28.2 C
Hyderabad
Thursday, October 3, 2024

షాద్‌నగర్ గ్లాస్ ఫ్యాక్టరీలో పేలుడు…ఐదుగురు మృతి, 15మందికి గాయాలు!

హైదరాబాద్:  రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వలస కూలీల బతుకులు చిధ్రమయ్యాయి. షాద్‌నగర్‌లోని గ్లాస్ తయారీ యూనిట్‌లో శుక్రవారం జరిగిన పేలుడులో ఐదుగురు మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారు.

రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం సౌత్ గ్లాస్ తయారీ యూనిట్‌లో భారీ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉంది.  కార్మికులు కనీసం రెండు నుండి మూడు మీటర్ల దూరం ఎగిరిడ్డారు. మరణించిన కార్మికుల మృతదేహాల భాగాలు ఆ ప్రదేశం బీభత్సంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. చాలా మంది  ఒడిశా, ఉత్తరప్రదేశ్, బీహార్ నుండి  వచ్చిన వలస కార్మికులే కావడం గమనార్హం.

పేలుడు ధాటికి గాజు ముక్కలు తగిలి వారికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడుకు భవనంలో మంటలు వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు చిత్తరంజన్, రామ్ ప్రకాష్, రవికాంత్, రోషన్‌లుగా గుర్తించారు.

అగ్నిమాపక శాఖ తెలిపిన వివరాల ప్రకారం, గాలిని అధికంగా నింపడం వల్ల కంప్రెసర్‌లో పేలుడు సంభవించడంతో సాయంత్రం 4.30 గంటలకు మంటలు సంభవించాయి. ఫర్నేస్ సెక్షన్‌లో మంటలు చెలరేగి ఇతర ప్రాంతాలకు వేగంగా వ్యాపించాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంఘటన జరిగినప్పుడు యూనిట్‌లో సుమారు 100 మంది కార్మికులు ఉన్నారని చెబుతున్నారు కాగా, ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఘటనపై ఆరా తీసి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌తో పాటు రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులను ఆదేశించారు.

బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles