30.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

మెదక్‌లో మదర్సా రోగులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రిపై హిందూత్వ మూకల దాడి!

మెదక్: హిందుత్వ మూకల దాడిలో గాయపడిన మదర్సా మిన్హాజ్ ఉల్ ఉలూమ్‌కు చెందిన రోగులకు చికిత్స అందిస్తున్న మెదక్‌లోని ఒక ఆసుపత్రిని 150-200 మంది BJP, BJYM కార్యకర్తలు జూన్ 15, 2024 శనివారం నాడు లక్ష్యంగా చేసుకున్నారు.

వీడియోలింక్

https://x.com/NaseerGiyas/status/1802293726553014581

“రోగికి చికిత్స చేయడం పాపమా?” అని సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో మెదక్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ డాక్టర్ నవీన్ ప్రశ్నించారు.  మత విద్వేషకులు జరిపిన ఈ దాడిలో భయపడ్డ డాక్టర్, వీడియోలో బాగా భయపడిపోయి, ఉబికివస్తున్న కన్నీళ్లతో, హిందుత్వ గూండాలు తన ఆసుపత్రిపై దాడి చేసిన బాధాకరమైన అనుభవం గురించి చెప్పాడు. “తదుపరి ఏ పేషెంట్ నా ఆసుపత్రికి వచ్చినా, అతనికి చికిత్స చేసే ముందు నేను మొదట ఇతర వైద్యులను సంప్రదిస్తాను,” అతను తన నిరాశ, నిస్సహాయతను ఎత్తిచూపుతూ వ్యంగ్యంగా అన్నాడు.

వీడియో లింక్

https://x.com/NaseerGiyas/status/1802292881069310140

హిందూత్వ గుంపు ఆసుపత్రిని ధ్వంసం చేయడమే కాకుండా బయట పార్క్ చేసిన ఆసుపత్రి సిబ్బంది కార్లను ధ్వంసం చేసింది. నివేదికల ప్రకారం, మదర్సా మిన్హాజ్ ఉల్ ఉలూమ్ యాజమాన్యం బక్రీద్ కోసం బలి ఇవ్వడానికి పశువులను కొనుగోలు చేసింది. ఈ మతపరమైన ఆచారాల చర్య… మితవాద హిందుత్వ సంస్థల సభ్యులలో అశాంతిని రేకెత్తించింది, వారు మదర్సా దగ్గర గందరగోళాన్ని సృష్టించారు. పోలీసులు జోక్యం చేసుకుని గుంపును చెదరగొట్టారు, అయితే దాడి చేసినవారు ముస్లింలకు చెందిన సమీపంలోని దుకాణాలను లక్ష్యంగా చేసుకున్నారు.

ఒక గంట తర్వాత, రైట్-వింగ్ గ్రూపుల సభ్యులు మదర్సాకు తిరిగి వచ్చారు,  హింసాత్మక దాడిని మళ్లీ కొనసాగించారు. దీంతో మదర్సాలో ఉన్న పలువురు వ్యక్తులు గాయపడ్డారు. వారిని తక్షణమే చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

“ఈ సందర్భంగా ఆసుపత్రి డాక్టర్లు మాట్లాడుతూ… మేము గాయపడిన రోగులకు చికిత్స చేస్తున్నప్పుడు సుమారు 100 నుండి 150 మంది వ్యక్తుల గుంపు ఆసుపత్రిపై దాడి చేసి, రాళ్ళు రువ్వడం, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో ఆస్పత్రిలోని ఫర్నీచర్ పాడైంది,  సిబ్బందిలో ఒకరి కాలు విరిగింది” అని డాక్టర్ నవీన్ మీడియా ప్రతినిధులతో వివరించారు. “మేం చేసిన తప్పు ఏమిటో చెప్పండి. రోగికి చికిత్స చేయడం పాపమా?” ఈ ఘటనపై తన విచారాన్ని వ్యక్తం చేస్తూ ఆయన ప్రశ్నించాడు.

హింసాకాండ నేథ్యంలో మెదక్‌లో ఉద్రిక్తత నెలకొంది. శాంతిభద్రతలను కొనసాగించడానికి, మరింత తీవ్రతరం కాకుంపడా నిరోధించడానికి  అదనపు పోలీసు బలగాలను మోహరించింది. ముస్లింల జీవితాలకు అంతరాయం కలిగించిన హింస,వైద్యం, ప్రాణాలను రక్షించడానికి ఉద్దేశించిన దైవగృహంలో జరిగిన దాడితో ముస్లిం సంఘం షాక్‌లో ఉంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles