32.1 C
Hyderabad
Wednesday, October 2, 2024

కోట్ల రూపాయల ‘లగ్జరీ కార్లు‘ బూడిద… మంటల్లో కార్గొ షిప్‌!

వాషింగ్టన్: అట్లాంటిక్ మహాసముద్రంలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో కోట్ల రూపాయల ఖరీదు చేసే లగ్జరీ కార్లు నీళ్లపాలయ్యాయి. జర్మనీ ఎండెన్ నుంచి అమెరికాలోని రోడ్ ఐలాండ్ రాష్ట్రంలోని డేవిస్‌విల్లే పోర్టుకు విలాసవంతమైన కార్లను తీసుకెళ్తున్న భారీ నౌక పొర్చోగల్‌లోని అజోర్స్ దీవుల సమీపంలో అగ్నిప్రమాదంలో చిక్కుకుంది. షిప్‌లోని కార్లనీ తగలబడిపోయాయి. కార్గొ షిప్‌లో మంటల్లో చిక్కుకున్న ఒక్కో కారు కోట్ల రూపాయల ఖరీదు చేస్తుంది. వివిధ దేశాల్లోని షోరూమ్‌లకు తరలించేందుకు గాను.. ‘ది ఫెలిసిటీ ఏస్‌‘ ఓడలోకి కార్లను ఎక్కించారు. 11వందలకు పైగా లంబోర్గిని కార్లుండగా.. మిగతావి పోర్షే, ఆడి కార్లున్నాయి. బుధవారం జర్మనీలోని ఎండెన్ పోర్టు నుంచి అమెరికాలోని డేవిస్వల్ రేవుకు పయనమవుతుండగా గురువారం రాత్రి అజోర్స్ దీవుల సమీపంలో నౌకలో మంటలు చెలరేగాయి.
ప్రమాద సమాచారం అందిన వెంటనే ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న పోర్చుగీసు నౌకాదళం, వాయుసేన రంగంలోకి దిగాయి. నౌకలోని 22 మంది సిబ్బందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పెలిసిటీ ఏస్లో 3,965 ఫోకా వ్యాగన్ ఏజీ వాహనాలు ఉన్నట్లు అమెరికాలోని ఆ సంస్థకు సంబంధించిన ఒక అంతర్గత ఈమెయిల్ ద్వారా తెలుస్తోంది. జర్మనీలోని కేంద్రంగా పనిచేసే ఫోక్సావ్యాగన్ సంస్థ వీటిని ఉత్పత్తి చేసింది. పోక్సావ్యాగన్ ఏజీ వాహనాలతోపాటు పోర్షె, ఆడీ. లాంబోర్గినీ వంటి కార్లను తయారుచేస్తోంది. ప్రమాదానికి గురైన నౌకలో ఈ మోడళ్లన్నీ ఉన్నాయి. ముఖ్యంగా 1100 పోర్షే కార్డు అందులో ఉన్నట్లు కంపెనీ అధికార ప్రతినిధి ల్యూక్ తెలిపారు. అవి అందాల్సిన వినియోగదారులకు డీలర్ల ద్వారా సమాచారాన్ని చేరవేసినట్లు పేర్కొన్నారు. మంటలు ఆర్పి నౌకను ఒడ్డుకు చేర్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఇది నియంత్రణ లేకుండా కొట్టుకుపోతోంది. మూడు ఫుట్‌బాల్ గ్రౌండ్‌ల వైశాల్యంతో ఉన్న ది ఫెలిసిటీ ఏస్ షిప్‌లో కెనడాకు పంపించాలని భావించినా.. మధ్యలో ప్రమాదం జరగడంతో… భారీ నష్టం జరిగినట్లు వోక్స్ వ్యాగన్ ప్రతినిధులు చెబుతున్నారు. ఇక సిబ్బందిలో ఎవరికీ గాయాలు కాలేదని రెస్క్యూ టీమ్ చెబుతోంది. మరోవైపు.. ఈ ఘటనపై సంస్థ ప్రతినిధులు స్పందించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే.. సిబ్బందిని రక్షించడంపైనే దృష్టిపెట్టినట్లు వివరించారు. అయితే.. షిప్‌లో మంటలు ఇంకా మండుతూనే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక.. కార్గొ షిప్‌ను ఒడ్డుకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నామని… ఇప్పటివరకైతే.. నౌకనుంచి ఎలాంటి పర్యావణ హాని కలగలేదని చెబుతున్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles