28.2 C
Hyderabad
Thursday, October 3, 2024

అంగన్‌వాడీ కేంద్రంలో కుళ్లిన గుడ్లు..టీచర్‌ను నిలదీసిన పేరెంట్స్!

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు స్వచ్ఛమైన ఆహారాన్ని అందించాలని చేపట్టిన సంకల్పాన్ని పలువురు మధ్య దళారులు చిన్నాభిన్నం చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న అధికారుల నిర్లక్ష్యంతో పలువురు నీరు గార్చుతున్నారు.

కరీంనగర్ జిల్లా మేడిపల్లి మండలం వెల్లంపల్లి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలోని చిన్నారులకు అక్టోబరు 1వ తేదీన అందించిన గుడ్లు కుళ్లిపోయి, పురుగులు ఉన్నాయనే విషయం తల్లిదండ్రుల దృష్టికి రావడంతో వారు సంబంధిత అంగన్‌వాడీ టీచర్‌ను నిలదీసి ప్రశ్నించారు.

బుధవారం జిల్లా సంక్షేమాధికారి బీ నరేష్‌ అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించగా ఆహారం నిల్వ ఉంచిన ప్రాంతంలో ఎలుకలు సంచరిస్తున్నట్లు గుర్తించారు.

అంగన్‌వాడీ టీచర్లు, గుడ్లు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లను సస్పెండ్ చేస్తామని, నాణ్యత లేని, కల్తీ గుడ్లను పిల్లలకు అందజేస్తే కాంట్రాక్టు రద్దు చేస్తామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హెచ్చరించిన నేపథ్యంలోనే ఇది జరిగింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో జరిగిన ‘ఆహార పోషణ జాతర’లో ఆమె ప్రసంగించారు.

“ఏ అంగన్‌వాడీ టీచర్ లేదా అంగన్‌వాడీ సూపర్‌వైజర్ నాసిరకం గుడ్లు లేదా ఏదైనా ఆహార పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు కనుగొంటే, వారు వాటిని స్వీకరించకూడదు, రిజిస్టర్‌లో వివరాలను నమోదు చేసి వాటిని తిరిగి సరఫరాదారుకి పంపాలి. ఆ సమాచారాన్ని వాట్సాప్ ద్వారా ఉన్నతాధికారులకు పంపాలి. కానీ ఎవరైనా పిల్లలకు ఇలాగే తినిపించవచ్చని భావిస్తే, అలాంటి అధికారులను సస్పెండ్ చేస్తాం’’ అని సీతక్క హెచ్చరించారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles