30.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

50లక్షల ఇల్లు ‘ఫ్రీ‘- కేటీఆర్! ఖైరతాబాద్ లో 210 డబుల్ బెడ్రూం ఇళ్లు ప్రారంభం!

హైదరాబాద్​: నగరంలోని ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని…. ఇందిరానగర్‌లో రెండు పడక గదుల ఇళ్లను మంత్రి కేటీఆర్.. ప్రారంభించారు. పశసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్‌ విజయలక్ష్మి పాల్గొన్నారు.
రూ.17.85 కోట్ల వ్యయంతో నిర్మించిన 210 ఇళ్లను మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించారు. రెండు పడక గదుల ఇళ్లను పరిశీలించారు. లబ్ధిదారుల గృహప్రవేశంలో పాల్గొని… వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం నడిబొడ్డున పేదలకు ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇస్తున్నామన్నారు. మార్కెట్‌లో 50 లక్షల రూపాయల విలువ చేసే ఇళ్లు ఫ్రీగా ఇస్తున్నామన్నారు. 9714 కోట్ల రూపాయలతో హైద్రాబాద్ పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కడుతున్నామన్నారు. వారం రోజుల్లో కొల్లూర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారన్నారు. ఒకే చోట 15640 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించామన్నారు. 18 వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కడుతున్నామన్నారు.
ఖైరతాబాద్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను డిగ్నిటీ కాలనీలో… ఐదంతస్తుల్లో 5 బ్లాక్‌ల్లో నిర్మించారు. సీసీ రోడ్డు, తాగునీరు, 7 లిఫ్టులు, 7 షాపులు, డ్రైనేజీ కాలువ వంటి…. అన్ని మౌలిక వసతులను డిగ్నిటీ కాలనీలో కల్పించారు. ఖాళీ స్థలంలో ఆహ్లాదకరమైన వాతావరణం కోసం.. పచ్చని మొక్కలునాటి సుందరీకరణ పనులు చేపట్టారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles