Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

అలీఘర్‌లో దేవాలయ గోడలపై “ఐ లవ్ ముహమ్మద్” అని రాసిన హిందూత్వ వ్యక్తుల అరెస్టు!

లక్నో: ముస్లిం సమాజ సభ్యులను ఇరికించడానికి,మతపరమైన అశాంతిని రేకెత్తించడానికి అలీఘర్‌లోని అనేక దేవాలయాల గోడలపై “ఐ లవ్ ముహమ్మద్” అని రాసిన నలుగురు హిందూత్వ కార్యకర్తలను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిని జీశాంత్ సింగ్, ఆకాష్ సరస్వత్, దిలీప్ శర్మ, అభిషేక్ సరస్వత్‌గా గుర్తించారు. పోలీసు నివేదికల ప్రకారం, ఈ వారం ప్రారంభంలో అనేక దేవాలయాలపై ఈ రాతలు కనిపించాయి. ఇది ప్రజల ఆగ్రహానికి కారణమైంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు దర్యాప్తు […]
Read more

అమెరికా నుంచి 2790 మంది భారతీయులు వెనక్కి వచ్చారన్న కేంద్రం!

న్యూఢిల్లీ: అక్రమవలసదారులపై అగ్రరాజ్యం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు అమెరికాలో ఉంటున్న 2790 మంది భారతీయులను స్వదేశానికి పంపేశారు. ఈ లెక్కలను స్వయంగా భారత ప్రభుత్వమే అధికారికంగా వెల్లడించింది. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్.. గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 29 వరకు యూఎస్ లో అక్రమంగా నివసిస్తున్న 2,790 మందికి పైగా భారతీయ పౌరులు స్వదేశానికి తిరిగి […]
Read more

ఎస్‌ఐఆర్‌ భయంతో బెంగాల్‌లో మరోవ్యక్తి ఆత్మహత్య!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఓటు హక్కు లేకుండా పోయే అవకాశం ఉందని బాధపడుతూ మరొక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అధికార తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్రంలో SIRకు వ్యతిరేకంగా తన వాదనను వినిపించింది. భారతీయ జనతా పార్టీ ఆదేశం మేరకు ఎన్నికల కమిషన్ ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తోందని ఆరోపించింది. “మా చివరి రక్తపు బొట్టు వరకు, ప్రజల హక్కులను కాపాడటానికి,మన దేశ సామాజిక నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ, దాని మిత్రపక్షాల దుర్మార్గపు ఎజెండాను ఓడించడానికి మేము […]
Read more

ముంబయిలో చిన్నారుల కిడ్నాప్‌ కథ సుఖాంతం!

ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో నిన్న మూడు గంటల పాటు సాగిన కిడ్నాప్‌ డ్రామా సుఖాంతమైంది. ఈ సందర్భంగా 17 మంది పిల్లలు, ఇద్దరు పెద్దలను రక్షించారు. కాగా, కిడ్నాపర్‌ బుల్లెట్ గాయంతో మరణించాడు. వివరాల్లోకి వెళ్తే… వెబ్‌సిరీస్ రూపొందించేందుకు ఆడిషన్స్ పేరిట ఓ వ్యక్తి కొంతమంది పిల్లల్ని స్టూడియోకి రప్పించి కిడ్నాప్ చేశాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఆ పిల్లల్ని కిడ్నాపర్‌ చెరనుండి విడిపించారు.పోలీసుల ఎన్‌కౌంటర్‌లో కిడ్నాపర్ రోహిత్ ఆర్య మృతిచెందాడు. పొవాయ్ ప్రాంతంలో […]
Read more

బీహార్ ఎన్నికల సందర్భంగా 15ర్యాలీలలో ప్రసంగించనున్న రాహుల్, ప్రియాంక!

న్యూఢిల్లీ: ఎన్నికలు జరగనున్న బీహార్‌లో ఎన్నికల పోటీ రోజు రోజుకు వేడెక్కుతోంది. ఇండియా కూటమికి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయన్న సంకేతాల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దాదాపు 15 ర్యాలీలలో ప్రసంగించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల పేస్‌మేకర్ ఇంప్లాంటేషన్ ప్రక్రియ చేయించుకున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, బీహార్‌లో మూడు ర్యాలీలతో పాటు కొన్ని విలేకరుల సమావేశాలను కూడా నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. రాహుల్ గాంధీ బుధవారం ముజఫర్‌పూర్, దర్భంగాలో రెండు […]
Read more

ఒకే వేదికపైకి రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్!

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు బీహార్‌లో తన తొలి ఎన్నికల ర్యాలీలో ప్రసంగించనున్నారు. దీంతో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించినట్లవుతుంది. సక్రా (ముజఫర్‌పూర్), దర్భంగాలో జరగనున్న రెండు ఉమ్మడి ర్యాలీలలో మహాఘట్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్‌తో కలిసి రాహుల్ గాంధీ వేదికను పంచుకుంటారు. ఈమేరకు బీహార్ కాంగ్రెస్ మీడియా విభాగం చైర్మన్ రాజేష్ రాథోడ్ మాట్లాడుతూ… ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీకి ఇదే తొలి […]
Read more

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ప్రజాస్వామ్యానికి ముప్పు… కేరళ సీఎం పినరయి విజయన్!

తిరువనంతపురం: నవంబర్‌నుంచి రెండో దశ ఎస్‌ఐఆర్‌ చేపట్టాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా విమర్శించారు, ఇది ప్రజాస్వామ్య సమగ్రతకు “తీవ్రమైన సవాలు” అని అభివర్ణించారు. ఎస్​ఐఆర్ పేరిట ఓటర్ల జాబితాను…కేంద్రం తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తుందని ఆరోపించారు. ఈ చర్య ఎన్నికల కమిషన్ ఉద్దేశాలపై సందేహాన్ని కలిగిస్తుందని, అంతేకాకుండా ఎన్నికల వ్యవస్థపై ప్రజలకున్న విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని విజయన్ ఆరోపించారు. ప్రస్తుత జాబితాలకు బదులుగా పాత 2002–2004 ఓటరు జాబితాల సవరణ చేయాలని […]
Read more

తీరాన్ని తాకిన తుపాను…ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు!

అమరావతి: మంథా తుఫాను తీరాన్ని తాకింది. మచిలీపట్నం కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో మంగళవారం రాత్రి 11:30 గంటల నుంచి 12:30 మధ్య తీరాన్ని దాటిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తుపాను ధాటికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీవ్రంగా నష్టపోయాయి. ఆంధ్రప్రదేశ్‌వ్యాప్తంగా భారీ వర్షం పడుతోంది. కోనసీమ జిల్లాలో ఒక చెట్టు కూలిపోవడంతో ఒక మహిళ మరణించింది. దాదాపు 76వేల మందిని సహాయ శిబిరాలకు తరలించారు, రాష్ట్ర ప్రభుత్వం 219 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. ఒడిశాలోని […]
Read more

నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ‘SIR’రెండో దశ…సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌!

న్యూఢిల్లీ: వివాదాస్పద ఎస్‌ఐఆర్‌ రెండో దశకు రంగం సిద్ధమైంది. నవంబర్ – ఫిబ్రవరి మధ్య మొత్తం 9 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో రెండవ దశ ప్రత్యేక ఇంటెన్సివ్ ఓటర్ల జాబితా సవరణను నిర్వహిస్తుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు: అండమాన్-నికోబార్ దీవులు, లక్షద్వీప్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్. వీటిలో, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ,పశ్చిమ బెంగాల్ 2026లో […]
Read more

వాషింగ్టన్ పోస్ట్‌ నివేదికను తిరస్కరించిన ఎల్‌ఐసి!

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ కంపెనీలలో ₹34,200 కోట్లు పెట్టుబడి పెట్టమని ప్రభుత్వ యాజమాన్యంలోని బీమా సంస్థను ఒత్తిడి చేశారని ఆరోపిస్తూ ది వాషింగ్టన్ పోస్ట్‌లో ప్రచురితమైన నివేదికను ఎల్‌ఐసి తిరస్కరించింది.ఈ నివేదిక ” నిరాధారమైనది, సత్యానికి దూరంగా ఉంది” అని ఎల్‌ఐసి తెలిపింది. అమెరికా వార్తాపత్రిక నివేదికలో సూచించినట్లుగా, అదానీ గ్రూప్‌లోకి నిధులను చొప్పించడానికి కార్పొరేషన్ కోసం ప్రభుత్వ అధికారులు ఎటువంటి ప్రతిపాదనను రూపొందించలేదని బీమా సంస్థ తెలిపింది. ఈ సంవత్సరం మే నెలలో బీమా సంస్థ […]
Read more
1 … 59 60 61 62 63 … 108

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.