29.2 C
Hyderabad
Friday, October 4, 2024

మణిపూర్‌లో అపహరణకు గురైన మైతీ ద్వయం విడుదలకు బదులుగా 11 మంది కుకీ ఖైదీల విడుదల!

న్యూఢిల్లీ: సెప్టెంబర్ 27న కుకీ మిలిటెంట్లు అపహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మణిపూర్‌కు చెందిన ఇద్దరు మైతీ వ్యక్తులు గురువారం విడుదలయ్యారు. ఇద్దరు వ్యక్తులు క్షేమంగా ఉన్నారని ది హిందూ నివేదించింది. ఇందుకు బదులుగా ఇంఫాల్ శివార్లలో ఉన్న సజివా జైలు నుండి 11 మంది కుకీ ఖైదీలను విడుదల చేసారు. వీరిద్దరి విడుదల ఏకకాలంలో జరిగింది.

కుకీ ఖైదీలను విడుదల చేయాలని అపహరణకు గురైన వారు ముందస్తు షరతు విధించగా, సంఘర్షణ పరిస్థితుల కారణంగా బెయిల్ పొందినప్పటికీ వారు జైలులో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు.

“సెప్టెంబర్ 27, 2024న కాంగ్‌పోక్పిలో అపహరణకు గురైన ఇద్దరు యువకులను సురక్షితంగా తిరిగి మణిపూర్_పోలీస్ కస్టడీకి తీసుకువచ్చారు. వారు సురక్షితంగా తిరిగి రావడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాల నుండి ప్రతి ఒక్కరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మీ కృషి ఎంతో విలువైనది” అని ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన మణిపూర్ హింసాకాండపై విచారణ కమిషన్‌కు సమర్పించిన తర్వాత ది వైర్ వార్తా సంస్థ పబ్లిక్ డొమైన్‌లో విడుదల చేసిన ఆడియో టేపులు ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్, అతని ప్రభుత్వం తప్పులకు పాల్పడినట్టు రూఢీ అవుతోంది. రాష్ట్రంలో హింస కారణంగా వందల మంది ప్రాణాలను కోల్పోవడానికి దారితీసింది. వేలాది మంది ప్రజలు ఇప్పటికీ నిరాశ్రయులయ్యారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles