Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

నకిలీ వార్తలపై కర్ణాటక ఉక్కుపాదం…నేరస్థులకు ఏడేళ్ల జైలు, 10 లక్షల జరిమానా!

బెంగళూరు: నకిలీ వార్తలు రాసేవారిపై కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. సోషల్‌ మీడియాలో ఫేక్‌ న్యూస్‌ పోస్ట్ చేసినట్లు రుజువైతే 7 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 10 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈమేరకు తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి కర్ణాటక ప్రభుత్వం ముసాయిదా చట్టంలో ప్రతిపాదించింది. దీనిని ఈ వారం ప్రారంభంలో మంత్రివర్గం ముందు ఉంచారు. ప్రతిపాదిత చట్టం రాష్ట్ర ప్రభుత్వానికి “సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నకిలీ వార్తలపై పూర్తి నిషేధించే” అధికారాలను ఇస్తుంది. […]
Read more

తొలి టెస్టులో అరంగేట్రం చేయని అభిమన్యు ఈశ్వరన్‌… బీసీసీఐ పక్షపాత వైఖరిపై విమర్శలు!

లండన్‌ : ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా నిన్న భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య లీడ్స్‌లో తొలి టెస్ట్‌ ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్‌లో అరంగ్రేటం చేస్తాడని భావించిన దేశీయ పరుగుల వీరుడు అభిమన్యు ఈశ్వరన్‌కు జట్టు మేనేజ్‌మెంట్‌ మొండి చేయిచూపింది. అతడి స్థానంలో తమిళనాడుకు చెందిన తన తోటి ఐపీఎల్‌ సహచరుడు సాయి సుదర్శన్‌కు కెప్టెన్‌ గిల్‌ అవకాశం ఇచ్చాడు. అయితే సాయి సుదర్శన్ టెస్ట్ అరంగేట్రం కేవలం నాలుగు బంతుల్లోనే ముగిసింది. లంచ్‌కు ముందు […]
Read more

ఇజ్రాయెల్‌తో సంబంధాల కారణంగా రిలయన్స్ స్మార్ట్‌ను బహిష్కరించాలని పిలుపు!

హైదరాబాద్: ఇజ్రాయెల్‌తో సంబంధాల కారణంగా రిలయన్స్ రిటైల్ కంపెనీని బహిష్కరించాలని పాలస్తీనా సాలిడారిటీ సంస్థ (IPSP) పిలుపునిచ్చింది. ఈమేరకు హైదరాబాద్‌ తార్నాకలోని రిలయన్స్ స్మార్ట్ అవుట్‌లెట్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఢిల్లీ, పూణే, ముంబై, హైదరాబాద్, పాట్నా, విశాఖపట్నం, చండీగఢ్, రోహ్‌తక్, విజయవాడ, ఇతర నగరాల్లోని రిలయన్స్ రిటైల్ దుకాణాలతో సహా దేశవ్యాప్తంగా పాలస్తీనా సాలిడారిటీ సంస్థ (IPSP) నిరసనలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా వక్తలు దుకాణాల వెలుపల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పాలస్తీనాలో ఊచకోతను […]
Read more

మణిపూర్‌లో తమ వర్గానికి చెందిన నిరాశ్రయులను మూడవ వర్గంగా గుర్తించాలని కోరిన థాడౌ తెగ!

ఇంఫాల్/న్యూఢిల్లీ: మణిపూర్‌లో అంతర్గతంగా నిరాశ్రయులైన వ్యక్తుల (IDPలు) మూడవ వర్గంగా గుర్తించాలని థాడౌ తెగకు చెందిన ఒక ఉన్నత సంస్థ కోరింది. ఈమేరకు జస్టిస్ గీతా మిట్టల్ (రిటైర్డ్) కమిటీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరియు మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు విజ్ఞప్తి చేసింది. కాగా, 2023 మే నెలలో మైటీ-కుకి జాతి ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం, రాష్ట్ర ప్రభుత్వం రెండు వర్గాల అంతర్గతంగా నిరాశ్రయులైన వ్యక్తుల (IDPలు)ను గుర్తిస్తుంది […]
Read more

రికార్డు సృష్టించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు…14 కోట్లు రికవరీ!

హైదరాబాద్: మన సైబర్ క్రైమ్ పోలీసులు ఆన్‌లైన్‌ కేటుగాళ్ల పనిపట్టారు. దేశ వ్యాప్తంగా సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్‌ చేశారు. మార్చి నుంచి జూన్‌ మధ్య కాలంలో జరిగిన 74 సైబర్ క్రైమ్ కేసులకు సంబంధించి ఏడు రాష్ట్రాలలో మొత్తం 37 మందిని సైబర్ క్రైమ్ హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారివద్దనుంచి 14 కోట్లపై డబ్బును రివకరి చేశారు. కాగా, అరెస్టు అయిన వ్యక్తులకు దేశవ్యాప్తంగా 178 కేసుల్లో ప్రమేయం ఉంది. జనవరి 17న […]
Read more

బీహార్ ఎన్నికలకు ముందు కీలక పాత్రల్లో అగ్ర నాయకుల అల్లుళ్ళు…కొత్త చర్చకు నాంది!

పాట్నా : బీహార్ రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతుండగా, రాజకీయ చర్చలో కొత్త పదం ‘దామాద్’ రాజకీయాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈసారి దృష్టి వంశపారంపర్య రాజకీయ ఆరోపణల నుండి, ప్రముఖ రాజకీయ నాయకుల అల్లుళ్ళు రాష్ట్ర కమిషన్లు, బోర్డులలో కీలక పదవులకు నియమితులవడం ఆకస్మిక ప్రాముఖ్యతగా మారింది. ఈ ఊహించని ధోరణి ప్రతిపక్షాల నుండి రాజకీయ చర్చ, విమర్శలకు దారితీసింది. కుటుంబ ఆధారిత రాజకీయాలకు వ్యతిరేకంగా చాలా కాలంగా బలమైన వైఖరిని కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్, […]
Read more

మన ఎంపీల అమెరికా పర్యటన ఏం సాధించింది?

న్యూఢిల్లీ : ఆపరేషన్‌ సింధూర్‌ తర్వాత, పాకిస్తాన్‌ ప్రాయోజిత ఉగ్రవాదంపై భారత పోరాటానికి మద్దతు కోరుతూ మన ఎంపీలు 30 దేశాల పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా ఆయా దేశాలకు వెళ్లిన మన ఎంపీలు ఇటీవలే తిరిగొచ్చారు. జూన్ 10న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏడు బహుళ పార్టీ ప్రతినిధులకు స్వాగతం పలికారు. ఈ దౌత్య పర్యటనలో భాగంగా అమెరికాకు ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన శశి థరూర్, ఇతరులు ప్రధానమంత్రికి తమ పర్యటనల సారాన్ని […]
Read more

పూణేలో కూలిన వంతెన…నలుగురు మృతి, 18 మందికి తీవ్ర గాయాలు!

పూణే: మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. నిన్న మధ్యాహ్నం పూణేలోని మావల్ తహసీల్‌లో ఇంద్రాయణి నదిపై ఉన్న పాత ఇనుప పాదచారుల వంతెన కూలిపోవడంతో నలుగురు మరణించగా, 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. కుండమల ప్రాంతంలో మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఈ విషాద సంఘటన జరిగింది. పాదచారులకు మాత్రమే వాడకాన్ని పరిమితం చేసే హెచ్చరిక సంకేతాలను పర్యాటకులు పట్టించుకోకపోవడంతో ఈ విషాద సంఘటన జరిగింది. https://www.instagram.com/reel/DK7oBJ6zjq1/?igsh=d2Jwd245ZTVpaWky ఇటీవల ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి, కూలిపోయిన సమయంలో […]
Read more

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 274కు పెరిగిన మృతుల సంఖ్య!

న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 274కు చేరినట్లు తాజాగా అధికారులు వెల్లడించారు. విమానం బీజే మెడికల్‌ కాలేజీ భవనంపై కూలింది. ఇందులో తొలుత 24 మంది మృతి చెందినట్లు సమాచారం రాగా.. ఇప్పుడా సంఖ్య 33కు పెరిగింది. అహ్మదాబాద్‌ సివిల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న మరో 9 మంది మెడికోలు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో విమాన […]
Read more

కర్ణాటకలో కొత్త కుల గణన: అహిందా ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ!

బెంగళూరు: కర్ణాటకలో పదేళ్ల క్రితం(2015) జరిగిన కుల గణనను వాయిదా వేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శిస్తూ ఆగ్రహ స్వరాలు వెలువడినప్పటికీ, కర్ణాటక రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ వచ్చే వారం కొత్త సామాజిక & విద్యా సర్వే నిర్వహించడంపై అధికారిక చర్చలు ప్రారంభించే అవకాశం ఉంది. కమిషన్ చైర్‌పర్సన్ మధుసూదన్ ఆర్ నాయక్ రాబోయే రెండు రోజుల్లో ప్రభుత్వం తన బృందానికి ఐదుగురు సభ్యులను నియమిస్తుందని ఆశిస్తున్నారు. “ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడానికి జూన్ 16 […]
Read more
1 42 43 44 45 46 65

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.