28.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

కుల గణనను సమర్థించిన మహాత్మా గాంధీ!

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కుల గణన కోసం పదేపదే డిమాండ్ చేస్తున్న సందర్భంలో, నరేంద్ర మోడీ ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో మహాత్మా గాంధీ దార్శనికతను కులగణన విషయంలో గాంధీజీ ఆలోచనలను గుర్తుచేసుకోవడం అత్యంత ముదావహం.

నవంబర్ 5, 1917లో జరిగిన గుజరాత్ రాజకీయ సమావేశంలో బాపూజీ ప్రసంగిస్తూ, స్వరాజ్య సాధనను వెనుకబడిన తరగతుల మద్దతుతో ప్రముఖంగా ముడిపెట్టారు. “ఈ రోజు మనం వెనుకబడిన తరగతుల వారితో చేతులు కలిపాము, ఇప్పుడు మనకు స్వరాజ్యం తప్పకుండా లభిస్తుందని అన్నారు. స్వాతంత్య్ర పోరాట  ప్రతి సందర్భంలోనూ ఆయన ముస్లింలు, క్రైస్తవులు, ఇతర వెనకబడ్డ తరగతులవారిని కలుపుకుపోవాలని చెప్పేవారు. తద్వారా గాంధీజీ కుల గణనను గురించి ప్రస్తావించేవారు.

1921 అక్టోబరు 30న, దాదాపు 10 సంవత్సరాల క్రితం బ్రిటిష్ పాలకులు భారతదేశంలో మొదటి కుల గణన జరిగింది. అప్పట్లో గాంధీజీ ఎన్నడూ కుల గణనను వ్యతిరేకించలేదు.  1932లో జనాభా గణనను  ప్రాముఖ్యత గురించి ఆయన చెప్పినదానిని పరిశీలిస్తే, కులాల ఆధారంగా లెక్కించే వ్యక్తులకు అనుకూలంగా గాంధీ ఉన్నారని తెలుస్తోంది.  సెప్టెంబరు 28న, ది బాంబే క్రానికల్‌లో,  అణగారిన తరగతుల జనాభా గణన  ప్రాముఖ్యతను గాంధీజీ నొక్కి చెప్పారు.

మే 6, 1933న హరిజన్‌లో గాంధీ గారు ఇలా రాసారు, “మీరు పూనాలో తీసుకుంటున్న జనాభా గణనలో హరిజనులు ఏ ఉపకులానికి చెందవచ్చనే దాని కోసం ఒక కాలమ్ ఉండాలి. వారి నివాసాలు, నీటి సరఫరా, లైటింగ్, రోడ్ల పరిస్థితి గురించి కూడా వివరణ ఉండాలి” అని గాంధీజీ వ్యాఖ్యానించారు.

మొత్తంగా కుల గణనకు సంబంధించిన గాంధీజీ ఆలోచనలన్నీ ఆయా వర్గాలకు  సామాజిక న్యాయం అందించే దిశగా ఉన్నాయనడానికి ప్రబల నిదర్శనాలున్నాయి.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles