Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

అమెరికా సుంకాలతో తిరుపూర్ వస్త్ర పరిశ్రమకు భారీ నష్టాలు!

తిరుపూర్: భారతీయ దిగుమతులపై అమెరికా 50% సుంకాల కారణంగా తిరుపూర్ వస్త్ర పరిశ్రమ కుదేలవుతోంది. అదేసమయంలో అమెరికాలోని కొనుగోలుదారుల నుండి కొత్త ఆర్డర్లు నిలిచిపోవడంతో అక్టోబర్ నుండి ఇప్పటిదాకా రూ. 3,600 కోట్లు నష్టపోయింది. ఈ ఏడాది ఆగస్టులో సుంకాలు అమల్లోకి వచ్చిన తర్వాత, ఎగుమతిదారులు కొనుగోలుదారులకు 20-25% భారీ తగ్గింపులు ఇచ్చి, పూర్తి చేసిన వస్తువులను అమెరికాకు రవాణా చేయడం వల్ల జరిగిన నష్టాలకు ఇది అదనం. అమెరికా నుండి వ్యాపారం కోల్పోవడంతో పాటు, ఎగుమతిదారులు […]
Read more

తమిళనాడులో ఎస్ఐఆర్…97.4 లక్షల ఓటర్లను తొలగింపు!

చెన్నై: తమిళనాడులో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా నుండి మొత్తం 97.4 లక్షల మంది ఓటర్లను తొలగించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్ర ఓటర్ల జాబితాలో 5.43 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ప్రధాన ఎన్నికల అధికారిణి అర్చన పట్నాయక్ తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ 27 నాటికి ఎస్ఐఆర్ ప్రక్రియకు ముందు ఓటర్ల జాబితాలో 6.41 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఆమె చెప్పారు.కొత్త ముసాయిదా ప్రకారం మొత్తం ఓటర్ల జాబితాలో […]
Read more

‘క్యాష్ ఫర్ క్వైరీ’ కేసులో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాకు ఊరట!

న్యూఢిల్లీ: ‘క్యాష్ ఫర్ క్వైరీ’ కేసులో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై చార్జిషీట్ దాఖలు చేయడానికి సీబీఐకి అనుమతి మంజూరు చేస్తూ లోక్‌పాల్ జారీ చేసిన ఉత్తర్వును ఢిల్లీ హైకోర్టు ఈరోజు రద్దు చేసింది. మోయిత్రా పిటిషన్‌పై జస్టిస్ అనిల్ క్షేత్రపాల్, హరీష్ వైద్యనాథన్ శంకర్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరిస్తూ… “ఆ ఉత్తర్వు రద్దు చేసాం. లోక్‌పాల్, లోకాయుక్త చట్టంలోని సెక్షన్ 20 ప్రకారం… సంబంధిత నిబంధనలకు అనుగుణంగా ఒక నెలలోపు అనుమతి మంజూరుపై పునఃపరిశీలన […]
Read more

ఈ ఏడాది భారతీయులు గూగుల్‌లో ఎక్కువగా ఏం వెతికారో తెలుసా?!

న్యూఢిల్లీ: ఈ ఏడాది భారతీయులు గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన అంశాల జాబితాను ఆ సంస్థ తాజాగా విడుదల చేసింది. టాప్ ట్రెండింగ్‌లను వెల్లడించింది. మొత్తం టాప్ టెన్ సెర్చ్‌లలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మొదటి స్థానంలో నిలిచి…భారత్‌లో క్రికెట్‌కు ఉన్న అభిమానాన్ని మరోసారి ఈ నివేదిక నిరూపించింది. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారిగా ఈ ఏడాది ఐపీఎల్‌ కప్పును గెలవడంతో, ఈ సలా కప్‌ నమ్‌దే’ అనే హ్యష్‌ట్యాగ్‌ […]
Read more

ఢిల్లీలో పొల్యూషన్‌ సర్టిఫికేట్‌ లేకుంటే పెట్రోల్‌, డీజిల్‌ ‘నో’!

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో రోజురోజుకు వాయు కాలుష్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కఠినమైన కాలుష్య నివారణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ రోజు నుండి బీఎస్-VI ఇంజన్లు లేని వాహనాలను ఢిల్లీలోకి అనుమతించడం లేదు. అలాగే కాలుష్య ధృవీకరణ పత్రం లేని వాహనాలకు బంకుల్లో పెట్రోల్ పోయరు. కాగా, ఢిల్లీలోకి పాత కార్లకు ప్రవేశం లేదన్న నిర్ణయం… సమీపంలోని గురుగ్రామ్, ఘజియాబాద్, ఫరీదాబాద్, నోయిడా నుండి ఢిల్లీలోకి ప్రవేశించే 12 లక్షల వాహనాలపై […]
Read more

ఒక్క విద్యార్థి కూడా లేని స్కూళ్లు తెలంగాణలోనే అత్యధికం!

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరంలో… 5,149 ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటిలో దాదాపు 70 శాతం పాఠశాలలు తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలోనే ఉన్నాయని తెలిపింది. ఈమేరకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు సమర్పించిన ఒక నివేదికలో ఈ డేటాను వెల్లడించింది. నివేదిక ప్రకారం…విద్యార్థులు లేని 2,081 పాఠశాలలతో తెలంగాణ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత 1,571 పాఠశాలలతో […]
Read more

అణువిద్యుత్‌ రంగంలో ప్రైవేటు కంపెనీలకు పచ్చజెండా?!

న్యూఢిల్లీ: దశాబ్దాలుగా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న అణుశక్తి రంగంలో ప్రైవేటు రంగానికి కేంద్రం తలుపులు తెరిచింది. ఈమేరకు లోక్‌సభలో శాంతి బిల్లును ప్రవేశపెట్టారు. సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా (SHANTI) బిల్లు-2025ను తీసుకొచ్చారు. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించినట్లయితే… ఈ బిల్లు అణుశక్తి చట్టం-1962ను రద్దు చేస్తుంది. ఈ కొత్త బిల్లు, ప్రైవేట్ కంపెనీలను 49% వరకు విదేశీ పెట్టుబడులతో సహా, అణు విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించడానికి, నిర్వహించడానికి […]
Read more

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సులు, కార్లు ఢీ… నలుగురు మృతి!

న్యూఢిల్లీ: ఈరోజు ఉదయం మధురలోని ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డు సరిగా కనిపించక ఏడు బస్సులు, మూడు కార్లు ఢీకొన్నాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కనీసం నలుగురు మృతి చెందగా, 25 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 11 ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. ఇప్పటి వరకు నలుగురి మృతదేహాలను గుర్తించారు. భారీ పొగమంచు […]
Read more

ఉపాధి హామీ రద్దు… కొత్త పథకాన్ని తీసుకొస్తున్న ప్రభుత్వం!

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, ‘వికసిత భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్‌ను… G RAM G పేరుతో కొత్త చట్టం తీసుకు రాబోతోంది. దీని ద్వారా ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచుతూ, పథకం పేరును ‘పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజన’గా మార్చడానికి లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రభుత్వం లోక్‌సభ […]
Read more

దళితులు, మైనారిటీల ఓటు హక్కును హరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది…సీఎం రేవంత్ రెడ్డి!

న్యూఢిల్లీ: దళితులు, ఆదివాసీలు, మైనారిటీల ఓటు హక్కును హరించేందుకు బిజెపి పనిచేస్తోందని, అది పూర్తయితే ఆధార్ కార్డు, రేషన్ కార్డుదారుల జాబితా నుండి వారి పేర్లను తొలగించి, వారి ఆస్తులను లాక్కుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇది ఎన్నికల సమస్య కాదు, కాంగ్రెస్ సమస్య కాదు, దేశవ్యాప్త సమస్య. అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడేందుకు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలను ఎదుర్కోవడానికి వీలుగా రాహుల్ గాంధీ చేపట్టిన ఈ పోరాటానికి […]
Read more
1 40 41 42 43 44 97

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.