23.7 C
Hyderabad
Thursday, October 3, 2024

దళిత పారిశ్రామికవేత్తల సమస్యల పరిష్కారానికి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసిన కర్ణాటక!

బెంగళూరు: కర్ణాటక భారీ, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి ఎం.బి. పాటిల్‌ రాష్ట్రంలోని దళిత పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎస్‌.సెల్వకుమార్‌ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు శుక్రవారం ప్రకటించారు.

రాజ్యసభ సభ్యుడు ఎల్.హనుమంతయ్య నేతృత్వంలో కర్ణాటక దళిత పారిశ్రామికవేత్తల సంఘం సభ్యులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.

”నిర్దేశించిన నిబంధనల ప్రకారం 24.10 శాతం పారిశ్రామిక ప్లాట్లను దళిత పారిశ్రామికవేత్తలకు కేటాయించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీని ప్రకారం షెడ్యూల్డ్ కులాల పారిశ్రామికవేత్తలకు 391 ఎకరాల భూమి అందుబాటులో ఉందని, ఈ పంపిణీని వేగవంతం చేస్తామని మంత్రి తెలిపారు.

పారిశ్రామికవేత్తల విజ్ఞప్తికి ప్రతిస్పందనగా, కోవిడ్ మహమ్మారి కంటే ముందు ప్లాట్లు కేటాయించిన లబ్ధిదారుల ప్రాజెక్ట్ అమలు, చెల్లింపులపై తాత్కాలిక నిషేధాన్ని ఒక సంవత్సరం నుండి రెండేళ్లకు పొడిగించారు.

పాత పారిశ్రామిక ప్రాంతాల్లో కేటాయించని ప్లాట్లలో 25 శాతం షెడ్యూల్డ్ కులాల పారిశ్రామికవేత్తలకు కేటాయిస్తామని పాటిల్ పేర్కొన్నారు. ప్రతిపాదనలు సవరించి, చిన్న ప్లాట్లు కేటాయించిన సందర్భాల్లో, రూ.15 కోట్ల లోపు పెట్టుబడులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత జిల్లా కమిషనర్ నేతృత్వంలోని కమిటీ చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు.

దాబస్‌పేట, హసన్‌, బిడాది తదితర ప్రాంతాల్లో దళిత పారిశ్రామికవేత్తలకు కేటాయించిన ప్లాట్‌ల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ఈ సమావేశానికి మంత్రి ఏ.బీ.పాటిల్ ఓ వీడియో లింక్ Xలో షేర్ చేశారు.

https://x.com/MBPatil/status/1804201587566612640

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles