28.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

తెలంగాణ ఐటీరంగంపై కేంద్రం వివక్ష… సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌ల కేటాయింపులో మొండిచేయి!

న్యూఢిల్లీ: ఐటీ పరిశ్రమలో దేశంలోనే నంబర్‌వన్‌ స్థానానికి తెలంగాణ గట్టి పోటీదారుగా ఎదుగుతున్న తరుణంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంపై వివక్ష కొనసాగుతూనే ఉంది. సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్టీపీఐ)ల కేటాయింపులో మొండిచేయి చూపింది 22 రాష్ర్టాలకు ఈ పార్కులను కేటాయించిన కేంద్రం.. తెలంగాణకు మాత్రం ఇవ్వలేదు. బుధవారం ఐటీ రంగానికి సంబంధించి లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలపై ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సహాయమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ స్పందిస్తూ.. చిన్న నగరాల్లో ఐటీ, ఐటీఈఎస్‌ పరిశ్రమ అభివృద్ధికి కేంద్రం అనేక చర్యలు తీసుకున్నదని చెప్పారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 62 ఎస్టీపీఐలను కేంద్రం ఏర్పాటుచేసినట్టు, ఇందులో 54 ఎస్టీపీఐలు టైర్‌-2, టైర్‌-3 నగరాలు ఉన్నట్టు చెప్పారు.

మధ్యప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, కేరళ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, బీహార్, హర్యానా, గుజరాత్, కర్ణాటక మరియు హిమాచల్ ప్రదేశ్ రాబోయే STPI జాబితాలో ఉన్నాయి. 22 STPIలలో, వాటిలో మెజారిటీ బిజెపి పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ మరియు కర్నాటకలో ఈ రాష్ట్రాలలో ఉన్న STPIలకు అదనంగా వస్తున్నాయి.
తెలంగాణలో, హైదరాబాద్, వరంగల్‌లో రెండు STPIలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) కేటాయించాలన్న తెలంగాణ అభ్యర్థనను కేంద్రం ఇప్పటికే శీతకన్ను చేసింది.

చిన్న నగరాల్లో ఉద్యోగాల కల్పనకు కేంద్రం ఇండియా బీపీవో ప్రమోషన్‌ స్కీమ్‌ (ఐబీపీఎస్‌), నార్త్‌ ఈస్ట్‌ బీపీవో ప్రమోషన్‌ స్కీమ్‌ (ఎన్‌ఈబీపీఎస్‌) పథకాలను కేంద్రం ప్రవేశపెట్టిందని తెలిపారు. బీపీఓ/ ఐటీఈఎస్ కార్యకలాపాలను సెటప్ చేయడానికి మూలధనం, కార్యాచరణ వ్యయాలకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ రూపంలో ఒక్కో సీటుకు 1 లక్ష వరకు ఖర్చు చేయనున్నారు నెక్ట్స్‌ జనరేషన్‌ ఇంక్యుబేషన్‌ స్కీమ్‌ (ఎన్‌జీఐఎస్‌)ను కేంద్రం ఆమోదించినట్టు పేర్కొన్నారు. ఇందులో భాగంగా టైర్‌-2, టైర్‌-3 నగరాల్లో 12 ఎస్టీపీఐ సెంటర్లలో సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తుల ఇంక్యుబేషన్‌ సౌకర్యం అభివృద్ధికి రూ.95.03 కోట్లు కేటాయించినట్టు మంత్రి వివరించారు. మంత్రి చెప్పిన ఇన్ని పథకాల్లో తెలంగాణకు ఏ ఒక్కటీ దక్కకపోవడం రాష్ట్రం పట్ల కేంద్రం చూపుతున్న వివక్షకు నిదర్శనం. రాష్ట్రం ఐటీ రంగంలో కీలకంగా ఎదిగినా ఎస్టీపీఐ కేటాయింపులో కేంద్రం మరోసారి తన నైజాన్ని చాటుకొన్నది.

 

 

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles