Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: తెలంగాణ/ఆంధ్ర

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

రైతులకు అధిక దిగుబడినిచ్చే విత్తనాలను అందిస్తాం…తెలంగాణ ఉద్యాన వర్సిటీ!

హైదరాబాద్: తెలంగాణలో హరిత విప్లవానికి శ్రీకారం చుట్టేలా హార్టికల్చర్‌ వర్సిటీ అడుగులు వేస్తోంది. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం (SKLTGSHU) రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని ఉద్యానవన రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడానికి సమగ్ర ప్రణాళికను రూపొందిస్తోంది. ఈమేరకు నిన్నరాజేంద్రనగర్‌లోని ఉద్యానవన విశ్వవిద్యాలయ కళాశాలలో జరిగిన సమావేశంలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ డి. రాజి రెడ్డి మాట్లాడుతూ…అధిక నాణ్యత గల ఉత్పత్తితో అధిక దిగుబడి, లాభాలను సాధించడమే లక్ష్యం అని అన్నారు. ఓపెన్-పరాగసంపర్క రకాలు, […]
Read more

స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉంది… సీఎం రేవంత్ రెడ్డి!

న్యూఢిల్లీ: వెనుకబడిన తరగతుల (బీసీ)లకు 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతను సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో మీడియాతో మాట్లాడుతూ…బీజేపీ వ్యతిరేకత, కీలక బిల్లులను ఆమోదించడంలో కేంద్రం ఆలస్యం చేసినప్పటికీ రిజర్వేషన్అమలుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన నొక్కి చెప్పారు. 90 రోజుల్లోపు (సెప్టెంబర్ చివరి నాటికి) స్థానిక ఎన్నికలు నిర్వహించాలని, 30 రోజుల్లోపు (జూలై చివరి నాటికి) రిజర్వేషన్ ఖరారు చేయాలని హైకోర్టు రాష్ట్రాన్ని […]
Read more

తెలంగాణకు భారీ వర్ష సూచన…ప్రజలు ఇళ్లలోనే ఉండాలని పిలుపు!

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. నిన్న ఉదయం నుండి ఇప్పటికే అనేక జిల్లాలను కుండపోత వర్షాలు ప్రభావితం చేస్తున్నాయి. హైదరాబాద్, దాని శివారు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప పౌరులు బయటికి రావద్దని, ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు కొనసాగుతాయని, ఉత్తర, ఈశాన్య ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని ఆ […]
Read more

నకిలీ ఆర్‌టీఏ చలాన్ యాప్ పేరిట సైబర్‌ స్కామ్‌…లక్షకుపైగా నష్టపోయిన బాధితుడు!

హైదరాబాద్: ట్రాఫిక్ చలాన్ చెల్లించాలంటూ సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసానికి తెరతీశారు. హైదరాబాద్‌లో 34 ఏళ్ల వ్యక్తి ఈ నకిలీ మొబైల్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత రూ.1.72 లక్షలు పోగొట్టుకున్నాడు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ప్రకారం… జూలై 16న బాధితుడికి “RTA CHALLAN.APK” అనే APK ఫైల్ ఉన్న WhatsApp సందేశం వచ్చాక ఈ సంఘటన జరిగింది. ట్రాఫిక్ చలాన్‌లను తనిఖీ చేయడానికి ఇది నిజమైన అప్లికేషన్ అని నమ్మి, అతను తెలియకుండానే […]
Read more

హైదరాబాద్‌లో డ్రగ్స్ అక్రమ రవాణా ముఠా అరెస్టు…82 లక్షల విలువైన సొత్తు స్వాధీనం!

హైదరాబాద్: హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (HNEW) స్థానిక పోలీసుల సమన్వయంతో నిర్వహించిన దాడిలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠా అరెస్టు చేసింది. బేగం బజార్, గోల్కొండ, బోలారం అంతటా జరిపిన స్వతంత్ర దాడుల్లో తొమ్మిది మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుండి రూ.82.1 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. బేగం బజార్ పోలీసుల సమన్వయంతో ఇద్దరు అంతర్రాష్ట్ర మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులను, ఒక స్థానికుడిని నార్కోటిక్‌ వింగ్‌ అరెస్టు చేసింది. ఈ బృందం […]
Read more

పర్యాటకానికి ఊపు… హుస్సేన్ సాగర్‌లో కొత్త క్రూయిజ్ బోట్!

హైదరాబాద్: హుస్సేన్ సాగర్‌లో బోటింగ్ కోసం పెరుగుతున్న డిమాండ్‌ను నెరవేర్చేందుకు తెలంగాణ టూరిజం శాఖ అదనంగా కొత్త క్రూయిజ్ బోట్‌ను తీసుకొస్తోంది. సరస్సు ఒడ్డున కొత్త కాటమరాన్ పడవకు తుది మెరుగులు దిద్దుతున్నారు. పనులు పూర్తయ్యాక త్వరలోనే దీనిని ప్రారంభించనున్నారు. కాటమరాన్ క్రూయిజ్‌ బోట్‌ఈ కొత్త బోటులో రెండు హల్స్, ఇంజిన్‌లతో కూడిన రెండస్థులు ఉంటాయి. గంటలో 100 మంది సందర్శకులను తీసుకెళ్లేంత విశాలంగా ఉంటుంది. పడవ 22 మీటర్ల పొడవు, 8 మీటర్ల వెడల్పు ఉంటుంది. […]
Read more

స్థానిక ఎన్నికల్లో 42% బీసీ కోటాకు మద్దతు కోరేందుకు ఢిల్లీ వెళ్తున్న సీఎం రేవంత్‌రెడ్డి!

హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు పార్టీలకు అతీతంగా ఎంపీల మద్దతు కూడగట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం జూలై 24న ఢిల్లీకి బయలుదేరుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణలో కుల సర్వే విధివిధానాలు, అమలుపై కాంగ్రెస్ కేంద్ర నాయకత్వానికి వివరించడమే ఈ ప్రతినిధి బృందం లక్ష్యమని విక్రమార్క ఒక ప్రకటనలో తెలిపారు. “పార్లమెంట్‌లో బీసీ బిల్లును త్వరగా ప్రవేశపెట్టి […]
Read more

ఉద్యోగ స్కామ్‌తో ఒమన్‌లో చిక్కుకున్న హైదరాబాదీ మహిళ…సాయం చేయాలని కోరిన కుమార్తె!

హైదరాబాద్: ఉద్యోగ స్కామ్‌లో బాధితురాలిగా హైదరాబాద్‌కు చెందిన 37 ఏళ్ల మహిళ ఒమన్‌లోని మస్కట్‌లో చిక్కుకుంది. ఆమె కుమార్తె తక్షణ జోక్యం కోరుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA)కి లేఖ ద్వారా విజ్ఞప్తి చేసింది. కాలాపత్తర్‌కు చెందిన సాజిదా బేగంకు స్థానిక ఏజెంట్ ఒమన్‌లో పనిమనిషి ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. ఆమె ఈ సంవత్సరం జూన్ 25న టూరిస్ట్ వీసాతో భారతదేశం నుండి బయలుదేరింది, కానీ అక్కడికి చేరుకున్న తర్వాత, ఆమె రోజుకు 16 గంటలకు […]
Read more

కుల సర్వేపై సమీక్షను ప్రభుత్వానికి సమర్పించిన నిపుణుల కమిటీ!

హైదరాబాద్: సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే- 2024 (SEEECPCS) ఏర్పాటైన స్వతంత్ర నిపుణుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి తన సమీక్షను సమర్పించింది. ఈ సర్వే పూర్తిగా శాస్త్రీయంగా, నమ్మదగినదిగా ఉందని, ఇది దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కమిటీ అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని 11 మంది సభ్యుల నిపుణుల కమిటీ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 300 పేజీల నివేదికను […]
Read more

తెలంగాణలో భారీ వర్షాలు…అధికారులను అప్రమత్తం చేసిన సీఎం రేవంత్‌ రెడ్డి!

హైదరాబాద్: హైదరాబాద్ సహా రాష్ట్రంలోని మిగతా చోట్ల భారీ వర్షాల నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ, సహాయ చర్యల సమయంలో GHMC, HMDA, హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా, మురుగునీటి బోర్డు, విద్యుత్‌, పోలీసు విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి కోరారు. హైదరాబాద్‌లో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF), జాతీయ […]
Read more
1 6 7 8 9 10 25

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.