23.7 C
Hyderabad
Thursday, October 3, 2024

చేనేత కార్మికులపై కేంద్రం శీతకన్ను… మంత్రి కేటీఆర్ విమర్శ!

సిరిసిల్ల: రాష్ట్రంలోని చేనేత కార్మికులపై కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపిస్తోందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలోని లక్షలాది నేతన్నల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రాన్ని పలు పథకాలు మంజూరు చేయాలని కోరుతున్నా ఫలితం ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్లలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. “లేఖల ద్వారా, స్వయంగా కలిసి వినతులు అందిస్తున్నాం. ఏడేళ్లుగా కేంద్రం నుంచి ఉలుకూ… పలుకూ లేదు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా కేంద్రంతో పోరాటం చేస్తూనే ఉన్నామని మంత్రి తెలిపారు. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో
రాష్ట్ర ప్రభుత్వం తరుపున సవివరంగా లేఖలు పంపుతున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్తో పాటు తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు ‘బండి సంజయ్‘ కు కూడా పంపుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర భాజపా
నాయకులు ఇకనైనా మొద్దు నిద్ర నుంచి బయటకు వచ్చి.. రాజకీయాలు పక్కన పెట్టి.. ప్రజలకు మేలు చేసే పనులు చేయాలని హితవు పలికారు.
రాష్ట్రం డిమాండ్లు:
దేశంలోనే అతిపెద్ద కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు 1,250 ఎకరాల్లో వరంగల్ లో ఏర్పాటు చేశాం. అక్కడ ఇప్పటికే రెండు పరిశ్రమలు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుని పనులు ప్రారంభించాయి. ఇక్కడి పార్కుకు పీఎం మిత్ర పథకంలో రూ.895.92 కోట్లు మంజూరు చేయండి. ఇప్పటికే అయిదారు లేఖలు రాశామని కేటీఆర్ తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్
ఆఫ్ హ్యాండ్లూం టెక్నాలజీ సంస్థ ఉండేది. రాష్ట్ర
విభజనతో అది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా వెంకటగిరికి వెళ్లింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది చేనేత వస్త్రోత్పత్తిదారులకు శిక్షణ లేకుండా పోయింది. రాష్ట్రంలో పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, దుబ్బాక, కమలాపూర్, నల్గొండ వంటి ఎన్నో చేనేత సమూహాలున్నాయి. పోచంపల్లి కేంద్రంగా ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేస్తే చేనేత కార్మికులు ఎంతో మేలు చేకూరుతుంది.
రాష్ట్రంలో చేనేత, మరమగ్గాలను ఆధునికీకరించాల్సి ఉంది. మేం 50 శాతం భరిస్తాం. కేంద్రం 50 శాతం ఇవ్వాలని కేటీఆర్ లేఖలో కోరారు. రాష్ట్రంలోని 11 బ్లాక్ లెవల్ క్లస్టర్లలో నేషనల్ హ్యాండ్లూం డెవలప్మెంట్ ప్రోగ్రాంని మంజూరు చేయాలని మంత్రి కేంద్రాన్ని కోరారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles