23.7 C
Hyderabad
Friday, October 4, 2024

సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ పరీక్ష వాయిదా!

న్యూఢిల్లీ: నీట్, యూజీసీ-నెట్ ప్రవేశ పరీక్షల పేపర్‌ లీకేజీల అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న తరుణంలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA ) మరో పరీక్షను వాయిదా వేసింది. దేశంలోని వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో సైన్స్ విభాగంలో లెక్చరర్‌షిప్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్ (JRF) అర్హత కోసం నిర్వహించనున్న ‘సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ జూన్ – 2024’ పరీక్ష వాయిదాపడింది.

అనివార్య కారణాలతో వాయిదా వేసినట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించిన కొత్త తేదీలను త్వరలో వెల్లడించనున్నట్లు ప్రకటించింది.

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం దేశవ్యాప్తంగా జూన్‌ 25, 26, 27 తేదీల్లో సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (CSIR-UGC-NET) జూన్‌-2024 పరీక్ష నిర్వహించాల్సి ఉంది. ఈ పరీక్ష ద్వారా జేఆర్‌ఎఫ్‌ అర్హత పొందితే సీఎస్‌ఐఆర్‌ పరిధిలోని రిసెర్చ్‌ సెంటర్లలో, యూనివర్సిటీలలో పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా జేఆర్‌ఎఫ్‌ అర్హత పొందితే యూనివర్సిటీలు లేదా డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు అర్హత సాధిస్తారు.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రెస్ నోటీసు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మీడియా సమావేశంలో NTA పనితీరుపై ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ఒక రోజు తర్వాత CSIR UGC-NETని వాయిదా వేయాలనే నిర్ణయం వచ్చింది. UGC-NET పేపర్ డార్క్ నెట్‌లో లీక్ అయినట్లు మంత్రి అంగీకరించారు. దీంతో UGC-NET పరీక్షను జూన్ 19న రద్దు చేశారు.

“విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నేను ప్రతి ఒక్కరికీ హామీ ఇవ్వాలనుకుంటున్నాను. పారదర్శకత విషయంలో రాజీపడబోం. విద్యార్థి సంక్షేమమే మా ప్రాధాన్యత అని మంత్రి అన్నారు.

NTA-ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్న తీరుపై వివాదం కొనసాగుతుండగా, విద్యార్థులు, వివిధ సంస్థలు, ప్రతిపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తున్నాయి.

CSIR UGC-NET పరీక్ష రద్దుపై స్పందిస్తూ, X (ట్విట్టర్) పోస్ట్‌లో కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ ఇలా వ్రాశారు, “మరో NTA పరీక్ష వాయిదా పడింది. ఈసారి CSIR-UGC-NET. NTA యువతకు నరేంద్ర ట్రామా ఏజెన్సీగా మారిందని అన్నారు.

అంతకుముందు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో, పేపర్ లీక్‌లకు ప్రధాన కారణం విద్యాసంస్థలు బిజెపి, దాని మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ఆధిపత్యంలో ఉన్నాయని, దానిని అడ్డుకుంటే తప్ప పేపర్ లీక్‌లు ఆగవని అన్నారు. .

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles