25.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

తెలంగాణలో ప్రైవేట్‌తో దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు!

హైదరాబాద్: చాలా కాలంగా తెలంగాణలోని ప్రభుత్వ తృతీయ శ్రేణి ఆసుపత్రులు ప్రాథమిక ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణ, సీజనల్ వ్యాధులపై నిఘా, ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలను అమలు చేయడానికి మాత్రమే పరిమితమయ్యాయి.

గాంధీ హాస్పిటల్, ఉస్మానియాలో కొన్ని అడపాదడపా జరిగే సంక్లిష్టమైన ఆపరేషన్లు మినహాయించి, దాదాపు అన్ని హై-ఎండ్ సూపర్-స్పెషాలిటీ సర్జరీలు ఇప్పటివరకు కార్పొరేట్ ఆసుపత్రులే చిరునామా ఉన్నాయి. అయితే, గత రెండేళ్లలో, తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ ఆరోగ్య బీమా,  ఆయుష్మాన్ భారత్ పథకం కింద పేద రోగులకు అత్యంత ఖరీదైన శస్త్రచికిత్సలను నిర్వహించడంలో చురుకుగా నిర్వహిస్తూ ఉండటంతో.. స్పెషాలిటీ హెల్త్‌కేర్ సేవల పట్ల ప్రస్తుతం దృక్పథం మారుతోంది.

ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల మధ్య, మౌలిక సదుపాయాలు, రోగుల సౌకర్యాలు, శిక్షణ పొందిన ఆరోగ్య సంరక్షణ సిబ్బంది మధ్య అంతరం కొనసాగుతోంది. అయితే దాదాపు ఏడాదిన్నర వ్యవధిలో తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక వసతులు సమకూర్చారు.  అవి ఇప్పుడు పేద రోగులకు ప్రత్యామ్నాయం, సురక్షితమైనవిగా మారాయన్నది వాస్తవం.  ఇంతకుముందు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు జేబుకు చిల్లులు పడక తప్పేది కాదు.

బోధనాస్పత్రుల్లో సీనియర్ ఫ్యాకల్టీకి తోడ్పాటు అందించడం, మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అప్‌గ్రేడ్ చేయడం, హెల్త్ కేర్ వర్కర్లకు పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకాలను ప్రవేశపెట్టడం, బస్తీ దవాఖానాలు,  అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల (యుపిహెచ్‌సి) ద్వారా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడం ద్వారా ఇప్పుడు ప్రభుత్వ దవాఖానాలు ప్రైవేట్ ఆస్పత్రులతో పోటీపడేలా చేశాయి.

అత్యాధునిక శస్త్రచికిత్సలు:

ప్రస్తుతం, హైదరాబాద్‌లోనే కాకుండా జిల్లాల్లోని దాదాపు అన్ని బోధనాసుపత్రులు ఆర్థోపెడిక్స్, కార్డియాలజీ, నెఫ్రాలజీ, కాలేయం, అవయవ మార్పిడి, గ్యాస్ట్రోఎంటరాలజీకి సంబంధించిన శస్త్రచికిత్సలను నిర్వహించడంలో చురుకుగా పాల్గొంటున్నాయి. అన్ని టీచింగ్‌ ఆసుపత్రుల్లో క్యాథ్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన చొరవ వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో గుండె సంబంధిత ప్రక్రియలు సాధ్యమయ్యాయి.

ఆరోగ్యశ్రీ ఆరోగ్య బీమా, ఆయుష్మాన్ భారత్:

ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే అన్ని ప్రధాన శస్త్రచికిత్సలు ఇప్పుడు ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ బీమా పథకం కింద ఉన్నాయి.

వాస్తవానికి గత ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో తొలిసారి ఆరోగ్యశ్రీ రోగులు పెరిగారు. ఆరోగ్యశ్రీ ఆరోగ్య బీమా ప్రభుత్వ వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బందితో సహా ఇతర ఆరోగ్య కార్యకర్తలకు కూడా ప్రోత్సాహకాలను అందిస్తుంది.

బస్తీ దవాఖానాలు:

పట్టణ కేంద్రాల్లో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అందించే ఆధునిక బస్తీ దవాఖానాలు, గ్రామీణ ప్రాంతాల్లోని పల్లె దవాఖానాలు తృతీయ బోధనాసుపత్రులలో ఔట్ పేషెంట్  భారాన్ని తగ్గించాయి.  ఫలితంగా, బోధనాసుపత్రులలో అనుభవజ్ఞులైన సర్జన్లతో సహా సీనియర్ ఫ్యాకల్టీకి సర్జరీలతో సహా మరింత సంక్లిష్టమైన రోగులకు సేవలందించేందుకు వారికి తగినంత సమయం దొరికింది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles