Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: తెలంగాణ/ఆంధ్ర

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వనున్న ఏఐఎంఐఎం!

హైదరాబాద్: రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నిర్ణయించింది. ఎంఐఎం ప్రస్తుతం అనధికారిక కూటమిలో భాగంగా అధికార కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తోంది. డిసెంబర్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం ఓట్లలో ఎక్కువ భాగాన్ని ఆకర్షించిన అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా AIMIM ఈ సీటును గెలుచుకున్న భారత రాష్ట్ర సమితి (BRS)కి మద్దతు ఇచ్చింది, లేకుంటే అవి కాంగ్రెస్‌కు వెళ్లేవి. గుండెపోటుతో మరణించిన BRS ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం […]
Read more

విమాన ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి!

హైదరాబాద్: అహ్మదాబాద్ నుండి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం A171 దురదృష్టకర ప్రమాదం సంభవించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, విమానంలో 230 మందికి పైగా ప్రయాణికులు, 12 మంది ఉన్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ విఫాద సంఘటనలో మృతిచెందిన ప్రయాణీకులు, సిబ్బంది ఆత్మ శాంతి కోసం సీఎం ప్రార్థనలు చేశారు. బాధితులను, వారి కుటుంబాలను ఆదుకోవడానికి త్వరితగతిన సహాయ చర్యలు చేపట్టాలని రేవంత్ […]
Read more

ఆదాయానికి మించి ఆస్తుల సంపాదించిన ఇంజనీర్ అరెస్ట్‌…ఏసీబీ తనిఖీలో విల్లాలు, హోటళ్ళు, అపార్ట్‌మెంట్లు ఉన్నట్లు వెల్లడి!

హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తున్న కేసులో కరీంనగర్‌లోని చొప్పదండి ఈఈ శ్రీధర్‌ను ఏసీబీ అరెస్ట్‌ చేసింది. ఆయనకు సంబంధం ఉన్న 14 స్థలాలపై అవినీతి నిరోధక బ్యూరో (ACB) దాడులు నిర్వహించి అక్రమ ఆస్తుల చిట్టాను బయటపెట్టింది. ఆర్థిక అవకతవకలపై దర్యాప్తులో ఉన్న కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో భాగమైన శ్రీధర్‌ను లెక్కకు మించి ఆస్తులు, సంపదపై ACB అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాగా, నీటిపారుదల శాఖలో పనిచేస్తున్న శ్రీధర్‌కు మలక్‌పేటలో నాలుగు అంతస్తుల భవనం, స్కై హైలో […]
Read more

నిర్లక్ష్యం, నిధుల కొరత కారణంగా విద్యార్థులకు దూరం అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలు!

హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల నుండి తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ ప్రైవేటు కాలేజీలు తల్లిదండ్రులు, విద్యార్థులను ఆకర్షించడానికి కొత్త మార్గాలను కనుగొన్నాయి. అధికారంలో ఉన్న పార్టీతో సంబంధం లేకుండా రాజకీయ వ్యవస్థ ఈ దాడిని నియంత్రించడంలో విఫలమైంది. దీంతో ఇంటర్మీడియట్ ప్రభుత్వ విద్య ఇప్పుడు సంక్షోభంలో చిక్కుకుంది. దీనికి తక్షణ విధాన జోక్యం అవసరం. ఈ మేరకు నిన్న హైదరాబాద్‌లో తెలంగాణ విద్యా కమిషన్ నిర్వహించిన ప్రజా విచారణ సందర్భంగా, […]
Read more

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికలో బీజేపీ కులం కార్డు వాడుతుంది…ఎమ్మెల్యే రాజా సింగ్!

హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి రాబోయే 6 నెలల్లో జరిగే ఉప ఎన్నికపై అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై భారతీయ జనతా పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే టి రాజా సింగ్ మాట్లాడుతూ… సీనియర్ నాయకులను పోటీ చేయడానికి బదులుగా, తన పోటీదారునికి టికెట్ ఇవ్వడంలో తన పార్టీ నాయకత్వం మరోసారి కుల సమీకరణకే ప్రాథాన్యమిస్తుందని అన్నారు. ఈమేరకు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ…జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక సుమారు ఆరు నెలల తర్వాత ఉంటుందని స్పష్టం చేశారు. […]
Read more

హైదరాబాద్‌లో యువకులపై దాడి…‘జై శ్రీరామ్’ చెప్పాలని బలవంతం!

హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు పరిధిలోని రాయదుర్గంలో రైట్‌వింగ్‌ శక్తులు ముస్లిం యువకులపై దాడి చేసి, వారిని ‘జై శ్రీరామ్’ నినాదాలు చేయమని బలవంతం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం అర్ధరాత్రి ఒక హోటల్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. బాధితుల కథనం ప్రకారం…కర్రలు, కత్తులతో ఆయుధాలు ధరించిన కొంతమంది వ్యక్తులు హోటల్‌లోకి వచ్చి పాన్ షాపు, హోటల్‌లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. కొంతమంది ముస్లిం యువకులను గమనించిన వారు వారిని వెంబడించి కర్రలతో కొట్టి గాయపడ్డారు. దాడి […]
Read more

టీపీసీసీకి కొత్త కార్యవర్గం…27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులు!

హైదరాబాద్: కాంగ్రెస్‌ అధిష్టానం టీపీసీసీకి కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసింది. ఈమేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) కొత్త ఉపాధ్యక్షులుగా 27 మంది, ప్రధాన కార్యదర్శులుగా 69 మంది పేర్లను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) ఆమోదించింది. ఈ నియామాకాలకు సంబంధించి నిన్న AICC ప్రధాన కార్యదర్శి KC వేణుగోపాల్ లేఖ ద్వారా ఈ ప్రకటన వెలువడింది. యువ నాయకులు, కొంతమంది సీనియర్ నాయకులు, పార్టీ ఎమ్మెల్యేలు, MPలు, MLCల కలయికతో ఈ నియామకాలు […]
Read more

తెలంగాణలో విద్యార్థుల బస్‌పాస్‌ ఛార్జీలు పెరిగాయ్‌!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలను సవరించింది. ఇది నిన్నటినుండి అమల్లోకి వచ్చాయి. దాదాపు 20శాతం మేర ఛార్జీలను పెంచారు. పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల మేర ఛార్జీలను పెంచామని ఆర్టీసీ చెబుతోంది. రూ.1,150 ఉన్న ఆర్డినరీ పాస్‌ రూ.1,400కు పెంచారు. రూ.1,300 ఉన్న మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్​ పాస్‌ ధరను రూ.1,600కు పెంచారు. రూ.1,450 ఉన్న మెట్రో డీలక్స్‌ పాస్‌ను రూ.1,800కు పెంచారు. గ్రేటర్‌ హైదరాబాద్‌, గ్రీన్‌ మెట్రో […]
Read more

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ…మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వివేక్, లక్ష్మణ్, శ్రీహరి!

హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. కొత్తగా ముగ్గురు మంత్రులకు స్థానం కల్పించారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన తొలి మంత్రివర్గ విస్తరణలో, జి. వివేక్ , అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరిని చేర్చుకున్నారు. ఈ విస్తరణలో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తూ, ఎస్సీ, బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాజ్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మంత్రులుగా ప్రమాణ […]
Read more

నలభై కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరనున్న తెలంగాణ ప్రభుత్వం!

హైదరాబాద్: కేంద్ర ఓబీసీ జాబితాలో 40 కులాలను చేర్చడంపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరాలని తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర OBC జాబితా నుండి తొలగించిన 26 కులాలకు సంబంధించిన బహిరంగ విచారణకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించింది. కాగా, ఈ సమావేశం జూన్ 9, 10, 11 తేదీల్లో జరగనుంది. దీనిపై కమిషన్ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉన్నందున, కుల సర్వే నుండి సమాచారం, ఈ తొలగించిన కులాల జనాభా, […]
Read more
1 37 38 39 40 41 52

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.