30.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

ప్రభుత్వ పెన్షనర్లు వచ్చే ఏడాది మార్చి 31లోగా లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వాలి!

హైదరాబాద్: ప్రభుత్వ పెన్షన్‌ దారులు, ఫ్యామిలీ పెన్షనర్లు 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏటా మాదిరిగానే పెన్షన్‌ కోసం వార్షిక ధ్రువీకరణ పత్రం అందజేయాల్సి ఉంటుంది. ఈ పత్రాలను మార్చి 31, 2023లోగా అవసరమైన అన్ని పత్రాలను సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వం గురువారం కోరింది.

హైదరాబాద్, సికింద్రాబాద్‌కు చెందిన పింఛనుదారులు ధృవీకరణ సర్టిఫికేట్‌తో పాటు, తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్న గెజిటెడ్ అధికారిచే ధృవీకరించబడిన  పాస్‌పోర్ట్-సైజ్ ఫోటోను సమర్పించాల్సి ఉంటుంది.

ధ్రువీకరణ పత్రాలను పోస్ట్ ద్వారా లేదా వ్యక్తిగతంగా సమర్పించవచ్చు. పెన్షనర్లు బయోమెట్రిక్ పద్ధతి, ఆధార్ కార్డ్‌ని ఉపయోగించి T-APP ఫోలియో మొబైల్ అప్లికేషన్ లేదా మీ-సేవాలో కూడా ఉపయోగించవచ్చు.  జీవన్ ప్రమాణ్ వెబ్‌సైట్‌ను ద్వారా  కూడా పత్రాలను పంపవచ్చు. అయితే T-APP ద్వారా తమ సర్టిఫికెట్లను సమర్పించే పెన్షనర్లకు ప్రాధాన్యత ఇస్తారు. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 1 నుండి ప్రారంభమవుతుంది.

టీ మొబైల్‌ యాప్‌ ద్వారా దృవీకరణ పత్రాలు సమర్పించవచ్చని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పెన్షనర్లు సుదూర ప్రాంతాల నుండి ట్రెజరీ కార్యాలయాలకు రావడంలో ఎదుర్కొనే ఆర్థిక, శారీరక భారం నుంచి బయటపడినట్లవుతుంది.

టీ మొబైల్‌ యాప్‌…

  • ఆండ్రాయిడ్‌ సెల్‌ఫోన్‌లో టీ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
  • సెల్‌ నంబర్, ఈ మెయిల్‌ ద్వారా రిజిష్ట్రేషన్‌ చేసుకోవాలి. ఆ తర్వాత యూజర్‌ ఐడీగా సెల్‌ నంబర్‌ మారుతుంది. పిన్‌ను పాస్‌వర్డ్‌గా సెట్‌ చేసుకోవాలి.
  • సెల్‌ నంబర్, పాస్‌ వర్డ్‌ను ఎంటర్‌ చేయడం ద్వారా లాగిన్‌ అవ్వాలి. అనంతరం పెన్షనర్‌ మాన్యువల్‌ వెరిఫికేషన్‌ ఆప్షన్‌ ద్వారా ఎంటర్‌ అవ్వాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్‌ ఆప్షన్‌ ఎంపిక చేసుకుని బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌ లేదా పెన్షనర్‌ ఐడీ నంబర్‌ నమోదు చేయాలి. ఓటరు ఐడీ కార్డు కార్డుపై ఉండే ఎపిక్‌ నంబర్, అసెంబ్లీ నియోజకవర్గం పేరు నమోదుచేయాలి.
  • అనంతరం ఒక సెల్ఫీ తీసుకోవాలి. ఆ సెల్ఫీఫొటో ఎపిక్‌ కార్డులోని ఫొటోతో వెరిఫై చేయబడి ఆమోదించినట్లు వెరిఫికేషన్‌ నంబర్‌ వస్తుంది. ఆ మెసేజ్‌ సంబంధిత ట్రెజరీ కార్యాలయానికి చేరుతుంది.
  • ట్రెజరీ కార్యాలయంలో అధికారి తనకు వచ్చిన వివరాలు, తన వద్ద అందుబాటులో ఉన్న వివరాలతో పోల్చి చూసుకుని ఆమోదిస్తారు.
  • దీని ద్వారా పెన్షనర్లు సుదూర ప్రాంతాల నుంచి ట్రెజరీ కార్యాలయానికి వచ్చే ఇబ్బంది ఉండదు. బ్యాంకులు, మీసేవ కేంద్రాలకు వెళ్లే అవసరం ఉండదు. ఇంటివద్దనే ఉండి ధ్రువీకరణ పత్రం అందజేయవచ్చు. ప్రస్తుతం మొబైల్‌ యాప్‌తో ధ్రువీకరణ పత్రం ఇచ్చే సదుపాయం కల్పించిన మొదటి రాష్ట్రం తెలంగాణ.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles