Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ద్వేషాన్ని నిర్మూలించి.. సామరస్యం పెంచుదాం: జమాతే ఇస్లామి హింద్!

Share It:

అక్టోబర్ 30 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో 3 రోజుల ‘బియాండ్ ది డివైడ్’ ఎక్స్ పో, సెమినార్!

హైదరాబాద్ (సోమాజీగూడ), అక్టోబర్ 28:
సమాజంలో పెరుగుతున్న అపోహలు, పక్షపాత భావాలు, తప్పుడు సమాచారాన్ని నివారించి, విభిన్న వర్గాల మధ్య సామాజిక సామరస్యం, పరస్పర అవగాహనను పెంపొందించేందుకు “బియాండ్ ది డివైడ్ – కౌంటరింగ్ హేట్, బిల్డింగ్ హార్మనీ” (Beyond The Divide – Countering Hate. Building Harmony.) పేరుతో 3 రోజుల ప్రజా ప్రదర్శన, సెమినార్‌ను నిర్వహిస్తున్నట్లు జమాత్-ఎ-ఇస్లామి హింద్ గ్రేటర్ హైదరాబాద్ నాయకులు తెలిపారు.
ఈ మేరకు బుధవారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జమాతె ఇస్లామి హింద్ హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ ముబషిర్ అహ్మద్, సిటీ కార్యదర్శి ఆజమ్ అలీ బేగ్, హైదరాబాద్ ప్రతినిధి ఇంతియాజ్ పాల్గొని వివరాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా డాక్టర్ ముబషిర్ అహ్మద్ మాట్లాడుతూ.. అక్టోబర్ 30 నుండి నవంబర్ 1 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఈ ఎక్స్‌పోను నిర్వహించనున్నట్లు తెలిపారు. సమాజంలో భయాన్ని అవగాహన వైపు, ఊహలను వాస్తవాల వైపు, విభజనను సామరస్యం వైపు నడిపించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
కార్యక్రమ విశేషాలు & సమయాలు:
• అక్టోబర్ 30 (శుక్రవారం): సాయంత్రం 5:00 గంటల నుండి రాత్రి 9:00 గంటల వరకు.
• అక్టోబర్ 31, నవంబర్ 1 (శని, ఆదివారాలు): మధ్యాహ్నం 12:30 గంటల నుండి రాత్రి 9:30 గంటల వరకు.
• వేదిక: ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, నాంపల్లి, హైదరాబాద్.
ఈ ప్రదర్శనలో భాగంగా ప్రత్యేక గ్యాలరీలు, దృశ్య ప్రదర్శనలు, ఇంటరాక్టివ్ డిస్ప్లేలతో పాటు విద్యావేత్తలు, జర్నలిస్టులు, చరిత్రకారులు, మత పెద్దలు మరియు సామాజిక విశ్లేషకులతో కూడిన సెమినార్లను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వివరించారు.

సమాజంలో తరచుగా చర్చకు వచ్చే సున్నిత అంశాలు, ఇస్లాం సాంస్కృతిక భాగస్వామ్యం, ఉమ్మడి విలువలు, సామరస్య సహజీవనంపై ఈ ఎక్స్‌పోలో అవగాహన కలిగిస్తారని తెలిపారు. అన్ని వర్గాలు, మతాలు, భావజాలాలకు చెందిన ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు, యువత, మేధావులు, కుటుంబ సమేతంగా అందరూ ఈ ప్రదర్శనకు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రదర్శనకు ఉచిత ప్రవేశం ఉంటుందని తెలిపారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.