Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

బీహార్‌ సీఎంగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న నితీష్ కుమార్!

న్యూఢిల్లీ: బీహార్‌ కొత్త సీఎంగా నితీష్‌కుమార్‌ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈమేరకు ఆయన ఎన్‌డీఏ శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. దీనితో పదవసారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మార్గం సుగమం అయింది. ముందు రోజు, జనతాదళ్ (యునైటెడ్) ఆయనను శాసనసభా పక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోగా, భారతీయ జనతా పార్టీ (BJP) ప్రత్యేక సమావేశంలో సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాలను శాసనసభా పక్ష నేత, ఉప నాయకుడుగా నియమించింది. ఇద్దరూ నితీష్ ప్రభుత్వంలో ఉప […]
Read more

ప్రజాస్వామ్య విధ్వంసానికి ఈసీ చేస్తున్న ‘దుష్ట’పన్నాగమే ఎస్‌ఐఆర్‌… కాంగ్రెస్!

న్యూఢిల్లీ: ఎస్‌ఐఆర్‌ అనేది ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడానికి భారత ఎన్నికల సంఘం “దుష్ట” కుట్ర అని కాంగ్రెస్ ఆరోపించింది. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కొనసాగుతున్న ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సమయంలో ఈసీ ప్రవర్తన “తీవ్రంగా నిరాశపరిచింది” అని పేర్కొంది. “తాము బిజెపి నీడలో పనిచేయడం లేదని వెంటనే నిరూపించాలని” ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది. డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీలోని రాంలీలా మైదానంలో SIRకి వ్యతిరేకంగా బహిరంగ ర్యాలీని కూడా […]
Read more

మనీలాండరింగ్ ఆరోపణలతో అల్-ఫలాహ్ వర్సిటీ వ్యవస్థాపకుడు అరెస్ట్‌!

న్యూఢిల్లీ: మనీలాండరింగ్ ఆరోపణలపై అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు జవాద్ అహ్మద్ సిద్ధిఖీని ఈడీ అరెస్టు చేసింది. విశ్వవిద్యాలయ పరిపాలన, దాని అనుబంధ సంస్థలపై ఇప్పటికే జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఈ అరెస్టు కీలకం కానుంది. పలు రాష్ట్రాలలో 25 ప్రదేశాలపై దాడిఈ వారం ప్రారంభంలో, అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయం, దాని ట్రస్టీలు, గ్రూప్ కంపెనీలకు సంబంధించిన 25 ప్రదేశాలలో ED విస్తృత సోదాలు నిర్వహించింది. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు తర్వాత విస్తృత విచారణలో భాగంగా ఈ […]
Read more

బీహార్ తర్వాత రాజ్యసభ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్!

న్యూఢిల్లీ: బీహార్ తీర్పు తర్వాత ఆత్మపరిశీలన, జవాబుదారీతనం, క్రమశిక్షణా చర్యలకు బదులుగా, కాంగ్రెస్ నాయకత్వం… పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సహా ఏఐసీసీ అగ్రనేతలను రాజ్యసభ బెర్తుల కోసం షార్ట్‌లిస్ట్ చేసే కసరత్తులో బిజీగా ఉంది. “జై జగత్ గ్యాంగ్‌”గా పేరొందిన శక్తివంతమైన పార్టీ నాయకుల బృందం రాజ్యసభ సీట్లలో పెద్ద భాగాన్ని పొందనుంది. సచిన్ రావు, మీనాక్షి నటరాజన్, కృష్ణ అల్లవారు, భున్వర్ జితేంద్ర సింగ్ వంటి ప్రసిద్ధి చెందిన నాయకులు సీటును ఆశిస్తున్నారు. సచిన్ […]
Read more

ఆ నలుగురికి ఢిల్లీ పేలుడుతో సంబంధం లేదని తేల్చిన ఎన్‌ఐఏ!

న్యూఢిల్లీ: ఎర్రకోట సమీపంలో కారుబాంబు పేలుడుకు సంబంధించి దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఈ పేలుడుకు సంబంధించి అదుపులోకి తీసుకున్న ముగ్గురు వైద్యులు సహా నలుగురిని ‘ఎన్‌ఐఏ’ విడుదల చేసింది. ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ ఉన్ నబీతో వారికి ఎటువంటి సంబంధం లేదని దర్యాప్తు అధికారులు నిగ్గు తేల్చారు. విడుదలైన వ్యక్తులు – డాక్టర్ రెహాన్, డాక్టర్ ముహమ్మద్, డాక్టర్ ముస్తకీమ్, ఎరువుల వ్యాపారి దినేష్ సింగ్లా – వీరందరినీ ఇటీవల హర్యానాలోని నుహ్‌లో అరెస్టు చేసారు. […]
Read more

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో ఓటమి…గంభీర్, అగార్కర్‌ను విమర్శించిన మాజీలు!

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా ఓటమితో ఆరంభించింది. 15 సంవత్సరాల తర్వాత దక్షిణాఫ్రికా చేతిలో భారత్‌కు ఇది తొలి టెస్ట్ ఓటమి. కాగా, అనూహ్య ఓటమి తర్వాత భారత మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్ సెలెక్టర్లు, జట్టు యాజమాన్యాన్ని విమర్శించారు. ఈడెన్ గార్డెన్స్‌లో మొదటి రెండు రోజులు ఆధిపత్యం చెలాయించిన తర్వాత 3వ రోజున భారత్‌ను ప్రోటీస్ ఓడించింది. 124 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ […]
Read more

‘ఏఐఏడీఎంకే’ ఢిల్లీకి అమ్ముడుపోయింది…సీఎం స్టాలిన్‌!

చెన్నై: తమిళనాడు విపక్ష పార్టీ అయిన ఏఐఏడీఎంకేపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ మండిపడ్డారు. ప్రతి రాజకీయ పార్టీ ఎస్‌ఐఆర్‌ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించినా…”సిగ్గు లేకుండా” ఆ పార్టీ SIRకు మద్దతు ఇస్తోందని ఆయన ఆరోపించారు. AIADMK “తన పార్టీని ఢిల్లీకి అమ్మేసింది” అని, రాష్ట్రంలో నిజమైన ప్రతిపక్షంగా పనిచేయడంలో విఫలమైందని స్టాలిన్‌ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం AIADMK “శత్రువు పార్టీగా కూడా మారదు” అని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ED,IT వంటి […]
Read more

రేపు అమెరికా వెళ్లనున్న సౌదీ క్రౌన్‌ ప్రిన్స్‌ ముహమ్మద్ బిన్ సల్మాన్‌!

వాషింగ్టన్: సౌదీ అరేబియా క్రౌన్‌ ప్రిన్స్‌ ముహమ్మద్ బిన్ సల్మాన్‌ రేపటినుంచి అమెరికాలో పర్యటించనున్నారు. సౌదీ-ఇజ్రాయెల్ సంబంధాలు సాధారణ స్థితికి వచ్చేలా చూడాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బలంగా కోరుకుంటున్నారు. అంతేకాదు ఇజ్రాయెల్ – అరబ్ దేశాల మధ్య వాణిజ్య, దౌత్య సంబంధాలను అధికారికం చేసిన అబ్రహం అకార్డ్స్‌ను పొడిగించాలని అన్నారు. గాజాలో ఇజ్రాయెల్ – హమాస్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నందున మధ్యప్రాచ్యంలో దీర్ఘకాలిక స్థిరత్వాన్ని తీసుకురావాలనేది ఆయన ప్రణాళికలో కీలకం. రేపు వైట్ […]
Read more

‘ఇది ఓటు చోరీ కాదు, ఓటు దోపిడీ’…అఖిలేష్ యాదవ్!

బెంగళూరు: సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు, అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఓటు దొంగతనం ఆరోపణలకు మద్దతు ఇచ్చారు. ‘విజన్ ఇండియా: స్టార్టప్ సమ్మిట్’లో పాల్గొనడానికి బెంగళూరు వచ్చిన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ…ఇది కేవలం ‘ఓట్ల దొంగతనం’ కాదు, ‘దోపిడీ’ అని అన్నారు. “ఇది చోరీ కాదు. చోరీ ఒక చిన్న దొంగతనం. ఇది దోపిడీ. బహిరంగంగా జరిగింది” అని అఖిలేష్‌ యాదవ్ అన్నారు. దేశంలో ఉద్దేశపూర్వకంగా ఓటు దొంగతనం జరిగిందని […]
Read more

‘పారిపోతున్న బంగ్లాదేశీయులు’అంటూ బెంగాల్‌లో ‘మీడియా’ హడావుడి!

కోల్‌కత: పశ్చిమబెంగాల్‌లో ఎస్‌ఐఆర్‌ పేరిట మీడియా హడావుడి ఎక్కువయింది. ఇక్కడ ఒక సంఘటనను పరికిస్తే… కోల్‌కతా సమీపంలోని సాల్ట్ లేక్‌లో సచివాలయానికి ఎదురుగా గుడిసెల సమూహం ఉంది. గత వారాంతంలో అక్కడే గందరగోళం చెలరేగింది. చేతిలో కెమెరాలు పట్టుకుని జర్నలిస్టుల బృందం ఒక యువకుడిని వెంబడించింది. ఆ వ్యక్తి రఫీకుల్ సర్దార్, నగరంలో నివసించే దినసరి కూలీ. సర్దార్ కుటుంబం సౌత్ 24 పరగణాలలోని జాయ్‌నగర్-I బ్లాక్‌లోని దోసా గ్రామ పంచాయతీ పరిధిలోని శ్యామ్‌నగర్ గ్రామ వాసులు. […]
Read more
1 … 55 56 57 58 59 … 108

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.