30.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగంలో 9000 ఉద్యోగాలు కల్పించనున్న అలయంట్‌గ్రూప్!

హైదరాబాద్: కన్సల్టింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్‌ దిగ్గజం అలయంట్‌గ్రూప్ 9,000 కొత్త ఉద్యోగాలను కల్పించబోతోంది. తద్వారా హైదరాబాద్‌లోని బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బిఎఫ్‌ఎస్‌ఐ) రంగాన్ని పెద్ద ఎత్తున పునరుద్ధరించబోతున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు శనివారం ప్రకటించారు.

తెలంగాణకే కాదు భారతదేశం BFSI సెక్టార్‌కు ఇది భారీ ప్రోత్సాహమని మంత్రి అన్నారు. తన యూఎస్ పర్యటన సందర్భంగా అలయంట్ గ్రూప్ సీఈఓ ధవల్ జాదవ్‌ను కలిసిన తర్వాత కేటీఆర్ ఇలా ట్వీట్ చేశారు: “ఈరోజు హ్యూస్టన్‌లోని అలయంట్ సీఈఓ ధవల్ జాదవ్‌ను కలిసాను. ఆయన చాలా డైనమిక్.  మా ఇద్దరి మద్య  చర్చ తర్వాత ఆయన గొప్ప వార్తను పంచుకున్నారు.”

కన్సల్టింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో పవర్‌హౌస్‌గా ఉన్న అలయంట్‌గ్రూప్, 9,000 కొత్త ఉద్యోగాలను సృష్టించడం ద్వారా హైదరాబాద్‌లోని బిఎఫ్‌ఎస్‌ఐ రంగాన్ని పెద్ద ఎత్తున బలోపేతం చేయబోతున్నట్లు ఆయన చెప్పారు.

“పన్ను, అకౌంటింగ్, ఆడిట్ సర్వీసెస్, కోర్ ఐటి టెక్నాలజీల రంగాలలో యువతకు ఇది గొప్ప అవకాశం. అలయంట్ నిర్ణయం  హైదరాబాద్ నగరంపై BFSI పరిశ్రమ ఉంచిన అచంచలమైన నమ్మకానికి, విశ్వాసానికి ఒక ఉదహరణ ” అని మంత్రి కేటీఆర్ అన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles