Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: తెలంగాణ/ఆంధ్ర

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

బడ్జెట్‌లో మున్సిపల్‌-పట్టణాభివృద్ధి శాఖకు17,677 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం!

హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరం 2025-26 రాష్ట్ర బడ్జెట్‌లో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖకు తెలంగాణ ప్రభుత్వం రూ.17,677 కోట్ల కేటాయించింది. తెలంగాణ బడ్జెట్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ బడ్జెట్‌లో పట్టణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, ట్రాఫిక్ రద్దీని సమర్ధవంతంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం H-CITI ప్రణాళికను హైలైట్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లో రూ.7,032 కోట్ల అంచనా పెట్టుబడితో 31 ఫ్లైఓవర్లు, 17 […]
Read more

చారిత్రాత్మక ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించిన తెలంగాణ అసెంబ్లీ!

హైదరాబాద్: నిన్న జరిగిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో షెడ్యూల్డ్ కులాల (రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ) బిల్లు-2025ను తెలంగాణ శాసనసభ ఆమోదించింది. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు ఆధారందశాబ్దాలుగా వెనుకబడిన ఎస్సీ వర్గాలకు సామాజిక వెనుకబాటుతనం, ప్రాధాన్యత ఆధారంగా షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వర్గీకరణ జరుగుతోందని వైద్యశాఖా మంత్రి దామోదర్ రాజ నరసింహ అన్నారు. బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్గీకరణ అంతిమ పరిష్కారం కాదని, వెనుకబడిన ఎస్సీ వర్గాల అభ్యున్నతికి ఒక సాధనమని అన్నారు. “ఎస్సీ వర్గాల సామాజిక-ఆర్థిక […]
Read more

మార్చి 21నుంచి పదోతరగతి పరీక్షలు… ఐదు లక్షలమంది విద్యార్థులు హాజరు!

హైదరాబాద్‌: తెలంగాణ SSC పబ్లిక్ పరీక్షలు మార్చి 21న ప్రారంభమై ఏప్రిల్ 4న ముగుస్తాయి, రాష్ట్రవ్యాప్తంగా 2650 పరీక్షా కేంద్రాల్లో 5.09 లక్షలకు పైగా విద్యార్థులు ఎగ్జామ్స్‌ రాయనున్నారు. ఈ పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు జరుగుతాయి. ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్సు (ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:50 వరకు) సైన్స్ (భౌతిక, జీవ శాస్త్రంగా విభజించారు. ఇది ఉదయం 9:30 నుండి ఉదయం 11:00 వరకు జరుగుతుంది) మిగతా సబ్జెక్టులు […]
Read more

రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు జూన్ 2న రుణ మంజూరు లేఖలు ఇస్తాం…డిప్యూటీ సీఎం!

హైదరాబాద్: రాజీవ్ యువ వికాసం పథకం లబ్దిదారులకు జూన్ 2న రుణ మంజూరు పత్రాలు పంపిణీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క వెల్లడించారు. ఈ మేరకు బ్యాంకు రుణాలు పొందేందుకు ఎంపికైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన ఐదు లక్షల మంది యువతకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న రుణ మంజూరు లేఖలు అందించనున్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి నిన్న అసెంబ్లీ ప్రాంగణంలో లబ్ధిదారుల […]
Read more

స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ కోటాకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం!

హైదరాబాద్: వెనుకబడిన తరగతుల (గ్రామీణ,పట్టణ స్థానిక సంస్థల్లో సీట్ల రిజర్వేషన్) బిల్లు, 2025ను తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. తొలుత.. ‘తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ (విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు) బిల్లు-2025’, ‘తెలంగాణ బీసీ (స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు) బిల్లు-2025’ను మంత్రి పొన్నం ప్రభాకర్‌ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును నిన్నటి సమావేశంలో మూజువాణి ఓటుతో ఆమోదించారు. అదే సమయంలో ఈ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం కూడా పొందాల్సి ఉన్నందున రాజ్యాంగ సవరణలు తీసుకురావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని […]
Read more

హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తాం…సీఎం రేవంత్ రెడ్డి!

వరంగల్: కాంగ్రెస్‌ నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైదరాబాద్‌కు ధీటుగా వరంగల్ అభివృద్ధికి ప్రాముఖ్యత ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. “ప్రజాపాలన – ప్రగతి బాట” సమావేశంలో మాట్లాడుతూ, వరంగల్ చారిత్రక ప్రాముఖ్యతను, తెలంగాణ ఉద్యమంలో పూర్వ జిల్లా ప్రజలు, కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు పోషించిన కీలక పాత్రను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా, ఔటర్ రింగ్ రోడ్, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థతో సహా కీలకమైన మౌలిక సదుపాయ ప్రాజెక్టుల కోసం […]
Read more

గంజాయి విక్రయిస్తున్న ఆరుగురు అరెస్టు…6.47 కిలోలు స్వాధీనం!

హైదరాబాద్: శేరిలింగంపల్లికి చెందిన ఎక్సైజ్ పోలీసులు రైళ్లలో గంజాయి రవాణా చేస్తున్న ఆరుగురిని అరెస్టు చేసి, రూ.4 లక్షల విలువైన 6.47 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ వ్యక్తులు ముంబై నుండి రైళ్లలో గంజాయిని రవాణా చేస్తున్నారు. దానిని నగరానికి అక్రమంగా రవాణా చేసిన తర్వాత, స్థానిక చిరువ్యాపారులు. వినియోగదారులకు విక్రయిస్తున్నారు. నిర్దిష్ట సమాచారం మేరకు, ఎక్సైజ్ అధికారులు శేరిలింగంపల్లిలో వారిని పట్టుకున్నారు. ఐదు మొబైల్ ఫోన్లతో పాటు గంజాయిని […]
Read more

తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు…వచ్చే వారం ఉరుములతో కూడిన వర్షాలు!

హైదరాబాద్‌: రాష్ట్రంలో వచ్చే వారం ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ఉష్ణోగ్రత 40°నుండి 44°కు చేరుకునే అవకాశం ఉంది. అయితే మార్చి 20, 24 మధ్య ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రజలకు అధిక వేడి నుండి కాస్త ఉపశమనం లభించనుంది. హైదరాబాద్‌కు చెందిన వాతావరణ విశ్లేషకుడు టి బాలాజీ ప్రకారం… మార్చి 19 వరకు వడగాల్పులు కొనసాగుతాయి. ఆ తర్వాత ఉరుములతో కూడిన వర్షాల కారణంగా ఎండ వేడిమి నుండి తాత్కాలిక […]
Read more

నకిలీ విత్తనాలు ఉత్పత్తి చేస్తే కఠిన శిక్షలు!

వనపర్తి : నకిలీ విత్తనాలు ఉత్పత్తి చేసే వారిపై కఠిన శిక్షలు విధిస్తామని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి సీనియర్ జడ్జి వి. రజని అన్నారు. గురువారం వనపర్తి జిల్లాలోని పెబ్బేరు మండలం జనంపల్లి గ్రామంలోని రైతు వేదికలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో రైతుల కోసం… రైతు చట్టాలు, రైతు సంక్షేమ పథకాలపై చట్టపరమైన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రతి రైతు రైతు చట్టాల […]
Read more

ఫ్యూచర్ సిటీ అథారిటీ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌!

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించతలపెట్టిన ఫ్యూచర్‌ సిటీకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లాలో 765.28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ‘ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ’ (FCDA) ఏర్పాటును ప్రకటించింది. FCDA తెలంగాణ అర్బన్ ఏరియాస్ (డెవలప్‌మెంట్) చట్టం, 1975 (చట్టం నం. 1 ఆఫ్ 1975) నిబంధనలను ఉపయోగించి సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేస్తుంది, జోనింగ్ నిబంధనల మేరకు అభివృద్ధిని ప్రణాళికాబద్ధంగా నియంత్రిస్తుంది. నిర్దేశిత “ఫ్యూచర్ సిటీ” ప్రాంతాలు ఔటర్ […]
Read more
1 20 21 22 23 24 25

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.