30.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

ప్రభుత్వ పాఠశాలల్లోనూ… ప్రతినెలా పేరెంట్ టీచర్ మీటింగ్‌ నిర్వహించాలి!

హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చదువులో మెరుగ్గా రాణించేందుకు ప్రతి నెలా పేరెంట్ టీచర్ మీటింగ్‌లను (PTM) నిర్వహించాలని పాఠశాల విద్యా డైరెక్టరేట్  ఆదేశించింది. ఈ విద్యా సంవత్సరం నుండి , అంటే 2022-23 ఆరంభం కానుంది. ఈ ప్రకియ ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతుందని చెబుతున్నారు.

ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో పేటీఎంల నిర్వహణకు సంబంధించి తల్లిదండ్రులతో మమేకమై విద్యార్థుల అభ్యాసన ప్రక్రియను మెరుగుపరిచేందుకు గత నెలలో జిల్లా విద్యాశాఖాధికారులతో (డీఈఓ) నిర్వహించిన సమీక్షా సమావేశంలో వివరణాత్మక చర్చ జరిగిన నేపథ్యంలో పాఠశాల విద్యా డైరెక్టరేట్ ఈ నిర్ణయం తీసుకుంది.

డైరెక్టరేట్ ఇటీవల జారీ చేసిన ప్రొసీడింగ్స్ ప్రకారం, అన్ని ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల పాఠశాలలు ప్రతి నెల మూడవ శనివారం పేరెంట్ టీచర్ మీటింగ్‌ (PTM)లను నిర్వహించాలి. మూడో శనివారం సెలవుగా ఉంటే, నెలలో నాలుగో శనివారం సమావేశాన్ని నిర్వహించాలని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రస్తుతం విద్యాకమిటీకి  ఎన్నికైన తల్లిదండ్రులు మాత్రమే, అంటే, ప్రతి తరగతి నుండి ముగ్గురు తల్లిదండ్రులు మాత్రమే పాఠశాల మేనేజ్‌మెంట్ కమిటీ (SMC) సమావేశాలలో పాల్గొంటున్నారు.  ఈ సమావేశాలు… పిల్లల నమోదు, హాజరు, డ్రాపౌట్లు, పనితీరు, పాఠశాల హెడ్మాస్టర్, సిబ్బందితో వివిధ సమస్యల గురించి చర్చించడానికి రెండు నెలలకొకసారి నిర్వహిస్తున్నారు.  పాఠశాల అభివృద్ధి కార్యకలాపాల్లో చాలా మంది తల్లిదండ్రులు వాస్తవంగా పాలుపంచుకోరు.

పాఠశాల శ్రేయస్సు కోసం తల్లిదండ్రుల సూచనలను వినడంతో పాటు, వారి ప్రాతినిధ్యాన్ని విస్తృతం చేయడానికి, ప్రతి నెలా ప్రభుత్వ,  స్థానిక సంస్థల పాఠశాలల్లో పేరెంట్ టీచర్ మీటింగ్‌ (PTM) లు తప్పనిసరి చేశారు.

ఈ  సమావేశాల్లోనే సమయంలో  ప్రతి పిల్లవాడు, సంబంధిత తరగతి సాధించిన విజయాలతో పాటు విద్యా కార్యక్రమాలను అంచనా వేయాలని కోరారు. విద్యార్థుల అకడమిక్ ఎదుగుదలతో పాటు పాఠశాల అభివృద్ధి కార్యకలాపాల్లో తల్లిదండ్రులను కీలక వాటాదారులుగా చేర్చుకోవాలని పాఠశాల విద్యా డైరెక్టరేట్  ఆయా స్కూళ్లను కోరింది.

పేరెంట్ టీచర్ మీటింగ్‌ల నిర్వహణకు సంబంధించి అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల హెచ్‌ఎంలకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని డీఈవోలందరికీ పాఠశాల విద్యా డైరెక్టరేట్ జీవో జారీ చేసింది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles