30.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

కొత్త కార్మిక చట్టాలు వచ్చేస్తున్నాయ్‌… ఇకపై 12 గంటలు పని చేయాల్సిందే!

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొత్త కార్మిక చట్టాలను జులై 1 నుంచి అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కొత్త చట్టాల అమల్లోకి వస్తే కార్మికుల వేతనాలు, భవిష్య నిధితో పాటు పనిగంటల సహా తదితర అంశాల్లో సమూల మార్పులు చోటుచేసుకుంటాయి. పెట్టుబడులను, ఉద్యోగ అవకాశాలను పెంచడానికి ఈ నాలుగు కొత్త కార్మిక చట్టాలను తెస్తున్నట్టు ఇప్పటికే కేంద్రం వెల్లడించింది. వేతనాలు, సామాజిక భద్రత, కార్మిక సంక్షేమం, ఆరోగ్యం, రక్షణ, పని పరిస్థితులు తదితర అంశాల్లో ఆశిస్తున్న సంస్కరణలు ఈ చట్టాల ద్వారా సాధించాలని కేంద్రం భావిస్తోంది.

జూలై 1 నుంచి కొత్త లేబర్ కోడ్‌లను అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే, కొన్ని రాష్ట్రాలు ఇంకా నాలుగు లేబర్ కోడ్‌ల కింద నిబంధనలను రూపొందించలేదు. 23 రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు (UTలు) మాత్రమే వేతనాలపై కోడ్ ముసాయిదా నిబంధనలను రూపొందించాయి.

కొత్త  లేబర్‌ కోడ్స్‌, మార్పులు
జూలై  1వ తేదీ నుంచి కొత్త కార్మిక చట్టాలు అమలైతే, ఆఫీసు పని గంటలను 8-9 గంటల నుండి 12 గంటల వ‌ర‌కు పెంచవచ్చు. అయితే పనిగంటలు పెరిగితే ఉద్యోగులకు మూడు  వీక్లీ ఆఫ్‌లు ఇవ్వడం త‌ప్పనిసరి. అలాగే ఆఫీస్ పనివేళలను మార్చుకోవడానికి కంపెనీలకు వీలుంటుంది. కాబట్టి, వారంలో పనిదినాలు నాలుగు రోజులకు తగ్గించబడతాయి, కానీ వారంలో మొత్తం పని గంటలు ప్రభావితం కావు. కొత్త వేతన కోడ్ ప్రకారం వారానికి మొత్తం 48 పని గంటలు తప్పనిసరి.

కొత్త వేతన కోడ్ ప్రకారం టేక్-హోమ్ జీతం కాంపోనెంట్, ప్రావిడెంట్ ఫండ్‌కు యజమానుల సహకారంలో మార్పు ఉంటుంది.  స్థూల నెలవారీ జీతంలో కనీసం 50 శాతం బేసిక్ జీతం ఉంటుంది కాబట్టి ఉద్యోగుల టేక్-హోమ్ జీతం కూడా గణనీయంగా మారుతుంది. ఇది ఉద్యోగి, యజమాని పీఎఫ్ కంట్రిబ్యూషన్లు పెరుగుతాయి. కొంత మంది ఉద్యోగులకు, ముఖ్యంగా ప్రైవేట్ రంగ ఉద్యోగులకు టేక్‌ హోం జీతం తగ్గుతుంది. అయితే  ఉద్యోగి పదవీ విరమణ తర్వాత వచ్చే డబ్బు, గ్రాట్యుటీ మొత్తం పెరుగుతుంది.

కాగా కేంద్ర ప్రభుత్వ నాలుగు కొత్త లేబర్ కోడ్స్ అమలుకు కేంద్రం యోచిస్తోంది. వేతనాలు, సామాజిక భద్రత, పారిశ్రామిక సంబంధాలు, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం- పని పరిస్థితులు లాంటి అంశాల ఆధారంగా 29 కేంద్ర కార్మిక చట్టాలను  విలీనం చేసి ఈ కొత్త కోడ్స్‌ను  రూపొందించింది.

కొత్త లేబర్‌ కోడ్‌ అమలు అనంతరం 180 రోజుల పని తర్వాత సెలవులకు అర్హులు. అంతకుముందు దీని కాల వ్యవధి 240 రోజులు. రోజుకు 10 గంటలు పనిచేసే వారికి రెండు వారాల సెలవులు ఉంటాయి. రోజుకు 8 గంటలు పని చేసే వారికి ఒక వారం సెలవు ఉంటుంది. ఏ కార్మికుడు వారానికి 48 గంటల కంటే ఎక్కువ పని చేయకూడదు. కొత్త లేబర్ కోడ్ కంపెనీలకు కార్మికులను తొలగించడాన్ని సులభతరం చేస్తుంది. 300 కంటే తక్కువ మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలు ఉద్యోగులను తొలగించాల్సి వస్తే ప్రభుత్వ ముందస్తు అనుమతి తీసుకోవలసిన అవసరం లేదు. అలాగే ఉద్యోగులకు పాన్-ఇండియా కనీస వేతనం నిబంధన కూడా ఉంటుంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles