషన్ సిందూర్‌పై జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ… ఖర్గే ప్రభుత్వంపై మాటల దాడికి దిగారు. భద్రతా వైఫల్యం కారణంగానే పహల్గాం ఉగ్రగాడి ఘటన జరిగిందని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ఖర్గే ప్రశ్నించారు. హోం మంత్రి అమిత్‌షా ఇందుకు బాధ్యత వహించాలన్నారు. దేశంలో టెర్రరిజం […]
Read more

‘ఒత్తిడితో ఆపరేషన్‌ సిందూర్ ఆగలేదు’…రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌!

న్యూఢిల్లీ: లోక్‌సభలో పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సింధూర్‌పై నిన్న ఎట్టకేలకు చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటుకు గైర్హాజరయ్యారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చర్చను ప్రారంభించారు. ఏప్రిల్ 22 ఉగ్రవాద దాడి గురించి కేవలం ప్రస్తావించారు.నాలుగు రోజుల పాటు జరిగిన సైనిక ఘర్షణ తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరంతరం చేస్తున్న వాదనలను ప్రస్తావించలేదు. బదులుగా, భారతదేశం ఇప్పటికే తన “ప్రకటించిన […]
Read more
1 34 35 36 37 38 65

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.