Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ఆరావళి పర్వతాలకు ముప్పు… కేంద్రంపై జైరామ్ రమేష్ మండిపాటు!

Share It:

న్యూఢిల్లీ: ఆరావళి పర్వతాల నిర్వచనాన్ని మార్చడం ద్వారా ఆ ప్రాంతంలో మైనింగ్, రియల్ ఎస్టేట్ వంటి వాణిజ్య ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడానికి మోదీ ప్రభుత్వం పట్టుబడుతోందని, తద్వరా ఆరావళి పర్వత శ్రేణులకు తీవ్ర ముప్పు వాటిల్లుతోందని జైరామ్ రమేష్ హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ కేంద్రం ప్రతిపాదనను తిరస్కరిస్తుందని తాను ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఆరావళి పర్వత శ్రేణిని పునర్నిర్వచించాలనే విషయంలో ప్రభుత్వం “మొండి పట్టుదలతో” ఉందని, ఈ విషయంలో సుప్రీంకోర్టు దృఢంగా నిలబడుతుందని తాను ఆశిస్తున్నట్లు కూడా రమేష్ అన్నారు. ఆరావళి పర్వత శ్రేణులలో మైనింగ్ వల్ల పర్యావరణంపై పడే ప్రభావంపై పీటీఐ మూడు భాగాల నివేదిక వెలువరించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

“మైనింగ్, రియల్ ఎస్టేట్, ఇతర ప్రాజెక్టులను అనుమతించేలా ఆరావళి పర్వత శ్రేణులను పునర్నిర్వచించాలనే మోడీ ప్రభుత్వ చర్యల వల్ల ఆరావళి పర్వత శ్రేణులు తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్నాయి. 2027 ఫిబ్రవరి 9న భారత ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ చేసేలోపు, ఈ చర్యలకు ఏమి జరుగుతుందో మనకు తెలిసిపోవచ్చు. అంతా మంచే జరగాలని కోరుకుంటున్నానని జైరామ్‌ రమేష్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.”

అంతేకాదు “సుప్రీంకోర్టు ఏర్పాటు చేసి, 2026 నవంబర్ 30 లోగా నివేదిక సమర్పించమని గడువు ఇచ్చిన ఉన్నత స్థాయి కమిటీ, ఆరావళి పర్వత శ్రేణులను పునర్నిర్వచించాలనే మోడీ ప్రభుత్వ చర్యలను తిరస్కరిస్తుందని ఆశిస్తున్నాను. లేకపోతే, ఇలాంటి పర్యావరణ విధ్వంసాలు మరిన్ని జరుగుతాయని జైరామ్‌ రమేష్‌ హెచ్చరించారు.”

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆరావళి కొండలలోని సహజ పగుళ్లు, చీలికలు, ప్రతి సంవత్సరం హెక్టారుకు రెండు మిలియన్ల లీటర్ల నీటిని భూమిలోకి చేర్చే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. దీనివల్ల ఈ పర్వత శ్రేణి, ఢిల్లీ నుండి గుజరాత్ వరకు విస్తరించి ఉన్న వాయువ్య భారతదేశంలోని అనేక ప్రాంతాలకు కీలకమైన నీటి పునర్జన్మ కేంద్రంగా మారింది.

అయితే, ఈ పర్వత శ్రేణి వెంబడి దశాబ్దాలుగా సున్నపురాయి, పాలరాయి వంటి అవక్షేప శిలలను తవ్వడం వల్ల, నదీ గర్భాలు, జలాశయాల సమీపంలో లేదా వాటిపై అనేక రాతి క్వారీలు, రాతి క్రషర్లు ఏర్పాటు చేసారనే ఆరోపణలు ఉన్నాయి. దీని ఫలితంగా, ఒకప్పుడు ఆరావళి పర్వతాలు అందించిన నీటి భద్రత ఇప్పుడు ప్రమాదంలో పడింది.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.