28.2 C
Hyderabad
Thursday, October 3, 2024

‘సమంత-నాగ చైతన్యల విడాకుల వెనుక కేటీఆర్’…మంత్రి సురేఖ-క్షమాపణ చెప్పాలన్న బీఆర్‌ఎస్‌ చీఫ్‌!

హైదరాబాద్: తెలుగు సినీ హీరో నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడానికి కారణం మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) అంటూ తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

నటులు అక్కినేని నాగ చైతన్య, సమంత రూత్ ప్రభు విడాకులు తీసుకోవడానికి కేటీఆర్‌ కారణమని సురేఖ మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని పలువురు హీరోయిన్ల జీవితాలను కేటీఆర్ చెడగొట్టారని మంత్రి ఆరోపించారు.

డ్రగ్స్‌కు బానిసైన కేటీఆర్.. సినిమా సెలబ్రిటీలకు రేవ్ పార్టీలు పెట్టేవాడని.. అతడి దురాగతాలను ఎదుర్కోలేక చాలా మంది హీరోయిన్లు తమ సినిమా కెరీర్ ను కుదించుకుని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చనందుకు బదులు సమంతను పంపాలని కేటీఆర్ కోరగా.. నాగార్జున సమంతను కేటీఆర్ వద్దకు వెళ్లమని బలవంతం చేయడంతో సమంత నో చెప్పింది.. అది విడాకులకు దారి తీసింది’’ అని కొండా సురేఖ అన్నారు.

సమంత-నాగ చైతన్య విడాకులు తీసుకోవడానికి కారణం కేటీఆర్ అని.. ఆయన వల్లే చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకున్నారు.. డ్రగ్స్‌కు అలవాటు పడి రేవ్ పార్టీలకు వెళ్లి బ్లాక్‌మెయిల్ చేసి చాలా మందిని ఇబ్బంది పెట్టాడు.

కాగా, సురేఖ వ్యాఖ్యలు రాజకీయ ప్రేరేపితమని ఆరోపిస్తూ మంత్రి కేటీఆర్‌కు లీగల్ నోటీసు పంపారు.

ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, 24 గంటల్లోగా తనకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ నోటీసులో సురేఖను డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సురేఖపై పరువునష్టం చట్టం కింద చట్టపరంగా ముందుకెళ్తానని కేటీఆర్ అన్నారు.

ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని నాగ చైతన్య తండ్రి, ప్రముఖ టాలీవుడ్ నటుడు నాగార్జున సురేఖను కోరారు. ఈ మేరకు Xలో పోస్ట్ చేసారు.

‘మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ తారల జీవితాలను ప్రత్యర్థులపై విమర్శలకు ఉపయోగించుకోవద్దు.. దయచేసి ఇతరుల ప్రైవసీని గౌరవించండి.. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మహిళగా మీ వ్యాఖ్యలు, ఆరోపణలు మా కుటుంబానికి సంబంధించినవి పూర్తిగా అసంబద్ధం మరియు మీ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను” అని నాగార్జున అన్నారు

సురేఖ వ్యాఖ్యలను మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు.  మంత్రి సురేఖ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు

మంత్రి సురేఖ వ్యాఖ్యలపై సమంత కూడా స్పందించింది.

విడాకులు తీసుకోవడం తన వ్యక్తిగత విషయమని, ఊహాగానాలు మానుకోవాలని సురేఖకు సూచించింది. మేము మా ఛాయిస్‌ను ప్రైవేట్‌ అంశంగా భావించామంటే.. దానిని తప్పుగా అర్ధం చూసుకోవడం ద్వారా ఏదో మాట్లాడకూడదు అని సమంత తన పోస్టులో పేర్కొన్నారు. మా విడాకుల వ్యవహరం పరస్పర అంగీకారంతోనే జరిగింది. ఇందులో ఎలాంటి రాజకీయ కుట్ర లేదు అని మరోసారి క్లారిటీ ఇస్తున్నాను అని సమంత పేర్కొన్నారు.  వ్యక్తుల గోప్యత పట్ల బాధ్యతగా, గౌరవంగా ఉండాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను,” అని ఆమె తన సోషల్ మీడియా పోస్టులో రాసుకొచ్చారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles