28.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు నిండిన హుస్సేన్‌సాగర్‌!

హైదరాబాద్: నగరంలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షాల కారణంగా హుస్సేన్‌సాగర్‌ నిండిపోయింది. నీటి మట్టం దాదాపు ఫుల్‌ ట్యాంక్‌ లెవల్ (ఎఫ్‌టిఎల్)కి చేరుకుంది. దీంతో డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్ టీం అప్రమత్తమైంది. నీటి నిల్వలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ముందుజాగ్రత్త చర్యలో భాగంగా హుస్సేన్‌సాగర్‌ చుట్టుపక్కల లోతట్టు ప్రాంతాల్లో నివాసముంటున్న స్థానికులను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. హుస్సేన్ సాగర్ ఎఫ్‌టిఎల్ 513.41 మీటర్లు కాగా, గరిష్ట నీటిమట్టం (ఎండబ్ల్యుఎల్) 514.75 మీటర్లు. ఆదివారం రాత్రి 7:45 గంటల సమయానికి నీటి మట్టాలు 513.210 మీటర్లకు చేరాయి.

జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పరిస్థితిని పరిశీలించి, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్,పారిశుధ్య విభాగం సిబ్బంది నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి నిల్వలను తగ్గించేందుకు కృషి చేస్తున్నారని అధికారులు తెలిపారు.

మరోవైపు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలతా శోభన్‌రెడ్డి అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి నగరంలో నీటి ఎద్దడిపై సమీక్షించారు.

“నగరం అంతటా వాటర్ లాగింగ్ పాయింట్లు గుర్తించిన ప్రదేశాలలో అత్యవసర బృందాలను మోహరించారు. దీంతో నీటిని క్లియర్ చేయడంతో పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలగలేదు’’ అని జీహెచ్‌ఎంసీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.

140 స్టాగ్నేషన్ పాయింట్ల నుంచి ఎప్పటికప్పుడు నీటిని తొలగించేందుకు మొత్తం 228 స్టాటిక్ టీమ్‌లు, 154 మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లు, 168 డీవాటరింగ్ పంపుసెట్‌లను ఏర్పాటు చేశారు.

అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ హెచ్చరికలు పాటించాలని కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles