32.1 C
Hyderabad
Wednesday, October 2, 2024

కరోనా మరణాల లెక్కపై భారత్‌ అభ్యంతరం… డబ్య్లు.హెచ్‌.ఓ నివేదికను ఖండించిన ఇండియా‌!

న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా దేశాలు అధికారికంగా ప్రకటించిన గణాంకాలతో పోలిస్తే కరోనా మరణాలు 1.5 కోట్లు అధికంగా ఉంటాయని డబ్ల్యూహెచ్‌వో అంచనా వేసింది. దీంతో భారత్‌లోనూ మరణాలు కనీసం 40 లక్షలుగా ఉంటాయని లెక్కగట్టింది. ”ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలను లెక్కించే క్రమంలో మొత్తం మరణాల సంఖ్య, గతంలో వేసిన అంచనాల కంటే చాలా ఎక్కువగా ఉందని డబ్ల్యూహెచ్‌వో గుర్తించింది. కానీ, భారత్ వ్యక్తం చేస్తోన్న అభ్యంతరాల రీత్యా కరోనా మరణాల తాజా నివేదికను మరికొన్ని నెలల పాటు విడుదల చేయలేని పరిస్థితి తలెత్తిందని” ఆ కథనంలో పేర్కొంది. కరోనా మరణాల కచ్చితమైన సంఖ్యను విడుదల చేయడంలో డబ్ల్యూహెచ్‌వోకు భారతదేశం సహకరించడం లేదని అందులో ఆరోపించింది.

ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ దేశంలో మరణ మృదంగం వినిపించింది. ఆస్పత్రుల్లో శవాల కుప్పలు కనిపించాయి. శ్మశానాల్లో అనాథ శవాలు కనిపించాయి. ఈ క్రమంలోనే ఇండియాలో కరోనా మహమ్మారి కారణంగా 40 లక్షల మంది మరణించారంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్.వో) చేసిన ప్రకటనపై కేంద్రప్రభుత్వం ఖండించింది. మండిపడింది. కరోనా వల్ల మృతిచెందిన వారి సంఖ్యను  లెక్కించడానికి డబ్ల్యూహెచ్.వో అనుసరించిన విధానాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రశ్నించింది.

‘డబ్ల్యూహెచ్ వో గణాంకాల పట్ల భారత్ అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. ఇందుకు అనుసరించిన విధానంపైనే మా అభ్యంతరం. చైనా, బంగ్లాదేశ్, ఇరాన్ సిరియా సైతం మరణాల లెక్కింపునకు అనుసరించిన విధానాన్ని ప్రశ్నించాయి. ఏవో కొద్ది శాంపిల్ సైజు వివరాలతో మరణాలను అంచనా కట్డడం ట్యునీషియా వంటి చిన్న దేశాలకు చెల్లుతుందేమో కానీ, 130 కోట్ల మంది ఉన్న భారత్ వంటి పెద్ద దేశాలకు కాదు. భారత్ నమూనా కచ్చితత్వంతో కూడుకున్నది’’అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టం చేసింది.

‘ఈ విశ్లేషణలో మరణాల సంఖ్యను టైర్ 1‌ కేటగిరీలో ఉన్న దేశాల ప్రకారం తీసుకున్నారు. ఆ దేశాలకు ఉపయోగించే గణన విధానాన్ని టైర్‌-2 దేశాలకు కూడా వినియోగించారు. భారత్, టైర్-2 కేటగిరీకి చెందిన దేశం. కరోనా మరణాల ఫలితాలపై భారత్ ఫిర్యాదు చేయట్లేదు. కేవలం వాటిని లెక్కించేందుకు అనుసరించిన పద్ధతినే మేం ప్రశ్నిస్తున్నాం” అని భారత్ వ్యాఖ్యానించింది.

డబ్ల్యూహెచ్‌వోకు రాసిన ఆరు లేఖల్లో తమ ఆందోళనను భారత్ వ్యక్తపరిచింది. దీనితో పాటు చైనా, ఇరాన్, బంగ్లాదేశ్, సిరియా, ఇథియోపియా, ఈజిప్టు వంటి సభ్యదేశాలకు ఉపయోగించిన గణన పద్ధతిపై కూడా ప్రశ్నించింది. భౌగోళిక స్థితి, జనసాంద్రతపై భారత్ ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేసింది.

‘అతిపెద్ద భౌగోళిక విస్తీర్ణం, జనాభా ఉన్న భారత్‌ కోసం ఈ విధానాన్ని ఎలా ఉపయోగిస్తారు? ఈ విధానం తక్కువ జనాభా ఉండే చిన్న దేశాలకు సరిపోతుంది” అని భారత్ లేఖలో పేర్కొంది.

”అదనపు మరణాలను అంచనా వేయడం కోసం… టైర్-1 దేశాల డేటాను, భారత్‌లోని 18 రాష్ట్రాలకు చెందిన ధ్రువీకృతం కాని డేటాను ఉపయోగిస్తే పూర్తిగా విరుద్ధమైన ఫలితాలు వస్తాయి. ఒకవేళ ఈ విధానం పూర్తిగా విశ్వసనీయమైనదని మీరు భావిస్తే, దీన్ని టైర్-1 దేశాలకు వర్తింపజేసి వాటి ఫలితాలను ప్రచురించండి” అని భారత్ వ్యాఖ్యానించింది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles