26.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

లోక్‌సభ ఎన్నికలు…ప్రారంభమైన చివరిదశ పోలింగ్!

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల 7వ దశ ఓటింగ్ ప్రారంభమైంది, ప్రధాన అభ్యర్థులలో ప్రధాని మోదీ ఉన్నారు. 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 57 స్థానాల్లో  చివరి దశ ఎన్నికల్లో పోలింగ్ జరుగుతోంది. ప్రధాన అభ్యర్థుల్లో ప్రధాని మోదీ, కంగనా రనౌత్, అభిషేక్ బెనర్జీ ఉన్నారు.
మొత్తం 10.06 కోట్ల మంది ఓటర్లు నేడు ఓటు వేయనున్నారు.

చండీగఢ్‌తో పాటు పంజాబ్‌లోని మొత్తం 13 స్థానాలు, హిమాచల్ ప్రదేశ్‌లోని నాలుగు స్థానాలు, ఉత్తరప్రదేశ్‌లోని 13 స్థానాలు, పశ్చిమ బెంగాల్‌లో 9, బీహార్‌లో 8, ఒడిశాలో 6, జార్ఖండ్‌లో మూడు స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ దశలో ఒడిశాలోని మిగిలిన 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు, హిమాచల్ ప్రదేశ్‌లోని ఆరు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరుగుతాయి.

ఉత్తరప్రదేశ్‌లో, వారణాసితో సహా 13 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది, ఇక్కడ ప్రధాని మోదీ అజయ్ రాయ్ (కాంగ్రెస్), అథర్ జమాల్ లారీ (బిఎస్‌పి), పలువురు స్వతంత్ర అభ్యర్థులను ఎదుర్కొంటారు. ఉత్తరప్రదేశ్‌లో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ, సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ల కూటమి మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది.

పంజాబ్‌లో ప్రణీత్ కౌర్, చరణ్‌జిత్ సింగ్ చన్నీ, హర్‌సిమ్రత్ కౌర్ బాదల్, రవ్‌నీత్ సింగ్ బిట్టు ముఖ్యమైన అభ్యర్థులుగా ఉన్నారు. 1996 తర్వాత తొలిసారిగా బీజేపీ, శిరోమణి అకాలీదళ్ స్వతంత్రంగా పోటీ చేయగా, కాంగ్రెస్, ఆప్ తమ సొంత అభ్యర్థులను నిలబెట్టాయి.

హిమాచల్ ప్రదేశ్‌లో కంగనా రనౌత్, అనురాగ్ ఠాకూర్, విక్రమాదిత్య సింగ్ వంటి ప్రముఖ అభ్యర్థులు ఉన్నారు. బీహార్‌లో, యూనియన్ నినిస్టర్ ఆర్‌కె సింగ్, సీనియర్ బిజెపి ఎంపి రవిశంకర్ ప్రసాద్, మిసా భారతి కీలక పోటీలో ఉన్నారు.

చివరి దశలో మొత్తం 904 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వారిలో అత్యధికంగా పంజాబ్‌లో 328 మంది, ఉత్తరప్రదేశ్‌లో 144 మంది, బీహార్‌ 134, ఒడిశా 44, జార్ఖండ్‌ 52, హిమాచల్‌ప్రదేశ్‌ 37, చండీగఢ్‌లో 19 చొప్పున బరిలో ఉన్నారు. కాగా, శనివారం సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడనున్నాయి. ఎన్నికల ఫలితాల వెల్లడికి మరో మూడు రోజులు గడువు ఉన్న నేపథ్యంలో ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles