28.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ స్కీమ్.. తెలంగాణకు అవార్డు

హైదరాబాద్: మన రాష్ట్రానికి మరో ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా-2023లో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫార్మలైజేషన్‌ ఆఫ్‌ మైక్రోఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ స్కీం (PMFME) పథకం అమలులో అవుట్‌ స్టాండింగ్‌ ఫెర్ఫార్మర్‌ అవార్డు కింద తెలంగాణను కేంద్రం ఎంపిక చేసింది.  ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము  అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డును రాష్ట్రం తరపున TSFPS డైరెక్టర్ శ్రీ అఖిల్ గవార్, TSFPS డైరెక్టర్ (BD) సుష్మా  అందుకున్నారు.

వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా-2023లో తెలంగాణ భాగస్వామ్య రాష్ట్రంగా ఉండగా, నెదర్ల్యాండ్‌ భాగస్వామ్య దేశంగా, జపాన్‌ ఫోకస్‌ కంట్రీగా ఉన్నది.

ఈ కార్యక్రమం నవంబర్ 3-5, 2023 తేదీలలో జరిగింది. భారతదేశం, విదేశాల నుండి విధాన రూపకర్తలు, వ్యవస్థాపకులు, పరిశోధకులు, వ్యాపార ప్రతినిధులు  పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles