‘ఎక్స్’లో రాజకీయ పోస్ట్‌లు తొలగించాలన్న ఈసీ…విభేదించిన X యాజమాన్యం!

0
14

న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘం (ECI) నుండి వచ్చిన చట్టపరమైన ఆదేశాలకు అనుగుణంగా తన వెబ్‌సైట్ నుండి నాలుగు రాజకీ పోస్ట్‌లను తీసివేసినట్లు గతంలో ట్విట్టర్‌గా పిలిచే X తెలిపింది. అయితే “ఈ చర్యలతో విభేదిస్తున్నట్లు” X గవర్నింగ్ బాడీ పేర్కొంది.

“X”లో రాజకీయ నాయకులు,  పార్టీలు, అభ్యర్థుల  రాజకీయ ప్రసంగాలతో కూడి ఉన్న పోస్ట్‌లపై చర్య తీసుకోవాల్సిందిగా ఉపసంహరణ ఉత్తర్వులు జారీ చేసింది” అని X  ‘గ్లోబల్ గవర్నెన్స్ వ్యవహారాల’ బృందం తెలిపింది.

“ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా, మేము ఈ పోస్ట్‌లను  నిలిపివేసామమని X యాజమాన్యం తెలిపారు”

“అయితే భారత ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలతో  మేము విభేదిస్తున్నాము. సాధారణంగా ఈ పోస్ట్‌లు  భావప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగించవని మేము నమ్ముతున్నామని X యాజమాన్యం తెలిపింది..”

మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కారణంగా నాలుగు పోస్ట్‌లను తొలగించాలని ఎన్నికల సంఘం ఏప్రిల్ 2, 3 తేదీల్లో కోరినట్లు X పేర్కొంది.

ఎన్నికల కమిషన్ ప్రకారం ఆ నాలుగు పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. – వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆమ్ ఆద్మీ పార్టీ, బీహార్ బిజెపి చీఫ్ సామ్రాట్ చౌదరి పోస్టులు మోడల్ కోడ్ ఆఫ్ కండకండక్ట్‌ను ఉల్లంఘించాయని ఈసీ పేర్కొంది.

పార్టీలు, అభ్యర్థులు ఇతర పార్టీలకు చెందిన వారి వ్యక్తిగత జీవితాలను విమర్శించడం మానుకోవాలని, “ధృవీకరించని ఆరోపణలు లేదా వక్రీకరణ” ఆధారంగా విమర్శలకు దూరంగా ఉండాలని ఇది మోడల్ కోడ్  పార్ట్ 1లోని క్లాజ్ 2ని ఈసీ ఉదహరించింది.

“పారదర్శకత కోసం” ECI  ఉపసంహరణ ఉత్తర్వులను ప్రచురిస్తున్నట్లు…సంబంధిత వినియోగదారులకు తెలియజేసినట్లు X తెలిపింది.

కొన్ని ఖాతాలను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందని, ఆ ఆదేశాలతో తాము ఏకీభవించడం లేదని ఫిబ్రవరిలో X ఇదే పోస్ట్‌ను షేర్ చేసింది.

“ఆదేశాలకు అనుగుణంగా, మేము భారతదేశంలో మాత్రమే ఈ ఖాతాలు, పోస్ట్‌లను నిలిపివేస్తాము; అయినప్పటికీ, మేము ఈ చర్యలతో విభేదిస్తున్నామని X గవర్నింగ్ బాడీ తెలిపింది.

భారత ప్రభుత్వ ఆదేశాలను ప్రచురించడానికి X  మార్గంలో చట్టపరమైన పరిమితులు అడ్డంకులు కలిగి ఉన్నాయని X  చెప్పింది. అయితే ఆంక్షలు ఏమిటో వివరించలేదు.

గత ఏప్రిల్‌లో, BBCకి ఇచ్చిన ఇంటర్వ్యూలో… ఎలన్ మస్క్ ట్విట్టర్ ఉద్యోగులను జైలుకు పంపే పరిస్థితిని ఎదుర్కొనే బదులు భారత ప్రభుత్వం జారీ చేసిన బ్లాకింగ్ ఆర్డర్‌లకు కట్టుబడి ఉండే అవకాశం ఉందని చెప్పారు.