30.2 C
Hyderabad
Sunday, May 5, 2024

‘కుబూల్ హై?’ పాతబస్తీలో బాల్య వివాహాలపై వెబ్ సీరీస్!

హైదరాబాద్: వెబ్ సిరీస్ ‘కుబూల్ హై?’ బాల్య వివాహాలు, దానితో పోరాడే, అంగీకరించే సమాజం గురించి ఈ చిత్రం మాట్లాడుతుంది. మనకి ఎంతో అందంగా కనిపించే హైదరాబాద్… పాత బస్తీలో ఉండే చీకటి కోణాల్ని వెలికి తీసి ఆవిష్కరించిన చిత్రమిది. అక్కడ ఉండే పేద ముస్లింలు వాళ్ళ అమ్మాయిలకి 13 వ ఏట రాగానే డబ్బులకి ఆశపడి పెద్ద వయసు కలిగిన అరబ్ షేక్ లకు ఇచ్చి పెళ్ళి చేయడం..! తర్వాత ఆ ఆడపిల్లల జీవితం ఎలా ఉంటుంది? అసలు ఏ ఉద్దేశంతో షేక్ లు ఎక్కువ డబ్బులు ఇచ్చి ఇలాంటి అమ్మాయిలను పెళ్ళి చేసుకుంటారు? నేరాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి, పోలీసులకు ఇవన్నీ తెలుసా? తెలిసినా వాళ్ళ ఇన్వాల్వ్ మెంట్ ఎలా ఉంటుంది? అనే అంశాల చుట్టూ క్రైమ్ థ్రిల్లర్ జోడించి తెరకెక్కిన వెబ్ సిరీస్ కుబుల్ హై. ఈ సిరీస్ కథ మొత్తం పాతబస్తీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది.
పాతబస్తీలోని మురికివాడల్లో కథ కథనం నడుస్తుంది. తలాబ్‌కట్టా (పాత నగరంలోని ఒక మురికివాడ)లో పేదరికం, కష్టాల మధ్య, ఒక తండ్రి తన 12 ఏళ్ల కుమార్తెను షేక్ అనే ధనవంతుడైన వృద్ధుడికి అమ్మటం అన్న అంశం నుంచి ఈ కథ మొదలవుతుంది. సోమవారం చార్మినార్ సమీపంలోని మొగల్‌పురాలోని ఉర్దూ ఘర్‌లో జరిగిన ఈ సిరీస్ స్క్రీనింగ్‌ (ప్రివ్యూ)కి నగరంలోని బాలికలు, మహిళలు హాజరయ్యారు. ఈ చిత్రం గురించి షాహీన్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు, దర్శకులు జమీలా నిషాత్ మాట్లాడుతూ, ‘ఖుబూల్ హై?’ అనే వెబ్ సిరీస్ గురించి చెప్పారు. మన సమాజాన్ని పీడిస్తున్న సమస్యను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఖుబూల్ హై, తెలుగు, దక్కనీ భాషలలో ద్విభాషా ప్రదర్శిస్తున్నాం. బాల్య వివాహాలు, అమ్మాయిల అక్రమ రవాణా గురించి కల్పిత కథనం ఈ సినిమా. హైదరాబాద్‌లోని ఒక చిన్న బస్తీలో, 12 ఏళ్ల బాలికను అపహరించి, వృద్ధ షేక్‌తో బలవంతంగా వివాహం చేయడం చూసిన అక్కడి పౌరుల జీవితాలు ఉలిక్కిపడ్డాయి. “బాధ్యతా రహితమైన తండ్రి బారినుంచి స్థానిక పోలీసు ఆ అమ్మాయిని మరొక బాధితురాలు కాకుండా కాపాడగలడా? ఆ కాపాడడంలో ఆయా పాత్రలు ఎదుర్కొన్నకష్టాలు ‘ ఈ చిత్రంలో అద్భుతంగా చిత్రీకరించారు. ఖుబూల్ హై?’.”
మార్చి 11న ఆహా వేదికపై ఈ సినిమా ప్రీమియర్‌ను ప్రదర్శించామని ఆమె తెలిపారు. ‘ప్రపంచానికి చెప్పే టైమ్ వచ్చింది (కొన్ని కథలు చెప్పాలి)’ అనే సందేశంతో ఈ ట్రైలర్‌ను మహిళా దినోత్సవం సందర్భంగా నటుడు రానా దగ్గుబాటి ఆవిష్కరించారు. సానియా మీర్జా, శోబు యార్లగడ్డ (నిర్మాత, ఆర్కా మీడియా వర్క్స్), నందిని రెడ్డి (డైరెక్టర్, ఓ బేబీ) మరియు విజయలక్ష్మి గద్వాల్ (హైదరాబాద్ మేయర్) ఈ ప్రాజెక్ట్‌కి తమ మద్దతును తెలియజేయడంతో టీజర్‌కు మంచి ఆదరణ లభించింది” అని ఆమె తెలిపారు. ఈ చిత్రాన్ని ప్రణవ్ పింగ్లే రెడ్డి నిర్మించారు. ఉమైర్ హసన్, ఫైజ్ రాయ్,  ప్రణవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఖుబూల్ హై కథాంశం – ఓల్డ్ సిటీ యొక్క బై-లేన్‌లలో ఒక యువ బృందం మొదటిసారిగా చిత్రీకరించారు. హైదరాబాద్‌లోని గంగా-జమున తహజీబ్‌ను వెబ్ సిరీస్ ప్రేక్షకులకు తెలియజేసిన మొదటి చిత్రం కూడా ఇదే. ఈ వెబ్‌ సీరీస్‌ హైదరాబాద్ కోసం హైదరాబాదీలు నిర్మించి రూపొందించిన షో.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles