28.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

వ్యక్తిగత డేటాపై పోలీసుల నిఘా…సమీక్షించాలని అభ్యర్థించిన ఎన్ఏపీఎం!

హైదరాబాద్: వ్యక్తిగత డేటాపై పర్యవేక్షణ పేరిట నిఘా పరికరాల అక్రమ వినియోగాన్ని అరికట్టడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని  నేషనల్ అలయన్స్ ఫర్ పీపుల్స్ మూవ్‌మెంట్ (NAPM) తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పోలీసు సిబ్బంది.. సామాజిక కార్యకర్తలతో సహా వ్యక్తులపై చట్టవిరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు వెల్లడైన నేపథ్యంలో ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక ఈ మేరకు ప్రభుత్వాన్ని కోరింది.

తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్లలో రాజ్యాంగం ప్రకారం మానవ హక్కులు, గోప్యత, పౌరుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించి ఫోన్ ట్యాపింగ్ చేశారని, దీనిపై సీఎం ఎ రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని ఎన్ఏపీఎం సీఎంకు లేఖ రాసింది. నిఘా పరికరాల విచ్చలవిడి వినియోగం సహా
పోలీసు పద్ధతులపై “క్లిష్టమైన సమీక్ష” అవసరమని NAPM కార్యకర్తలు తెలంగాణ ముఖ్యమంత్రి A రేవంత్ రెడ్డికి రాసిన సుదీర్ఘ లేఖలో పేర్కొన్నారు. .

‘డిజిటల్, సాంకేతిక పురోగమనాల’ ముసుగులో, గత దశాబ్దంలో తెలంగాణలో కొన్ని పోలీసింగ్ పద్ధతులు కలవరపెట్టాయి. పౌరులుగా, మనందరికీ ప్రాథమిక హక్కులు ఉన్నాయి. గత పదేళ్లలో ప్రజల హక్కులను కాలరాచేలా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని వారు ఆరోపించారు. ఆర్టికల్ 19, 21 ప్రకారం రాజ్యాంగం ఇచ్చిన గోప్యత, భావప్రకటనా స్వేచ్ఛ హక్కు హరించారని మేథావుల ఫోరం సీఎంకు రాసిన లేఖలో ఫేర్కొంది.

విద్యార్థి సంఘాలు, కుల సంఘాల నాయకులు, జర్నలిస్టులు, హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, బీఆర్ఎస్ వ్యతిరేకులు, పార్టీ నాయకుల వ్యక్తిగత జీవితాలు, వారి కార్యకలాపాలపై ఫోన్ ట్యాపింగ్ ద్వారా నిఘా పెట్టారని ఫోరం సభ్యులు తెలిపారు. తెలంగాణ పోలీసు వ్యవస్థను ఆధునీకరించి నిఘా పరికరాలతో ప్రజల స్వేచ్ఛను హరించారని వారు సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

నేషనల్ అలయన్స్ ఫర్ పీపుల్స్ మూవ్‌మెంట్ (NAPM) డిమాండ్లు!

  • తెలంగాణలో మానవ హక్కుల ఉల్లంఘనలు, ఫోన్ ట్యాపింగ్ పై రిటైర్లు న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరపాలి.
  • -తెలంగాణ రాష్ట్రంలో పోలీసింగ్ పద్దతులు, ఇంటెలిజెన్స్ కార్యకలాపాలపై అన్ని వివరాలతో పోలీసు మాన్యవలె ప్రచురించాలని కోరారు.
  • ఫోన్ ట్యాపింగ్ కేసులు, అక్రమ నిఘా సమస్యలు, పోలీసింగ్ పద్ధతులు, మానవ హక్కుల ఉల్లంఘనలపై సుప్రీంకోర్టు రిటైర్లు న్యాయమూర్తి లేదా హైకోర్టు న్యాయమూర్తి నేత్వత్వంలో ఉన్నత స్థాయి విచారణ కమిషన్ నియమించాలని కోరారు.
  • -గూఢచార కార్యకలాపాలను శాసన పర్యవేక్షణలోకి తీసుకువచ్చి, దీనిలో దుర్వినియోగాన్ని అరికట్టాలి.
  • మెదక్ పట్టణంలో పోలీసు కస్టడీలో మరణించిన మహమ్మద్ ఖదీర్ ఖాన్ ఘటనలో హింనకు పాల్పడిన పోలీసులపై విచారణ జరపాలని కోరారు. మృతుడు ఖదీర్ ఖాన్ భార్య సిద్ధేశ్వరి అలియాస్ ఫర్జానా, వారిపై ఆధారపడిన వారికి ఆర్థిక సహాయాన్ని అందించాలని మేధావులు కోరారు.
  • తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పోలీసు ఫిర్యాదుల ఆథారిటీని పనిచేసేలా చేయాలి.
  • రాష్ట్రంలోని అన్ని పోలీసుస్టేషన్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, సమాచార హక్కు చట్టం కిది దరఖాస్తు చేసిన వారికి సీసీటీవీ పుటజీ ఇవ్వాలని కోరారు. సుప్రీం ఆదేశాల మేర కస్టడీ హింసను నిరోధించాలని వారు డిమాండ్ చేశారు.
  • హైదరాబాద్ మిషన్ చబుత్ర కార్యక్రమాన్ని ముగించాలని కోరారు. వారెంట్లను డిజిటలైజ్ చేసి వాటిని బహిరంగంగా అప్ లోడ్ చేయాలని సూచించారు.
  • రాష్ట్రంలో కార్డన్  సెర్చ్, ఇతర పోలీసింగ్ కార్యకలాపాల సమయంలో,  వారెంట్లు అందుబాటులో ఉండాలని కోరుతున్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles