Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ఢిల్లీ వర్సిటీ ఫలితాలు… ఎన్నికలను నడిపించేది డబ్బేనని ఆరోపించిన సీజేపీ!

Share It:

ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలలో ఏబీవీపీ విజయాన్ని ఉదహరిస్తూ, ఎన్నికలలో డబ్బు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని కాక్రోచ్ జనతా పార్టీ కన్వీనర్ అభిజీత్ దీప్కే ఆరోపించారు.

సీజేపీ నేతృత్వంలో ఇటీవల జరిగిన జెన్ జెడ్ నిరసనల నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికలలో, ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ ఏబీవీపీ నాలుగు ప్యానెల్ పదవులలో మూడింటిని గెలుచుకుంది. కాగా కాంగ్రెస్ మద్దతు ఉన్నఎన్‌ఎస్‌యూఐ నాలుగు సీట్లలలోనూ ఓడిపోయింది.

ఈమేరకు ఢిల్లీ యూనివర్సిటీ ఫలితాలపై అడిగిన ప్రశ్నలకు దీప్కే స్పందిస్తూ, ఢిల్లీ యూనివర్సిటీలో అభ్యర్థులు, ప్రచారకర్తలు కోట్ల రూపాయల విలువైన ఖరీదైన కార్లలో వచ్చారని పేర్కొన్నారు.

“ఎన్నికలలో డబ్బు పనిచేస్తుంది, మరేదీ పనిచేయదు. డీయూలో ప్రచారం చేసేవారు కోట్ల రూపాయల విలువైన రోల్స్ రాయిస్‌లో వస్తారు. వారు ఆడి, బీఎండబ్ల్యూ వంటి కార్లలో వస్తారు. కాబట్టి, అక్కడ డబ్బు పనిచేస్తుందని” ఆయన అన్నారు.

బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్దిష్ట భావజాల అనుబంధాలు ఉన్న వ్యక్తులను ప్రోత్సహిస్తోందన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆందోళనలకు దీప్కే మద్దతు తెలిపారు.

వార్ధాలోని మహాత్మా గాంధీ అంతర్రాష్ట్రీయ హిందీ విశ్వవిద్యాలయాన్ని ప్రస్తావిస్తూ, దాని వైస్-ఛాన్సలర్ కుముద్ శర్మ ఏబీవీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని వ్యతిరేకించిన విద్యార్థులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటున్నారని దీప్కే ఆరోపించారు.

శర్మ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి 50 మందికి పైగా విద్యార్థులపై పోలీసు కేసులు నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు. అలాగే దళిత, ఆదివాసీ వర్గాలకు చెందిన విద్యార్థులు నిరసనలు చేసినందుకు చర్యలు ఎదుర్కొన్నారు, అయితే ఏబీవీపీ సభ్యులను మాత్రం వదిలిపెట్టారని ఆరోపణలు ఉన్నాయి.

“విద్యా సంస్థలను ఆర్‌ఎస్‌ఎస్ శాఖగా మార్చేందుకు ఇది ఒక రోడ్‌ మ్యాప్‌” అని దీప్కే ఆరోపించారు. ఆయన వాదనలపై అటు వీసీ కానీ, యూనిర్సిటీ, ఏబీవీపీ స్పందించలేదు.

మహారాష్ట్రలో పోటీ పరీక్షలకు సంబంధించిన ఆందోళనల ప్రస్తావన తెస్తూ, నియామక వ్యవస్థపై విద్యార్థులు విశ్వాసం కోల్పోతున్నారని దీప్కే పేర్కొన్నారు.
అవినీతి ఆరోపణలపై మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ వివేక్ భీమన్వార్ రాజీనామా చేయాలని కోరుతూ ఆ కమిషన్ అభ్యర్థులు నిరసనలు చేస్తున్నారని ఆయన అన్నారు.

సీజేపీ, ఎంపీఎస్‌సీ ఆశావహులు త్వరలో “భీమన్వర్, రాజీనామా చేయండి” అనే పేరుతో ఒక ఆన్‌లైన్ ప్రచారాన్ని ప్రారంభిస్తారని దీప్కే ప్రకటించారు. ఇందులో పాల్గొనే విద్యార్థులు ఛైర్మన్‌పై తమ ఆరోపణలను తెలియజేస్తారని, ఆయన ఎందుకు పదవి నుంచి వైదొలగాలని తాము భావిస్తున్నారో వివరిస్తారని ఆయన అన్నారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.