Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: తెలంగాణ/ఆంధ్ర

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

చలి గుప్పిట్లో తెలంగాణ…హైదరాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు!

హైదరాబాద్: తెలంగాణలో చలితీవ్రత పెరుగుతోంది. సాయంత్రం 6 దాటితే జనాలు ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఉదయంపూట భారీగా పొగమంచు కురుస్తున్నది. చలిగాలులు వీస్తున్నాయి. అనేక జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కుమరం భీమ్ ఆసిఫాబాద్‌లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు 7.9°C, తరువాత ఆదిలాబాద్‌లో 8.8°C, సిరిసిల్లలో 9.0°C నమోదయ్యాయి. కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి, నిర్మల్, జగిత్యాల, మెదక్, రంగారెడ్డితో సహా ఇతర జిల్లాల్లో 9.3°C నుండి 10.6°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి, ఇది రాష్ట్రవ్యాప్తంగా […]
Read more

హైదరాబాద్‌లో ఏడు కిలోల గంజాయి స్వాధీనం… ఇద్దరు అరెస్టు!

హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. ఈమేరకు ఎక్సైజ్ శాఖ అధికారులు ఇద్దరు వ్యక్తులను పట్టుకుని, వారి నుండి 7 కిలోల గంజాయి, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. నిర్దిష్ట సమాచారం మేరకు, రాష్ట్ర టాస్క్ ఫోర్స్ బృందం బోలారం బజార్ రైల్వే స్టేషన్‌లో ఒక కారును ఆపి తనిఖీ చేయగా గంజాయి దొరికింది. ధూల్‌పేట నివాసితులు పూజా బాయి, సత్యరావు అనే ఇద్దరు వ్యక్తులు ఇటీవల 10 కిలోల గంజాయిని కొనుగోలు చేశారని అధికారులు తెలిపారు. […]
Read more

గిగ్ కార్మికుల సంక్షేమ బిల్లుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం!

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం బిల్లును తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. ఈమేరకు గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత, సంక్షేమమే లక్ష్యం అని ప్రభుత్వం చెబుతోంది. రాబోయే అసెంబ్లీ సమావేశంలో బిల్లును ప్రవేశపెడతామని కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి మంత్రివర్గ సమావేశం తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నారు. గిగ్ వర్కర్స్ యూనియన్, అగ్రిగేటర్లు, ప్రభుత్వం ప్రతినిధులతో ఒక […]
Read more

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబర్‌లో జరిగే అవకాశం!

హైదరాబాద్: నిన్న కేబినెట్‌ మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈమేరకు మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం… తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ డిసెంబర్‌లో ఉండే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో, ఇదే ఊపు మీద స్థానిక ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. డిసెంబర్ 1 నుండి 9 వరకు ప్రజా పాలన వారోత్సవాన్ని నిర్వహించాలని కూడా మంత్రివర్గం నిర్ణయించిందని, ఆ తర్వాత స్థానిక సంస్థల […]
Read more

కేసీఆర్‌ క్రియాశీల రాజకీయాల్లో లేరు…సీఎం రేవంత్‌రెడ్డి విమర్శ!

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై విమర్శలను తీవ్రతరం చేశారు, ఆ అనుభవజ్ఞుడైన నాయకుడు “రాజకీయాల్లో చురుగ్గా లేరు” అని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అఖండ విజయం సాధించిన సందర్బంగా నవీన్ యాదవ్‌ను అభినందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ… “కేసీఆర్ రాజకీయాల్లో చురుగ్గా లేరు. నేను అలాంటి వ్యక్తిని విమర్శించాలనుకోవడం లేదు. కేటీఆర్ తన అహంకారాన్ని అదుపులో ఉంచుకోవాలని, హరీష్ రావు తన అసూయను తగ్గించుకోవాలని కూడా సలహా […]
Read more

జేఎన్‌టీయూ, ఉస్మానియాలను మోడల్ వర్సిటీలుగా ప్రతిపాదించిన కోర్‌ గ్రూప్‌!

హైదరాబాద్: విద్యాసంస్థల్లో మౌలిక వసతులపై తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన కోర్ గ్రూప్ పలు సిఫార్సులు చేసింది. మొదటి దశలో జెఎన్‌టియు హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీలను మోడల్ విశ్వవిద్యాలయాలుగా అభివృద్ధి చేయాలని పేర్కొంది. మౌలిక వసతుల కోసం మూడేళ్లలో ఈ రెండు వర్సిటీలకు ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించాలని ప్యానెల్ ప్రతిపాదించింది. కాగా, నూతన విద్యావిధానం తరహాలో “తెలంగాణ విద్యా విధానం” రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మౌలిక […]
Read more

మీర్ ఆలం ట్యాంక్ వంతెన టెండర్‌కు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం!

హైదరాబాద్: విశ్వనగరం హైదరాబాద్‌ సిగలో మరో మరో మణిహారం చేరనుంది. చారిత్రాత్మక మీర్‌ఆలం చెరువుపై మరో ఐకానిక్‌ వంతెనకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు టెండర్‌ను కెఎన్‌ఆర్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్‌కు రూ. 319.24 కోట్లకు అప్పగించింది. ప్రభుత్వ అసలు అంచనా రూ. 304.36 కోట్ల కంటే ఇది 4.89 శాతం ఎక్కువ. మూసీ నది ఒడ్డున నిర్మించనున్న ఈ 2.5 కి.మీ. వంతెన, ట్రాఫిక్ సమస్యలను తగ్గించడమే కాక, నగరానికి కొత్త పర్యాటక ఆకర్షణగా […]
Read more

జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌దేనని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా!

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌ అక్కడక్కడా ఉద్రిక్త ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసినట్లు చీఫ్ ఎల‌క్టోర‌ల్ ఆఫీస‌ర్ బి.సుద‌ర్శ‌న్ రెడ్డి చెప్పారు. ఈ ఉప ఎన్నికలో 48.49 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ చేసారు. కాగా, ఈ నియోజకవర్గంలో ఎలాఅయినా పాగా వేయాలని ప్రయత్నిస్తున్న అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు ఈ ఎన్నిక ఒక అగ్నిపరీక్షగా పరిగణిస్తున్నారు. రెండు ప్రముఖ పార్టీల మధ్య గట్టి పోటీ ఉంటుందని […]
Read more

ఆలోచించి ఓటేయండి…జూబ్లీహిల్స్ ఓటర్లకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి!

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అన్ని పార్టీలు ఎన్నికల వ్యూహాలను పదునుపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఓటర్లను తెలివిగా ఆలోచించి రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి పనులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఓటు వేయాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు నిన్న విలేకరులతో మాట్లాడుతూ… బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు గత ఏడాది కాలంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో […]
Read more

చేవెళ్ల బస్సు దుర్ఘటన…బీజాపూర్ హైవే విస్తరించాలని స్థానికుల డిమాండ్!

హైదరాబాద్: చేవెళ్ల బస్సు ప్రమాదం .. చాలా కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం… రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ గ్రామస్తులు బీజాపూర్ హైవే వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. రహదారి విస్తరించకపోవడం వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని వారు వాపోయారు. వికారాబాద్-బీజాపూర్ హైవేలోని గ్రామాల్లో నివసిస్తున్న అనేక మంది విద్యార్థులు, స్థానికులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. హైవేపై అధిక సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నందున, రోడ్డు విస్తరణ […]
Read more
1 21 22 23 24 25 52

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.