23.7 C
Hyderabad
Thursday, October 3, 2024

భారత్ ‘హిందూ దేశం’ కాదని లోక్‌సభ ఫలితాలు నిరూపించాయి…నోబెల్ గ్రహీత ఆమర్త్యసేన్!

కోల్‌కత: భారత్ ఎంతమాత్రం హిందూ దేశం కాదన్న వాస్తవాన్ని ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నిరూపించాయని నోబెల్ అవార్డు గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త సేన్ వెల్లడించారు.

అమర్త్యసేన్‌ బుధవారం సాయంత్రం అమెరికా నుండి కొల్‌కతా వచ్చారు. ఈ సందర్భంగా నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఆయన ఓ బెంగాలీ న్యూస్‌ ఛానల్‌ ప్రతినిధితో మాట్లాడారు. విచారణ జరపకుండా ప్రజలను కటకటాల వెనుక ఉంచడం బ్రిటీష్‌ కాలం నుండీ కొనసాగుతోందని, కాంగ్రెస్‌ పాలనలో కంటే బిజెపి ప్రభుత్వ హయాంలోనే ఈ ధోరణి అధికంగా ఉన్నదని ఆయన చెప్పారు.

ఎన్నికలు జరిగిన ప్రతిసారీ మార్పు కన్పించాలని మనం కోరుకుంటాం. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ హయాంలో విచారణ లేకుండా ప్రజలను కటకటాల వెనక్కి నెట్టడం, ధనిక – పేదల మధ్య అంతరాన్ని పెంచడం వంటి కొన్ని సంఘటనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అది ఆగిపోవాలి,” అని ఆయన అన్నారు.

భారత్‌ లౌకిక దేశమని, దీనికి లౌకిక రాజ్యాంగం ఉన్నదని, కాబట్టి దేనినైనా అంగీకరించే రాజకీయ లక్షణం ఉండాలని ఆయన అన్నారు. భారత్‌ను హిందూ రాష్ట్రగా మార్చాలన్న ఆలోచన సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

కేంద్రంలో కొత్తగా ఏర్పడిన క్యాబినెట్‌ పాత మంత్రిమండలికి నకలేనని అమర్త్యసేన్‌ వ్యాఖ్యానించారు. ‘మంత్రులు అవే శాఖల్లో కొనసాగుతున్నారు. కొద్దిపాటి మార్పులు మినహా రాజకీయంగా శక్తివంతులైన వారు ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నారు’ అని చెప్పారు.

తన చిన్ననాటి జ్ఞాపకాలను అమర్త్యసేన్‌ గుర్తు చేసుకుంటూ అప్పుడు బ్రిటీష్‌ పాలనలో ఎలాంటి విచారణలు జరపకుండానే ప్రజలను కారాగారాల్లో బంధించే వారని తెలిపారు. ‘నేను యువకుడిగా ఉన్నప్పుడు నా బంధువులు అనేక మంది ఎలాంటి విచారణను ఎదుర్కోకుండానే జైలుకు వెళ్లారని అన్నారు.

అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించినప్పటికీ, ఫైజాబాద్ లోక్‌సభ స్థానాన్ని బీజేపీ ఓడిపోవడంపై సేన్ మాట్లాడుతూ… దేశం నిజమైన గుర్తింపును కప్పిపుచ్చే ప్రయత్నాలు జరిగాయని అన్నారు.

‘భారత్‌ను హిందూ రాష్ట్రగా మార్చేందుకు బాగా డబ్బు ఖర్చు చేసి రామమందిరాన్ని నిర్మించడం… మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్‌ ఠాకూర్‌, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌లు జన్మించిన ఈ దేశంలో జరిగి ఉండకూడదు. నిజమైన భారతీయ గుర్తింపును నిర్లక్ష్యం చేసేందుకు జరిగిన ప్రయత్నంగా దీనిని భావించాలి. దీనిని మార్చాల్సి ఉంది’ అని అన్నారు.

భారతదేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని, ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వంటి రంగాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆమర్త్యసేన్ అన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles