29.7 C
Hyderabad
Saturday, May 4, 2024

వరద నీటిలో దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌… విమానాల దారి మళ్లింపు!

దుబాయ్: ఎప్పుడు ఎండలు, అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడే ఎడారి దేశం దుబాయిలో ఒక్కసారిగా భారీ వర్షాలు కురిసాయి. దీంతో  వరదలతో అల్లాడిపోయింది. ఊహించని జలప్రళయం సందడిగా ఉన్న నగరాన్ని స్తంభింపజేయడమే కాకుండా, ఈ ప్రాంతంలోని విపరీతమైన వాతావరణ పరిస్థితులపై  ఆందోళనలను కూడా లేవనెత్తింది.

భారీ వర్షాల కారణంగా వరద నీరు ముంచెత్తడంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక రద్దీ ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్‌లో అనేక విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది. దుబాయి ఎయిర్‌పోర్ట్‌లో సాధారణంగా సాయంత్రం వంద విమానాలు తిరుగుతాయి. వాతావరణ మార్పుల కారణంగా ఈ విమానాలన్నింటిని మళ్లించారు.

Xలో  దుబాయ్ విమానాశ్రయ విసువల్స్ లింక్

https://x.com/gunsnrosesgirl3/status/1780307713592897542

భారీ వర్షాల కారణంగా విమాన కార్యకలాపాలు ఆలస్యంగా నడుస్తుండడంతో పాటు పలు విమానాలను రద్దు చేశారు. వర్షానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. రన్‌వే పూర్తిగా నీటిలో మునిగిపోయింది. విమానాశ్రయం పార్కింగ్ కూడా సగం నీట మునిగింది. ఎయిర్‌పోర్టుకు వెళ్లే రహదారుల్లో నీరు నిలిచిపోయింది. షాపింగ్ మాల్స్‌, దుబాయ్ మెట్రో స్టేషన్లలో సైతం మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది.

యూఏఈలో వర్ష ప్రభావం వీడియో లింక్

https://x.com/TheCleanCarClub/status/1780343373804495052

తుఫాను ప్రభావం దుబాయ్ దాటి విస్తరించింది, మొత్తం UAE , పొరుగున ఉన్న బహ్రెయిన్ వరదలు సంభవించాయి.   వరదల కారణంగా ఎమిరేట్స్ అంతటా పాఠశాలలు మూసివేసారని AFP వార్తా సంస్థ తెలిపింది. నేడు కూడా వడగళ్లతో కూడిన భారీ తుఫాను రావచ్చని అంచనా.  ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తున్నారు.

తుఫానులు సంభవించిన ఒమన్‌లో నష్టం అత్యధికంగా ఉంది, ఆకస్మిక వరదల ఫలితంగా పిల్లలతో సహా 18 మంది మరణించారు. గత సంవత్సరం COP28 UN వాతావరణ సమావేశానికి అతిధ్యమిచ్చిన ఒమన్, యూఏఈ రెండూ దేశాల్లో గ్లోబల్ వార్మింగ్ కారణంగా వరదలు వచ్చే అవకాశం ఉందని గతంలో హెచ్చరించింది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles