30.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

గాజాపై ఇజ్రాయెల్ దాడులు మొదలై నెల రోజులు…యుద్ధంలో 10,569 మంది మరణించారు!

జెరుసలెం: వేలాది మంది ప్రాణాలను బలిగొన్న ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా కాల్పుల విరమణ కుదరడం లేదు. ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులను కొనసాగిస్తోంది.. బుధవారం గాజా అంతటా క్షిపణులు, రాకెట్లు ప్రయోగించింది. గాజా గత 24 గంటల వ్యవధిలో 214 మంది. మరణించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నెల రోజులకుపైగా సాగుతున్న యుద్ధంలో హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ సైన్యం పైచేయి సాధిస్తోంది.

ఈ యుద్ధం గాజాలో మానవతా విపత్తుకు దారితీసింది, పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం, 4,324 మంది పిల్లలు, 2,823 మంది మహిళలు, 649 మంది వృద్ధులు సహా 10,569 మందికి పైగా మరణించారు. మరో 26,475 మంది గాయపడ్డారు. గాజాలో పెరిగిపోతున్న మరణాలపై ఐక్యరాజ్యసమితి సెక్రెటర్ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. గాజాస్ట్రిప్ మొత్తం చిన్నపిల్లల శ్మశాన వాటికగా మారుతోందని చెప్పారు. మృతుల సంఖ్య పెరుగుతోంది.

గాజాలో ప్రస్తుతం 1.4 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని యూఎన్ ఆఫీస్ ఫర్ ది కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్ (OCHA) నివేదించింది.

గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల ఫలితంగా 56 మసీదులు ధ్వంసమయ్యాయి, వీటిలో 192  పూర్తిగా ధ్వంసమయ్యాయని అనాడోలీ ఏజెన్సీ నివేదించింది.

గాజా అసుపత్రుల్లో గుండెను పిండేసే దృశ్యాలు కనిపిస్తున్నాయి. విద్యుత్ లేక ఆసుపత్రుల్లో ఆపరేషన్లు నిలిచిపోయాయి. ఔషధాలు, వైద్య పరికరాలు- లేక క్షతగాత్రులకు చికిత్స అందించడం లేదు. ఇంక్యుబేటర్లలో శిశువులు విగత జీవులుగా మారుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు.

చాలా హాస్పిటళ్లలో పెట్రోల్, డీజిల్ లేక జనరేటర్లు పనిచేయడంలేదు. ఇజ్రాయెల్ సైన్యం తొలిసారిగా బుధవారం గాజాపై దాడులను 4 గంటలపాటు నిలిపివేసింది. గాజాకు మానవతా సాయం చేరవేయడానికి వీలుగా దాడులు ఆపినట్లు వెల్లడించింది.  యుద్ధం ముగిశాక గాజా రక్షణ బాధ్యతను తాము స్వీకరిస్తామంటూ ఇజ్రాయెల్ ప్రధాని చేసిన ప్రకటనపై అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ స్పందించారు. గాణాను ఆక్రమించుకొనే ఆలోచన చేయొద్దని ఇజ్రాయెల్ దేశానికి హితవు పలికారు.

గాజాలో నెలకొన్న భయానక పరిస్థితులను అమెరికా నర్సు ఎమిలీ చలాహన్ మీడియాతో పంచుకున్నారు. గాణాలో క్షతగాత్రులకు సేవలందించిన ఎమిలీ ఇటీవలే అమెరికా చేరుకున్నారు. 26 రోజుల తర్వాత ఈరోజే స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నానని తెలిపారు. గాజాలో 26 రోజుల్లో ఐదు ప్రాంతాలకు మారాల్సి వచ్చిందన్నారు. ఒకచోట 35 వేల మంది నిరాశ్రయులు ఉన్నారని తెలిపారు, ముఖాలు, మెడ, కాళ్లు, చేతులపై తీవ్ర గాయాలున్న చిన్నారులు కనిపించారని వెల్లడించారు. 50 వేల మంది తలదాచుకుంటున్న ఓ శిబిరంలో కేవలం 4 మరుగుదొడ్లు ఉన్నాయని పేర్కొన్నారు. అక్కడ రోజుకు కొద్దిసేపు మాత్రమే నీటి సరఫరా జరిగేదని వివరించారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles