23.7 C
Hyderabad
Thursday, October 3, 2024

గాజాలో ప్రవేశించిన ఇజ్రాయెల్ సైన్యం…భీకరంగా దాడులు!

జెరూసలేం: గాజుపై ఇజ్రాయెల్ సైన్యం భీకర స్థాయిలో దాడులు కొనసాగిస్తోంది. ఉత్తర గాజాలో దాదాపు ఐదు వారాలుగా సాగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్), హమాస్ మధ్య పోరు తీవ్రరూపం దాల్చింది. భూతల దాడులతోపాటు వైమానిక దళం బాంబులు ప్రయోగిస్తోంది. గాజా రక్తసిక్తంగా మారుతోంది. గాజా నగరాన్ని ఇజ్రాయెల్ సైన్యం నాలుగు వైపులా చుట్టుముట్టింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ సైన్య ప్రతినిధి డేనియల్ హగారి అధికారికంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా ఇజ్రాయెల్ మిలటరీ అధికారి మోషే టెట్రో అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ “ఇది చిన్న తరహా ఆపరేషన్ కాదు. మేము ఉత్తర గాజాను పూర్తిగా చుట్టుముట్టామని తెలిపారు. “మేము గాజా జనాభాను దక్షిణం వైపుకు వెళ్ళమని కోరాం, అక్కడ మేము మానవతా సాయాన్ని అనుమతిస్తాము” అని అన్నారు.

యుద్ధం ముగిసిన తర్వాత నిరాశ్రయులైన గాజా ప్రజలు తమ స్వస్థలాలకు తిరిగి రావచ్చని ఆయన అన్నారు.

మధ్యప్రాచ్యం నుండి వచ్చిన మీడియా నివేదికల ప్రకారం, హమాస్ నిర్వహిస్తున్న ఆరోగ్య మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ, ఇప్పటివరకు 9,000 మంది పాలస్తీనియన్లు యుద్ధంలో మరణించారు. గాజాలో మరణిస్తున్న వారిలో 40 శాతం మంది చిన్నారులేనని హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ సోషల్ మీడియాలో వీక్షించిన ఒక ప్రకటనలో తెలిపారు.

మృతుల గణాంకాలు ఖచ్చితమైనవి కాదు..మోషే టెట్రో 

గాజాలోని జబాలియా పరిసరాల్లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసి వందల మందిని చంపలేదని, ఇది పూర్తిగా అబద్ధం అని  ఇజ్రాయెల్ మిలటరీ అధికారి మోషే అన్నారు.

తీవ్ర సంక్షోభం నెలకొనే పరిస్థితుల దృష్ట్యా గాబాలో కాల్పుల విరమణ పాటించాలని, దాడులు ఆపాలని ఒక్యరాజ్య సమితి పిలుపు ఇచ్చింది. అయితే ఈ పిలుపును ఇజ్రాయెల్ కఠిన వైఖరితోనే తిరస్కరించింది.

అక్టోబర్ 7వ తేదీన రాకెట్ లాంచర్లతో హమాస్ బలగాలు, ఇజ్రాయెల్ సరిహద్దుల్లో మెరుపు దాడికి దిగాయి. కొన్ని ప్రాంతాలను తమ అదుపులోకి తీసుకున్నాయి. హచూస్ దాడుల్లో 1,400 మంది మరణించినట్లు మూయెల్ ప్రకటించింది. అత్యాధునిక యుద్ధ వ్యవస్థ ఉన్న ఇజ్రాయెల్.. ఈ దాడిని ఘోర అవమానంగా భావించింది. ఆపై ప్రతిదాడులకు దిగింది. హమాస్ స్వాధీనంలో ఉన్న గాజాపై ఇప్పటి కాల్ జరిపిన దాడుల్లో 9వేల మందికి పైగా మృతి చెందారు. అందులో సగం చిన్నారులే ఉండడం గమనార్హం. మృతుల సంఖ్య పెరిగిపోసించడంతో అంతర్జాతీయ సమాజం నుంచి ఇజ్రాయెల్ పై ఒత్తిడి పెరుగుతోంది.

అదే మీడియా సమావేశంలో ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లియోర్ హైయాట్ మాట్లాడుతూ “అంతర్జాతీయ మానవతా చట్టానికి వ్యతిరేకంగా బందీలను ఉంచారు.

అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన దాడిని ఖండించని దేశాల గురించి వ్యాఖ్యానిస్తూ… “మీరు ఇజ్రాయెల్‌తో ఉన్నారా? లేదా మీరు హమాస్‌తో ఉన్నారా?” అని ఆయన ప్రశ్నించారు.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles