23.7 C
Hyderabad
Thursday, October 3, 2024

ఆల్కహాల్ కొంతైనా గుండెకు మంచిది కాదు… వరల్డ్ హార్ట్ ఫెడరేషన్!

జెనీవా: మితంగా మద్యం సేవించడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందనే విస్తృత భావన సరికాదని వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ (WHF) కొత్త పాలసీ పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా మద్యం సంబంధిత మరణాలు వైకల్యంలో పెరుగుదల:
2019లో, ఆల్కహాల్ కారణంగా 2.4 మిలియన్లకు పైగా ప్రజలు మరణించారు, ప్రపంచవ్యాప్తంగా మొత్తం మరణాలలో 4.3%, 15 నుండి 49 సంవత్సరాల వయస్సు గల పురుషులలో 12.6% మరణాలు సంభవించాయి. ఆల్కహాల్ అనేది హానికరమైన పదార్థం, ఇది మానవ శరీరానికి గణనీయమైన నష్టాన్ని కలిగిస్తుంది. హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్, జీర్ణ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదముంది.
ఆల్కహాల్ వినియోగం ఏస్థాయిలో అయినా ఆరోగ్యకరమైన జీవితాన్ని కోల్పోయేలా చేస్తుంది. కొరోనరీ డిసీజ్, స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్, హైపర్‌టెన్సివ్ హార్ట్ డిసీజ్, కార్డియోమయోపతి వ్యాధులు సంక్రమిస్తాయి. కొంత మొత్తంలో ఆల్కహాల్ కూడా ఒక వ్యక్తికి హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అలా కాకుండా క్లెయిమ్ చేసే అధ్యయనాలు చాలావరకు పూర్తిగా పరిశీలనాత్మక పరిశోధనపై ఆధారపడి ఉంటాయి. ఈ రోజు వరకు, మితమైన మద్యపానం కారణంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువ అన్న వాదనకు ఎటువంటి సాక్ష్యాధారాలు లేవని వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ తెలిపింది.
“ఒక శక్తివంతమైన సామాజిక జీవితానికి ఆల్కహాల్ అవసరం అని చిత్రీకరించడం… మద్యపానం వల్ల కలిగే హాని నుండి దృష్టిని మరల్చడమే, రోజూ ఒక గ్లాసు రెడ్ వైన్ వంటి మితమైన మద్యపానం హృదయ సంబంధ వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుందని విస్తృతంగా ప్రచారం చేస్తుంటారని WHF అడ్వకేసీ కమిటీ సభ్యురాలు మోనికా అరోరా అన్నారు. “ఈ వాదనలు తప్పుడు సమాచారంతో కూడుకున్నవి. మద్యం పరిశ్రమ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు చేసిన చెత్త ప్రయత్నం.”ఆల్కహాల్ కారణంగా ఆర్థిక, సామాజిక వ్యయాలు పెరుగుతాయి. ముఖ్యంగా ఆరోగ్య వ్యవస్థలకు అయ్యే ఖర్చు, ఉత్పాదక నష్టాలు, అలాగే హింస, నేర కార్యకలాపాలు పెరిగే ప్రమాదం ఉన్నాయి. దిగువ సామాజిక-ఆర్థిక నేపథ్యాల నుండి వచ్చిన వ్యక్తులపై ఆల్కహాల్ ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది.
కార్డియో వాస్కులర్ ఆరోగ్యంపై మద్య వినియోగం ప్రభావం చూపుతుంది.
ఆల్కహాల్ వినియోగాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యల్లో ముఖ్యంగా… ఆల్కహాల్ లభ్యతపై పరిమితులు విధించడం, ఆల్కహాల్ ప్రకటనలపై నిషేధాన్ని అమలు చేయడం వంటి విషయాలపై దృష్టి సారించడం వల్ల కొంతైనా ఉపయోగం ఉంటుందని వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ తన కొత్త పాలసీలో పేర్కొంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles