Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

పశ్చిమ బెంగాల్‌లో ఎస్ఐఆర్ తీరుపై విమర్శలు గుప్పించిన బీజేపీ!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఎస్‌ఐఆర్‌ అమలు జరుగుతున్న తీరుపై విమర్శలు గుప్పిస్తున్న అధికార టీఎంసీకి ఇప్పడు బీజేపీ కూడా జత కలిసింది. రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ కొనసాగుతున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే రాష్ట్రంలో పార్టీకి చెందిన కీలక నాయకుడు సువేందు అధికారి ఇటీవల ఈ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘాన్ని ప్రశంసించారు. కాగా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య మాట్లాడుతూ… ఓటర్ల జాబితాలో ఓటర్లను తొలగించడం లేదా చేర్చడంపై తమ పార్టీ కార్యకర్తలు సమర్పించిన […]
Read more

ముంబైని బీజేపీ, అదానీల ఆధీనంలోకి పోనివ్వం… థాకరే బ్రదర్స్‌!

ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబై మున్సిపల్‌ ఎన్నికలు హోరాహోరీగా సాగనున్నాయి. ఈమేరకు అన్ని పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఇందులో భాగంగా జరిగిన బహిరంగ సభలో శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ థాకరే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన నాయకుడు రాజ్ థాకరే బీజేపీని ఘాటుగా విమర్శించారు. ఆ పార్టీ విభజన రాజకీయాలను అనుసరిస్తోందని, ముంబైలోని మరాఠీ మనూస్‌ను క్రమపద్ధతిలో “ఒంటరి” చేస్తోందని ఆరోపించారు. జాతీయ పార్టీ అదానీ గ్రూప్‌కు ప్రయోజనం చేకూర్చేందుకు భూ కబ్జాకు పాల్పడుతుందని, […]
Read more

అసంబద్ధమైన ఆధారాలతో నా భర్తను నిర్బంధించారు…సుప్రీంకోర్టుకు తెలిపిన వాంగ్‌చుక్‌ భార్య!

న్యూఢిల్లీ: సరైన అధారాలు లేకుండానే తన భర్తను నిర్బంధించారని జైలులో ఉన్న పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో నిన్న సుప్రీంకోర్టుకు తెలిపారు. నిర్బంధ అధికారి చెబుతున్న నాలుగు వీడియోలను వాంగ్‌చుక్‌కు అందించలేదని, ఇది అతని హక్కును ఉల్లంఘించడమేనని ఆమె కోర్టుకు తెలిపారు. ఆంగ్మో తరపున కోర్టులో హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, జస్టిస్‌లు అరవింద్ కుమార్, ప్రసన్న బి వరాలేతో కూడిన ధర్మాసనానికి వీడియోలను అందించకపోవడంతో… సలహా మండలి ముందు, అలాగే ప్రభుత్వం […]
Read more

బెంగాల్‌లో దర్యాప్తు అధికారుల”అక్రమ నిర్బంధం”… మమతా తీరుపై కోర్టుకెక్కిన ఈడీ!

కోల్‌కతా: గత వారం కోల్‌కతాలోని ఐ-ప్యాక్ కార్యాలయం, ఆ సంస్థ డైరెక్టర్ నివాసంలో జరిగిన దాడుల సమయంలో తమ అధికారులను “అక్రమంగా నిర్బంధించారంటూ” ఈడీ నేడు సుప్రీంకోర్టులో రెండో రిట్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్లు నిశాంత్ కుమార్, విక్రమ్ అహ్లావత్, ప్రశాంత్ చండీలా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, డీజీపీ రాజీవ్ కుమార్, కోల్‌కతా పోలీస్ కమిషనర్ మనోజ్ వర్మ, డిప్యూటీ కమిషనర్ ప్రియోబ్రతో రాయ్‌లపై […]
Read more

దృఢమైన, స్వతంత్ర విదేశాంగ విధానం కోసం నెహ్రూ చేసిన కృషిని బలహీనపరిచిన మోడీ!

భారతదేశ మానవ వనరులు, ఒక బిలియన్ కంటే ఎక్కువ జనాభా గురించి పదే పదే గొప్పలు చెప్పుకునే ప్రధాన మంత్రి మోడీ, ట్రంప్ ఆదేశాలకు లొంగిపోయారు, భారతదేశ విదేశాంగ విధానాన్ని ఎంతగానో దెబ్బతీశారు, అది ప్రజలను, మన దేశ ప్రతిష్టను దెబ్బతీసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ “సర్, నేను మిమ్మల్ని కలవవచ్చా” అని అడగడం ద్వారా అమెరికా అధ్యక్షుడుని కలవడానికి మోడీ సమయం కోరారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, మోడీ ఈ వాదనను ఖండించకపోవడం, మోడీని […]
Read more

అంకిత కేసులో సీబీఐ విచారణపై మౌనం వహించిన సీఎం ధామి…నిరసనకారులే క్షమాపణ చెప్పాలని డిమాండ్!

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్ లో సంచలనం సృష్టించిన రిసెప్షనిస్ట్ అంకిత భండారీ హత్య కేసు తీవ్ర వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. కాగా, ఈ హత్యకేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలన్న డిమాండ్లపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మౌనంగా ఉన్నారు. మరోవంక భారీ సంఖ్యలో ప్రజలు సీబీఐ విచారణ కోరుతూ వీధుల్లోకి వచ్చారు. దీనిపై నిరసనకారులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడానికి మాత్రం ఆయన గళం విప్పారు. అంకిత కుటుంబం డిమాండ్లపై చట్టపరమైన ఆధారాన్ని ఇంకా పరిశీలిస్తున్నామని […]
Read more

మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న గౌరీ లంకేష్ హత్య కేసు నిందితుడు!

జల్నా: కర్ణాటకలో సంచలనం సృష్టించిన మహిళా జర్నలిస్ట్ గౌరి లంకేష్ హత్య కేసులో నిందితుడైన శ్రీకాంత్ పాంగర్కర్ మహారాష్ట్రలోని జల్నా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఈ ఎన్నికలు జనవరి 15న జరగనున్నాయి. ఆయన 13వ వార్డు నుంచి బరిలో ఉన్నారు. ఆయన ప్రత్యర్థులుగా బీజేపీ, ఇతర పార్టీల అభ్యర్థులు ఉన్నారు. అయితే ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మాత్రం తమ అభ్యర్థిని నిలబెట్టలేదు. యాదృచ్ఛికంగా, నవంబర్ 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, […]
Read more

మనూ భూ వివాదం…ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీ దాడి!

హైదరాబాద్: నగరంలో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి కేటాయించిన 50 ఎకరాల భూమి నిరుపయోగంగా ఉండటంపై వివరణ కోరుతూ తెలంగాణ ప్రభుత్వం నోటీసు జారీ చేసింది. దీనిపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలతో పాటు యూనివర్సిటీ విద్యార్థుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే దీనిపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. నోటీసు జారీ చేసినంత మాత్రాన ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకుంటుందని అర్థం కాదని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గత నెలలో రంగారెడ్డి జిల్లా […]
Read more

ఎస్ఐఆర్ కోసం బీజేపీ యాప్ వాడుతున్న ఈసీ…ఆరోపించిన మమత!

కోలకత: ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం బీజేపీ ఐటీ విభాగం అభివృద్ధి చేసిన యాప్‌ను ఎన్నికల సంఘం (ఈసీ) వినియోగిస్తోందని బెంగాల్‌ సీం మమతా బెనర్జీ ఆరోపించారు. ఇది చట్టవిరుద్ధమని… అప్రజాస్వామికమని, రాజ్యాంగ విరుద్ధమని ఆమె వ్యాఖ్యానించారు. గంగాసాగర్ మేళా ఏర్పాట్లను సమీక్షించేందుకు దక్షిణ 24 పరగణాల జిల్లాలోని సాగర్ ఐలాండ్‌లో రెండు రోజుల పర్యటన ముగిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. భారత ఎన్నికల సంఘం “అన్ని రకాల తప్పుడు చర్యలకు” పాల్పడుతోందని ఆరోపించారు. అర్హతగల ఓటర్లను […]
Read more

ఢిల్లీలో కూల్చివేత డ్రైవ్ సందర్భంగా పోలీసులపై రాళ్ల దాడి…ఐదుగురికి గాయాలు!

న్యూఢిల్లీ: ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్ సమీపంలో ఒక మసీదు వద్ద ఈరోజు తెల్లవారుజామున ఆక్రమణల తొలగింపు డ్రైవ్ హింసాత్మకంగా మారడంతో కనీసం ఐదుగురు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన సుమారు 300 మంది అధికారులు, కార్మికులు తుర్క్‌మన్ గేట్ వద్ద ఉన్న సయ్యద్ ఫైజ్ ఇలాహీ మసీదు,శ్మశానవాటికకు ఆనుకుని ఉన్న భూమిలో కూల్చివేత డ్రైవ్ నిర్వహిస్తున్నప్పుడు ఈ ఘర్షణలు చెలరేగాయి. అయితే, కూల్చివేత డ్రైవ్ సమయంలో, […]
Read more
1 … 46 47 48 49 50 … 108

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.