Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

పాలస్తీనా ఖైదీలకు మరణశిక్ష విధిస్తానని బెన్-గ్విర్ శపథం!

Share It:

టెల్‌అవీవ్‌: ఇజ్రాయెల్‌లో తదుపరి ఏర్పడబోయే ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా నియమితులైతే, పాలస్తీనా ఖైదీలకు మరణశిక్ష అమలు జరిగేలా ఒత్తిడి తెస్తానని, గాజా, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ నుండి పాలస్తీనియన్ల తొలగింపును వేగవంతం చేస్తానని ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మంత్రి ఇటామర్ బెన్-గ్విర్ శపథం చేశారు. తన జైలు గదిలో పాలస్తీనా ఖైదీ హసన్ సలామేహ్‌ను తాను ఎదుర్కొంటున్న వీడియో ఫుటేజ్‌ను బెన్-గ్విర్ ‘ఎక్స్’ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశారు.

1990లలో ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడుల కేసులో దోషిగా తేలిన సలామేహ్, 1996 నుండి ఇజ్రాయెల్ అధికారుల అదుపులో ఉన్నారు. ఈ దాడులలో డజన్ల కొద్దీ ఇజ్రాయెలీలు మరణించగా, అంతే సంఖ్యలో గాయపడ్డారు. ప్రస్తుతం అతను పలుకేసుల్లో జీవిత ఖైదు శిక్షలను అనుభవిస్తున్నారు.

“నిన్ను ఉరితీయాలనుకుంటున్నానని” ఆ వీడియోలో బెన్-గ్విర్ నేరుగా సలామేహ్‌తో అన్నారు. ఆ రికార్డింగ్‌తో పాటు విడుదల చేసిన ఒక ప్రకటనలో, తాను రక్షణ శాఖను చేపడితే, సలామేహ్ వంటి ఖైదీలకు మరణశిక్ష పడేలా చూస్తానని, అదే సమయంలో గాజా, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ రెండింటి నుండి పాలస్తీనియన్ల “స్వచ్ఛంద వలస”ను ప్రోత్సహిస్తానని బెన్-గ్విర్ స్పష్టం చేశారు.

మరణశిక్ష చట్టం
భవిష్యత్తులో ఏ సంకీర్ణ ప్రభుత్వంలోనైనా తమ ప్రవేశానికి, రక్షణ, న్యాయ శాఖలు రెండింటినీ దక్కించుకోవడం తప్పనిసరి అని తమ జ్యూయిష్ పవర్ (ఓట్జ్మా యెహుదిత్) పార్టీపై అధికారికంగా షరతులు విధిస్తామని ఇజ్రాయల్‌ మంత్రి ధృవీకరించారు.

“స్వచ్ఛంద వలస” అనే పదజాలంతో గాజా, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ నుండి పాలస్తీనియన్లను పెద్ద ఎత్తున తరలించాలని, బెన్-గ్విర్ పదేపదే ఆందోళన చేశారు. అయితే ఈ పథకాలను పాలస్తీనియన్ నాయకులు, విస్తృత ప్రజానీకం, అరబ్ దేశాలు బలవంతపు బహిష్కరణలుగా, జాతి ప్రక్షాళనగా నిరంతరం ఖండించి, తిరస్కరించాయి.

మార్చిలో, ఇజ్రాయెల్ క్నెసెట్ (ఇజ్రాయెల్ పార్లమెంట్) నిర్దేశిత పరిస్థితులలో పాలస్తీనియన్ ఖైదీలకు మరణశిక్ష విధించే అధికారాన్ని ఇచ్చే చట్టాన్ని ఆమోదించింది. ఈ చర్యకు బెన్-గ్విర్, అతని పార్లమెంటరీ పార్టీ గట్టిగా సమర్థించింది.

ఈ మరణశిక్ష బిల్లు, ఖైదులో ఉన్న పాలస్తీనియన్ల తీవ్రమైన మానవ హక్కుల పరిణామాలపై అరబ్, ప్రాంతీయ దేశాలలో విస్తృత ఖండన, దౌత్యపరమైన ఘర్షణలు, ప్రజా ప్రదర్శనలకు దారితీసింది. కాగా, అక్టోబర్ 27న ఇజ్రాయెల్ తన దేశవ్యాప్త క్నెసెట్ సార్వత్రిక ఎన్నికలను నిర్వహించడానికి సిద్ధమవుతున్న తరుణంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.