Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ల ‘విద్వేషపూరిత ఆలోచనా ధోరణి’ రాజ్యాంగాన్ని నాశనం చేస్తోంది…రాహుల్ గాంధీ!

Share It:

కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలో జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ, దాని సైద్ధాంతిక మాతృసంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌ల “విద్వేషపూరిత ఆలోచనా ధోరణి” భారత రాజ్యాంగాన్ని పద్ధతి ప్రకారం నాశనం చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తోందని ఆయన ఆరోపించారు.

సభను ఉద్దేశించి రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ… కాషాయ పార్టీ ఓట్ల దొంగతనానికి పాల్పడుతోందని, ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరుస్తోందని పేర్కొనారు. “బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు “ఓట్ల దొంగతనంలో పాలుపంచుకుంటున్నాయని”ఆయన ఆరోపించారు.

బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ కూటమిని విమర్శిస్తూనే…రాహుల్‌ గాంధీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వంపై కూడా దృష్టి సారించారు. ఉద్యోగ హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. మమతా బెనర్జీ ఐదు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ, 84 లక్షల మంది యువకులు నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఇది రాష్ట్రంలో నిరుద్యోగిత తీవ్రతను తెలియజేస్తోందని తెలిపారు.

రాజ్యాంగ విలువలను పరిరక్షించడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, యువత నిజమైన సమస్యలను పరిష్కరించడానికి కట్టుబడి ఉన్న ప్రత్యామ్నాయ శక్తి కాంగ్రెస్‌ పార్టీయేనని రాహుల్‌ గాంధీ అభివర్ణించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉత్తర దినాజ్‌పూర్, మాల్దా, ముర్షిదాబాద్ సహా పలు జిల్లాల్లో జరిగిన ర్యాలీల పరంపరలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో తీవ్రమవుతున్న రాజకీయ పోటీని ఈ ప్రసంగం స్పష్టం చేసింది. బీజేపీ విభజన రాజకీయాలను, అలాగే ఉపాధి, అభివృద్ధిపై టీఎంసీ పాలన రికార్డును కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.