26.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

సంక్షేమ పథకాలు ప్రకటించే ముందే నిధుల గురించి ఆలోచించండి: సుప్రీంకోర్టు!

న్యూఢిల్లీ: ప్రభుత్వం ఏదైనా స్కీమ్‌ను రూపొందించేటప్పుడు ఎల్లప్పుడూ ‘ఆర్థిక అంశాల్ని’ దృష్టిలో ఉంచుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. దానికి ఉదాహరణగా విద్యాహక్కు చట్టాన్ని ప్రస్తావించింది. మ్యాట్రిమోనియల్ హోమ్‌లలో వేధింపులకు గురవుతున్న మహిళలకు సమర్థవంతమైన న్యాయ సహాయం అందించడానికి, వారి కోసం షెల్టర్ హోమ్‌లను రూపొందించడానికి దేశవ్యాప్తంగా తగిన మౌలిక సదుపాయాలను కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారిస్తున్న జస్టిస్ యు. యు. లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. మీరు ఈ రకమైన పథకాలు లేదా ఆలోచనలతో వచ్చినప్పుడల్లా ఆర్థిక ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకోవాలని “మేము మీకు సలహా ఇస్తున్నామని న్యాయమూర్తులు ఎస్‌ఆర్ భట్, పిఎస్ నరసింహాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. విద్యాహక్కు చట్టమే దీనికి చక్కటి ఉదాహరణ అని కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) ఐశ్వర్య భాటికి… సుప్రీం ధర్మాసనం తెలిపింది. “మీరు ఒక హక్కును సృష్టించారు. కాబట్టి, పాఠశాలలను మున్సిపాలిటీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ అధికారులు ఏర్పాటు చేస్తారు. అయితే ఆ స్కూళ్లకు ఉపాధ్యాయులు ఎక్కడినుంచి వస్తారు అని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది.

కొన్ని రాష్ట్రాల్లో శిక్షా మిత్రలు ఉన్నారని, వీరికి కనీస వేతనాలు చెల్లించకుండా కేవలం రూ. 5,000 ఇస్తున్నారని ధర్మాసనం పేర్కొంది. దీనిపై రాష్ట్రాన్ని కోర్టు అడిగినప్పుడు బడ్జెట్‌లో పరిమితి ఉందని వారు చెబుతున్నారు. దీనిపై పర్యవేక్షణ ఉండాలి. లేకపోతే వట్టి మాటగానే మిగిలిపోతుందని కోర్టు పేర్కొంది. ముందుగా కోర్టు నిర్దేశించిన విధంగా వివరాలను ఇచ్చేందుకు కొంత సమయం కావాలని లేఖను పంపినట్లు ప్రారంభంలోనే అదనపు సొలిసిటర్ జనరల్ భటి ధర్మాసనానికి తెలిపారు.

డివి యాక్ట్ (గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం, 2005) కింద వివిధ రాష్ట్రాలు చేస్తున్న ప్రయత్నాలకు మద్దతునిచ్చే కేంద్ర కార్యక్రమాలు/ప్రణాళికల స్వభావానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. బుధవారం విచారణ సందర్భంగా, అదనపు సొలిసిటర్ జనరల్ ఎఎస్‌జి భటి… దీనిపై చాలా పురోగతి సాధించామని బెంచ్‌కు చెప్పారు. వివరాలను తెలిపే నోట్‌తో పాటు స్టేటస్ రిపోర్ట్‌ను దాఖలు చేయవచ్చని బెంచ్ ఏఎస్‌జీకి తెలిపింది. రాష్ట్రాలతో చాలా చర్చలు, సంప్రదింపులు జరిగాయి. అన్ని రాష్ట్రాలతో సమిష్టిగా ఒక సమావేశం జరిగింది…..,” అని భాటి అన్నారు, దీనికి సమాధానంగా కోర్టు “అందుకే మేము కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే నోటీసు ఇచ్చాము. అనేక ఫిర్యాదులు మాకు వద్దు” అని ధర్మాసనం పేర్కొంది. కొత్త చట్టం రూపొందించినపుడు, ఆ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలకూ ఉందని సూచించింది “రాష్ట్ర వనరులు దీనికి సహకరించపోవచ్చు. రాష్ట్రాలపై పడే ఆర్థిక ప్రభావాన్ని అంచనా వేయకుండా, మీరు దీన్ని తీసుకొచ్చారు. అటువంటపుడు దీన్ని నెరవేర్చాల్సిన హక్కు కేంద్రానికి ఉందని బెంచ్ పేర్కొంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles