31.7 C
Hyderabad
Thursday, October 3, 2024

వ్యవసాయ రుణ మాఫీ విధి విధానాలు…రేపటి క్యాబినెట్ సమావేశంలో ఇదే ప్రధాన అజెండా!

హైదరాబాద్: అర్హులైన ప్రతి రైతు ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు…. వ్యవసాయ రుణమాఫీ కోసం ఆర్థిక, వ్యవసాయ శాఖల ఉన్నతాధికారులు అర్థరాత్రి అయినా ఫైళ్లు సిద్ధం చేసే పనిలో పడ్డారు.   రేపు జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఇదే ప్రధాన అజెండాగా మారే అవకాశం ఉంది.

వ్యవసాయ రుణమాఫీ పథకాన్ని ఆగస్టు 15 నాటికి అమలు చేస్తామని సీఎం ప్రకటించినందున ఇది ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాదాపు 47 లక్షల మంది రైతులు ఉన్నారని, ప్రతి ఒక్కరిపై రూ. 1 లక్ష లేదా అంతకంటే తక్కువ రుణ భారం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి

. ఈ పథకం అమలుకు ప్రభుత్వానికి మొత్తం రూ.35,000 కోట్లు అవసరం అవుతుంది. అదనంగా, రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని రూ. 15,000 ఆర్థిక సహాయంతో అమలు చేస్తామని హామీ ఇచ్చింది, అంతేకాకుండా కౌలు రైతులను దీని పరిథిలోకి తీసుకువస్తున్నారు.

దీని తరువాత, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తన రెండు ప్రధాన పథకాలైన వ్యవసాయ రుణాల మాఫీ, రైతు భరోసా అమలుకు ప్రాథమికంగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన (PMKSY)  అర్హత ప్రమాణాలను చురుకుగా పరిశీలిస్తోంది. PMKSY ప్రమాణాలు వర్తింపజేస్తే దాదాపు 33 లక్షల మంది రైతులు అర్హులు అవుతారని, వ్యవసాయ రుణమాఫీ పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి 25,000 కోట్లు అవసరమని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

మునుపటి రుణమాఫీ పథకాలను దృష్టిలో ఉంచుకుని, అర్హత ప్రమాణాలపై తాజా అధ్యయనం జరుగుతోందని. దీని నుండి ఎవరిని తొలగించవచ్చో నిర్ణయించుకుంటామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.  సంస్థాగత భూ యజమానులు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, మాజీ, ప్రస్తుత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు  కాకుండా నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

అంతేకాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేస్తున్న, పదవీ విరమణ పొందిన అధికారులు, కార్పొరేషన్లు,  PSUల స్వయంప్రతిపత్త సంస్థలు, అనుబంధ కార్యాలయాలు, ప్రభుత్వ పరిధిలోని స్వయంప్రతిపత్త సంస్థలు, స్థానిక సంస్థలకు చెందిన ఎంప్లాయీస్,  అలాగే సాధారణ ఉద్యోగులకు  అర్హత ఉండదు. అయితే, మల్టీ టాస్కింగ్ సిబ్బంది, క్లాస్ IV, గ్రూప్ D ఉద్యోగులను లబ్ధిదారుల జాబితాలో ఉంచనున్నారు.  ఆదాయపు పన్ను మదింపుదారులు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, వృత్తిపరమైన సంస్థలలో రిజిస్టర్ చేయబడిన ఆర్కిటెక్ట్‌లు కూడా అర్హులు కాదని వర్గాలు తెలిపాయి.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles