Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో హింసాకాండ.. నిరాశ్రయులైన స్థానికులు!

కోల్‌కత : నాలుగు రోజుల క్రితం ఏప్రిల్ 11న ముర్షిదాబాద్‌లోని జాంగిపూర్ ప్రాంతంలో హింసాత్మక మూక దాడి తరువాత, బెడ్‌బునా గ్రామవాసుల ఇళ్లను తగలబెట్టారు. ఫలితంగా వారి జీవితాలు అస్తవ్యస్తం అయ్యాయి. సమీప ప్రాంతంలో వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన సందర్భంగా, బయటి వ్యక్తుల గుంపు గ్రామంపై దాడికి పాల్పడ్డారు, 120 ఇళ్లను తగలబెట్టి, నగదు, నగలు,పశువులు వంటి విలువైన వస్తువులను దోచుకెళ్లారు. ఆ భయానక సంఘటనను గుర్తుచేసుకుంటూ, బాధితుల్లో ఒకరైన రాహుల్ మండల్, […]
Read more

‘ముస్లింలు పంక్చర్లు వేసుకుంటున్నారు’ అన్న ప్రధాని వ్యాఖ్యలపై ప్రతిపక్షం ఎదురుదాడి!

న్యూఢిల్లీ: వక్ఫ్ ఆస్తులను ‘నిజాయితీగా’ ఉపయోగించినట్లయితే యువ ముస్లింలు జీవనోపాధి కోసం పంక్చర్లు వేసుకోవాల్సిన అవసరం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యకు ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా స్పందించారు. నిన్న హర్యానాలోని హిసార్‌లో విమానాశ్రయ ప్రారంభోత్సవంలో ప్రసంగించిన ప్రధాని, వక్ఫ్‌ పేరిట లక్షల హెక్టార్ల భూమి ఉందని, కానీ ఆ భూములు దుర్వినియోగం అయ్యాయని అన్నారు. “వక్ఫ్ ఆస్తులను నిజాయితీగా ఉపయోగించినట్లయితే, ముస్లిం యువత సైకిల్ పంక్చర్లను మరమ్మతు చేయడం ద్వారా జీవనోపాధి పొందాల్సిన అవసరం […]
Read more

ద్రవిడనాదుల కంచుకోటను బద్దలు కొట్టడానికి మళ్ళీ ఓ ప్రయత్నం!

చెన్నై : ఊహించిందే జరిగింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఎఐఎడిఎంకెల మధ్య పొత్తు ఖరారయింది. కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నిలకు ఓ ఏడాది గడువు ఉంది.దశాబ్దాలుగా అధికారం చేపట్టినప్పుడల్లా తరచుగా జరిగే పాలక డిఎంకె పార్టీలో గందరగోళం, అంతర్గత యుద్ధాలు కూడా ఆందోళనకరమైన స్థాయికి చేరుకున్నాయి. ఒకప్పుడు పార్టీ అధినేత సంకల్పాన్ని భక్తితో విని అంకితభావంతో అమలు చేసిన రెజిమెంట్డ్, కేడర్ ఆధారిత పార్టీ ఇప్పుడు తలక్రిందులైంది. ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ నుండి ఆయన కుమారుడు, […]
Read more

దేశంలో పెరుగుతున్న ఇస్లామోఫోబియా- మీడియా బాధ్యతపై ఢిల్లీలో సింపోజియం!

న్యూఢిల్లీ : మనదేశంలో పెరుగుతున్నఇస్లామోఫోబియా- మీడియా బాధ్యతపై దేశ రాజధాని ఢిల్లీలో సింపోజియం జరిగింది. ఈ సమావేశంలో ప్రముఖ జర్నలిస్టులు పాల్గొన్నారు. ఇస్లామోఫోబియా వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖ పాత్ర పోషిస్తుందని మీడియా మిత్రులందరూ ముక్తకంఠంతో అంగీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు గౌతమ్ లాహిరి మాట్లాడుతూ…మీడియా వ్యక్తులుగా మన విధి సామాజిక సమస్యలపై విశ్లేషించడం, విమర్శించడం. అయితే దురదృష్టవశాత్తు, నేడు మీడియా ఈ పాత్రను నెరవేర్చడం లేదు. బదులుగా, ఇది ఒక నిర్దిష్ట […]
Read more

బెల్జియంలో అరెస్ట్‌ అయిన భారతీయ వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ!

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ రుణ మోసం కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియంలో పోలీసులు అరెస్టు చేసినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) వర్గాలు ఈ ఉదయం ధృవీకరించాయి. 65 ఏళ్ల మెహుల్‌ ఛోక్సీని శనివారం అరెస్టు చేసినట్లు,ప్రస్తుతం జైలులో ఉన్నట్లు సమాచారం. చోక్సీని అరెస్టు చేస్తున్నప్పుడు ముంబై కోర్టు జారీ చేసిన రెండు ఓపెన్-ఎండ్ అరెస్ట్ వారెంట్లను పోలీసులు ప్రస్తావించారని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ఇవి 2018 మే […]
Read more

అల్లాహ్ చూపిన దాన మార్గం…వక్ఫ్!

మనుషులు చేయదగ్గ అత్యుత్తమ ధార్మిక కార్యక్రమం, బాధ్యత…దానం. అందుకే ఇస్లాం ఇలాంటి మంచి పనుల్ని ప్రోత్సహించింది. మనిషిలోని వ్యక్తిగత భావోద్వేగాలను, లోభత్వాన్ని తగ్గించి అతడిని ఉదారుడిగా మార్చింది. దైవ మార్గంలో ఖర్చు పెట్టేందుకు తమ ఆస్తులను దానం చేసే వారు ఎంతో ధన్యులని తెలిపింది. పుణ్యాత్ముల చేత విరివిగా దైవ మార్గంలో దానాలు చేయించింది. ఇలా దైవ మార్గంలో దానం చేసిన ఆస్తులనే వక్ఫ్ ఆస్తులుగా పేర్కొంది. ‘వక్ఫ్’ ఆస్తులుగా పిలిచే వాటిని దానాల రూపంలో స్వీకరించి […]
Read more

వక్ఫ్ చట్టం రద్దు కోరుతూ మణిపూర్‌లో వేలాది మంది నిరసన!

ఇంఫాల్‌ : వక్ఫ్ (సవరణ) చట్టం, 2025ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఇంఫాల్ తూర్పు ప్రాంతంలో వేలాది మంది మెయిటీ పంగల్‌లు నిరసనలు చేపట్టారు. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, తమ డిమాండ్లను నెరవేర్చకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ప్రదర్శనకారులు నినాదాలు చేశారు. ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డులలో చేర్చడానికి అనుమతించే చట్టంపై జాతీయ స్థాయిలో పెరుగుతున్న భిన్నాభిప్రాయాల మధ్య నిరసన ఉద్యమం జరిగింది. హట్టా గోలపతి ప్రాంతంలో ర్యాలీతో నిరసన ప్రారంభమైంది. తరువాత స్థానిక […]
Read more

ప్రసిద్ధ షర్బత్‌ బ్రాండ్‌ రూహ్ అఫ్జా లక్ష్యంగా… ‘షర్బత్ జిహాద్’ను రెచ్చగొట్టిన బాబా రాందేవ్!

న్యూఢిల్లీ : యోగా గురువు, పతంజలి ఆయుర్వేద సహ వ్యవస్థాపకుడు రాందేవ్ ఇటీవల తన వ్యాఖ్యలతో కొత్త వివాదాన్ని రేకెత్తించారు. ప్రసిద్ధ షర్బత్‌ బ్రాండ్‌ రూహ్ అఫ్జా లక్ష్యంగా… ‘షర్బత్ జిహాద్’ అంటూ ప్రజలను హెచ్చరించారు. గతంలో “లవ్ జిహాద్”, “ఓట్ జిహాద్” వంటి పదాలతో పోల్చి… రాందేవ్ చేసిన ప్రకటన ఆన్‌లైన్‌లో తీవ్ర చర్చను రేకెత్తించింది. అతను వినియోగదారుల ఎంపికను మతతత్వంగా చూపిస్తున్నారని చాలామంది నెటిజన్లు ఆరోపించారు. పతంజలి ప్రొడక్ట్స్ అధికారిక ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ […]
Read more

లక్నోలో మత సామరస్యం కోసం ‘హోలీ-ఈద్ మిలన్’ కార్యక్రమాన్ని నిర్వహించిన సమాజ్‌వాదీ పార్టీ!

లక్నో : మత సామరస్యం, ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో సమాజ్‌వాదీ పార్టీ.. రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ‘హోలీ-ఈద్ మిలన్’ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం హిందూ మతం, ఇస్లాం, సిక్కు, క్రైస్తవ మతం వంటి వివిధ మతాల నాయకులు, అనుచరులను మత సంఘీభావాన్ని ప్రదర్శించే ఒక ఉత్సాహభరితమైన వేడుక అని ఆ పార్టీ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ… సాంస్కృతిక మత ఐక్యత ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. […]
Read more

ప్రైవేట్ విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ డిమాండ్!

అహ్మదాబాద్‌ : గుజరాత్‌లోని సబర్మతీ నది ఒడ్డున జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రైవేట్ విద్యాసంస్థల్లో కోటా కావాలని డిమాండ్ చేసింది. OBCలు, STలు, SCలకు రిజర్వేషన్లు కల్పించాలని పిలుపునిచ్చింది. దీనిని ఆలస్యం చేయకుండా అమలు చేయాలని పేర్కొంది. అదేసమయంలో ప్రైవేట్ విద్యాసంస్థల్లో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(5)ని అమలు చేయడానికి చట్టం చేయాలని కూడా కేంద్రానికి హితవు పలికింది. కాగా, ఆహ్మదాబాద్ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన […]
Read more
1 54 55 56 57 58 65

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.