32.1 C
Hyderabad
Wednesday, October 2, 2024

హైదరాబాద్‌లో టెక్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్న లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్!

హైదరాబాద్: తెలంగాణలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగానికి పెద్ద ఊతమిచ్చేలా లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ పిఎల్‌సి (ఎల్‌ఎస్‌ఇజి) హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా సుమారు 1,000 మందికి ఉపాధి లభించనుంది.

ప్రస్తుతం యునైటెడ్ కింగ్‌డమ్ పర్యటనలో ఉన్న ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు లండన్‌లో గ్రూప్ సిఐఓ ఆంథోనీ మెక్‌కార్తీతో సమావేశమైన తర్వాత ఈ ప్రకటన చేశారు.
ఈ ప్రకటన తరువాత, తెలంగాణ ప్రభుత్వం, LSEG మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఎంఓయూపై ప్రిన్సిపల్ సెక్రటరీ (ఐటీ అండ్ ఇండస్ట్రీస్) జయేష్ రంజన్, మెక్‌కార్తీ సంతకాలు చేశారు.

“హైదరాబాద్‌లో లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ (ఎల్‌ఎస్‌ఇజి) టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపన నగరంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బిఎఫ్‌ఎస్‌ఐ) రంగానికి గణనీయమైన ప్రోత్సాహం లభించనుంది.  తద్వారా పుష్కలంగా ఉపాధి అవకాశాలను లభిస్తాయని పరిశ్రమలో వృద్ధిని పెంచుతుందని” ఒక అధికారిక ప్రకటన తెలిపింది.

లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ ప్రముఖ గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటా ప్రొవైడర్, ఇది ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలలో పనిచేస్తోంది. 190 దేశాలలో కస్టమర్‌లకు సేవలు అందిస్తోంది. 100 దేశాలలో FTSE రస్సెల్ ఇండెక్స్‌లతో అనుసంధానించబడిన $161 బెంచ్‌మార్క్‌తో, LSEG ప్రపంచ ఆర్థిక రంగంలో ప్రధాన కంపెనీగా కొనసాగుతోంది.

ఈ కార్యక్రమంలో పెట్టుబడి ప్రమోషన్ & ఎన్నారై వ్యవహారాలు ప్రత్యేక కార్యదర్శి ఇ విష్ణు వర్ధన్ రెడ్డి,  తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ డైరెక్టర్ కొణతం దిలీప్, చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్‌నాథ్ రెడ్డి ఆత్మకూరి పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles